Jio Phone Next: జియోకు కొత్త చిక్కులు.. జియో నెక్ట్స్‌ ఫోన్‌ ధర పెరగనుందా..?

Jio Phone Next: టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో సంచలనం సృష్టి్స్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అతి చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల..

Jio Phone Next: జియోకు కొత్త చిక్కులు.. జియో నెక్ట్స్‌ ఫోన్‌ ధర పెరగనుందా..?
Jio Phone Next
Follow us
Subhash Goud

|

Updated on: Sep 16, 2021 | 12:19 PM

Jio Phone Next: టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో సంచలనం సృష్టి్స్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అతి చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ వినాయక చవితి రోజు విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాలతో దీపావళికి వాయిదా వేసింది రిలయన్స్‌. ఫోన్‌ ధర ఎంతనో క్లారిటీ లేకపోయినా ఐదువేల రూపాయలలోపే ఉండే అవకాశం ఉందని ఇప్పటికే టెక్‌ నిపుణులు వెల్లడించారు. ఇక తాజా మరో విషయం బయటకు వచ్చింది. ఈ ఫోన్‌ ధర మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. కారణం ఏంటంటే సెమీ కండక్టర్ల కొరతేనని తెలుస్తోంది. ఈ కారణంగా రిలయన్స్‌ జియోకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యంత చవకైన ‘జియో నెక్ట్స్‌’ ఫోన్‌ ధర మరింత పెరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంచనా ప్రకారం..ఈ ఫోన్‌ ధర రూ.5వేలు ఉండగా.. ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన సెమీకండక్టర్ ధర పెరగడంతో..ఆ ప్రభావం జియో నెక్ట్స్‌ ధరపై పడనున్నట్లు తెలుస్తోంది.

గూగుల్‌-జియో ఆధ్వర్యంలో వినాయక చవితికి విడుదల కావాల్సిన జియో ఫోన్‌..దీపావళికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఫోన్‌ విడుదల వాయిదా వేయడంతో ధర మరింత పెరగనున్నట్లు మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈటి టెలికామ్‌ రిపోర్ట్‌ ప్రకారం..ఫోన్‌లో వినియోగించే సెమీ కండక్టర్లతో సహా వివిధ భాగాలు ( కాంపోనెంట్స్‌) ధర సుమారు 20శాతం పెరిగింది. ఇక పెరిగిన ధరతో సెమీకండక్టర్ల లభ్యత లోటు 8 నుండి 20 వారాల వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పెరిగిన చిప్‌ ధరలతో జియో ఫోన్‌ పై ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న ధరకే వచ్చే అవకాశం లేదని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ఫోన్‌పై ఇంత ప్రచారం జరుగుతున్నా.. పూర్తి స్థాయిలో ఫోన్‌ అందుబాటులోకి తెస్తుందా? లేదంటే పరిమిత సంఖ్యలోనే విడుదల చేస్తుందా అన్న ప్రచారంపై జియో స్పందించాల్సి ఉంది.

ఇవీ కూడా చదవండి: SBI Car Loan: కారు కొనేవారికి ఎస్‌బీఐ తీపికబురు.. పండగ సీజన్‌లో బంపర్‌ ఆఫర్‌..!

RBI: ఆర్బీఐ కొరఢా.. బ్యాంకులకు లక్షల్లో జరిమానా.. తాజాగా మరో బ్యాంకుకు పెనాల్టీ.. కస్టమర్లపై ప్రభావం పడుతుందా?

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి