Jio Hotstar: జియో హాట్‌స్టార్ వచ్చేసింది.. ఇకపై మ్యాచులకు డబ్బులు కట్టాల్సిందే..
రిలయన్స్, డిస్నీల భాగస్వామ్యంతో కొత్తగా జియో హాట్ స్టార్ ను లాంచ్ చేశారు. దీంతో ఓటీటీ యూజర్లకు డబుల్ ధమాకా లభిస్తోంది. రెండు ఓటీటీ వేదికల కంటెంట్ ను ఒకే సబ్ స్క్రిప్షన్ తో ఒకే వేదికపై వీక్షించే చాన్స్ దక్కింది. ఫిబ్రవరి 14 న జియో హాట్ స్టార్ ను అట్టహాసంగా లాంచ్ చేశారు.

రిలయన్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జాయింట్ వెంచర్ అయిన జియో హాట్ స్టార్ ఇప్పుడు అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇది నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ ను వెనక్కి నెట్టి బలమైన ఓటీటీ ప్లాట్ ఫాంగా అవతరించింది. ఇప్పటివరకు వేరు వేరుగా అందిస్తున్న ఈవెంట్ లను ఇప్పుడీ సంస్థలు కలిసి అందించనున్నాయి. ఇకపై ఐపీఎల్ క్రికెట్, ఐసీసీ టోర్నమెంట్ల కోసం రెండు వేదికలు అవసరం లేకుండా రెంటినీ జియో హాట్ స్టార్ లోనే ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు.. డిస్నీ, వారనర్ బ్రదర్స్, హెచ్ బీవో, ఎన్ బీసీ యూనివర్సల్ సికాక్, పారామౌంట్ వంటి అంతర్జాతీయ స్టూడియోల కంటెంట్ ను కూడా ఒకే సబ్ స్క్రిప్షన్ తీసుకుని చూసేయొచ్చు. ఇంతకు ముందు ఈ కంటెంట్ వేరు వేరుగా వేదికలపై లభించేది. ఇప్పుడీ రెండు సంస్థలు చేతులు కలపడంతో ఒకే వేదికగా మారింది. అయితే 2025 క్రికెట్ మ్యాచులు చూడాలంటే ప్లాన్ ను కొనుగోలు చేయాల్సిందే.
జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ధరలు..
ప్రస్తుతం జియో హాట్ స్టార్ ఉచితంగానే సేవలు అందిస్తోంది. అయితే అందులో పరిమిత కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉందా పూర్తి స్థాయి కంటెంట్ లభిస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక వీటి సబ్ స్క్రిప్షన్ ధరలు చూస్తే.. మూడు నెలల పాటు యాడ్స్ తో కూడిన ప్లాన్ రూ.149 నుంచి ప్రారంభమవుతోంది. యాడ్ ఫ్రీ ప్రీమియం టైర్ రూ.499కి అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఉన్న జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రైబర్లు కచ్చితంగా జియో హాట్ స్టార్ కు మారతారు. ఇక జియో సినిమా యాప్ ను నిలిపివేయనున్నారు. ప్రస్తుతం ఈ వేదిక 50 కోట్ల మంది కస్టమర్లను ఉంది. ఈ ఓటీటీ ప్లాన్ ధరలు ఇలా ఉన్నాయి.
మొబైల్ ప్లాన్..
మొబైల్ ప్లాన్ ద్వారా మొబైల్ లో మాత్రమే కంటెంట్ ను చూడగలరు.
మూడు నెలలకు రూ. 149, ఏడాది ప్లాన్ రూ. 499గా ఉంది.
ఒక డివైజ్ కు మాత్రమే అనుమతి.
ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ లైవ్ స్పోర్ట్స్, కొత్త సినిమాలర, ఫోలు, డిస్నీ ప్లస్ ఒరిజినల్స్ కంటెంట్ లభిస్తుంది.
సూపర్ ప్లాన్..
సూపర్ ప్లాన్ ద్వారా రెండు డివైజుల్లో కంటెంట్ ను చూడొచ్చు.
మూడు నెలలకు 299, ఏడాదికి 899 ప్లాన్ చెల్లించాలి.
మొబైల్, వెబ్, లివింగ్ రూమ్ పరికరాల్లో యాక్సెస్ ఉంటుంది.
ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ లైవ్ స్పోర్ట్స్, కొత్త సినిమాలర, ఫోలు, డిస్నీ ప్లస్ ఒరిజినల్స్ కంటెంట్ లభిస్తుంది.
ప్రీమియం ప్లాన్…
ప్రీమియం ప్లాన్ లో నాలుగు డివైజుల్లో యాక్సస్ ఉంటుంది.
నెలకు రూ. 299 / 3 నెలలు రూ. 499 / సంవత్సరానికి రూ. 1499
యాడ్ ఫ్రీ కంటెంట్ లభిస్తుంది (లైవ్ కంటెంట్ లో తప్ప)
అపరిమిత ప్రత్యక్ష క్రీడలు, కొత్త భారతీయ సినిమాలు, షోలు డిస్నీ+ ఒరిజినల్స్ (ఇంగ్లీషుతో పాటు ఎంపిక చేసిన భారతీయ భాషలలో)