SSY: నెలకు రూ. 4 వేలతో రూ. 22 లక్షల రిటర్న్స్.. కేంద్ర ప్రభుత్వ పథకంతో డబుల్ బెనిఫిట్స్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో రెండింతల లాభాలు పొందొచ్చు. ఆడపిల్లలు భవిష్యనిధిగా తీసుకువచ్చిన సుకన్య సమృద్ధి పథకం కూడా ఇలాంటిదే. ఈ స్కీం ద్వారా ఎంత లాభం పొందొచ్చు.. ఎవరు అర్హులు అనేది తెలుసుకుందాం..

ఆడపిల్లు ఉన్న తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సుకన్య సమృద్ధి యోజన స్కీంలో ఇటీవల వడ్డీ రేటును పెంచిన సంగతి తెలిసిందే. ఈ స్కీంలో నెలకు రూ. 4 వేల పెట్టుబడితో రెండింతల బెనిఫిట్స్ ను అందుకోవచ్చు. ఇవి మీ ఇంటి ఆడపిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇలా ఏ అవసరం వచ్చినా చింత లేకుండా గడపొచ్చు. ఇటీవల కేంద్రం ఈ స్కీంలో వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.2కి పెంచింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టిమెంట్ తో భారీ మొత్తాన్ని నిర్ణీత సమయంలో అందించడమే దీని ప్రత్యేకత. ఆడపిల్లలు 10 ఏళ్ల లోపు వారు ఉంటే ఎవరైనా ఈ స్కీం కోసం రాయించుకోవచ్చు.
ఈ స్కీం మెచ్యూరిటీ కాలం 21 సంత్సరాలు. కుమార్తెకు 18 ఏళ్లు నిండిన్పుడు లేదా పెళ్లి, చదువుల నిమిత్తం కూడా దీనిని తిరిగి పొందవచ్చు. ప్రతి నెల రూ.4 వేల చొప్పున జమ చేయడం వల్ల మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినవారవుతారు.
ఎంత కడితే ఎంత లాభం..?
ఉదాహరణకు మీ కుమార్తెకు 5 ఏళ్లు ఉన్నాయనుకోండి.. 2024లో మీరు ఈ పథకంలో చేరారు. 2045 వచ్చేసరికల్లా మీరు రాబడిని పొందొచ్చు. నెల నెలా రూ. 4వేలు జమచేసినా ఏడాదికి ఈ మొత్తం రూ. 48,000 అవుతుంది. ఇలా 15 ఏళ్లపాటు అంటే 2042 వరకు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పథకంలో మీరు జమ చేసిన మొత్తం రూ. 7 లక్షల 20 వేలు అవుతుంది. అప్పుడు మీకు వచ్చే మొత్తం 15.14 లక్షలు అవుతుంది. అదే మీరు పూర్తి మెచ్యూరిటీ సమయానికి తీసుకోగలిగితే ఇది మొత్తం 22 లక్షల 34 వేల రూపాయలు అవుతుంది.
ఎవరు అర్హులు..?
10 ఏళ్ల వయసు ఉన్న ఆడపిల్ల పేరిట పేరెంట్స్ లేదా గార్డియెన్స్ ఈ అకౌంట్ ను తెరవచ్చు. ఒక కుటుంబానికి రెండు అకౌంట్లు మాత్రమే పరిమితం. ఒక వేళ తల్లికి రెండో కాన్పులో కవల ఆడపిల్లలు పుడితే మూడో ఖాతా కూడా తెరవచ్చు.
ఏమేం డాక్యుమెంట్లు కావాలి?
సుకన్య సమృద్ధి ఖాతా తెరిచేందుకు పాప బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్‌వై అకౌంట్ ఓపెనింగ్ ఫామ్, తల్లిదండ్రులు లేదా గార్డియెన్స్ అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ అవసరం అవుతుంది.




