Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలకు రూ. 4,500 పెట్టుబడితో.. రూ.2.5 కోట్ల రాబడి.. అదిరిపోయే ప్లాన్

పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేంత డబ్బు మీ దగ్గర లేదా.. చిన్న మొత్తంలో ఎప్పటికప్పుడు పెట్టుబడి పెట్టే ప్లాన్ కోసం చూస్తున్నారా అయితే సిప్ మీకు సరిగ్గా సరిపోతుంది. క్రమబద్దంగా ఓ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసి భారీ లాభాలను పొందాలనుకునే వారికి ఇది మంచి ఉపాయం. సిప్ గురించిన ఓ ముఖ్యమైన పెట్టుబడి పద్ధతి ఇది..

నెలకు రూ. 4,500 పెట్టుబడితో.. రూ.2.5 కోట్ల రాబడి.. అదిరిపోయే ప్లాన్
Sip Investment Plan
Follow us
Bhavani

|

Updated on: Feb 14, 2025 | 10:08 PM

తక్కువ పెట్టుబడితో కోట్ల ఆదాయం పొందే ఆదాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి. అయితే, అందులో మనకు తగిన వాటిని ఎంచుకోవడంలోనే ఉంది కిటుకు. ఇప్పుడు మనం చెప్పుకునే ప్లాన్ కూడా అలాంటిదే. నెలకు మీరు కేవలం రూ. 4,500 ఇన్వెస్ట్ చేయగలిగితే చాలు. భవిష్యత్తులో అది మీకు కోట్ల ఆదాయన్ని తీసుకురాగలదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి…

మ్యూచువల్ ఫండ్ పథకాలు మార్కెట్ రిస్కులకు లోబడి ఉన్నప్పటికీ భవిష్యత్తులో అవి మనకు మంచి రాబడిని అందిస్తాయి. ఇందులో ఇన్వెస్ట్ చేసే వారికి అన్నింటికన్నా పెద్ద ప్రయోజనం ఒకటుంది. అదే.. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై చక్రవడ్డీని పొందుతారు. ఇది పెట్టుబడిదారులను ద్రవ్యోల్బణం రిస్క్ నుంచి ఎప్పటికప్పుడు కాపాడుతుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి..

మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ అనే ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అసలు సిప్ ఎలా పనిచేస్తుంది.. ఇది మనకు ఏ విధంగా లాభాలను తెచ్చిపెడుతంది అనే విషయాల్లోకి వెళ్తే.. మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ అనేది చాలా సులభమైన పెట్టుబడి పద్ధతి. ఈ పద్ధతి పెట్టుబడిదారుడికి వారానికో నెలవారీగా లేదా ఏడాదికోసారి ఇలా డబ్బును ఆదా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇప్పుడు కేవలం రూ.100 పెట్టుబడులను కూడా అనుమతిస్తున్నాయి.

వడ్డీ రేటు 12 శాతం..

ఈ పథకంలో నెలకు రూ. 4,500 పెట్టుబడి పెడితే రూ.2.50 కోట్లు లక్ష్యాన్ని చేరుకునేందుకు 34 ఏండ్లు పడుతుంది. అంటే మనం పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 18 లక్షల 36 వేలు అవుతుంది. ఇందులో మనం అంచనా వేసిన లాభాలు రూ. 2 కోట్ల 40 లక్షల 51 వేల 842 రూపాయలు. ఇలా సిస్టమాటిక్ ఇన్వెస్టిమెంట్ ద్వారా క్రమంగా మ్యూచువల్ ఫండ్స్ లో పొదుపు చేసే అలవాటు మనలో ఆర్థిక క్రమశిక్షణను సైతం పెంచుతుంది.