AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioHotstar: కేవలం రోజుకు రూ.1.66తో జియో హాట్‌స్టార్‌.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌!

OTT ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలకు వినోదానికి ప్రధాన మార్గంగా మారాయి. గత సంవత్సరం డిస్నీ, రిలయన్స్, వయాకామ్ 18 విలీనాన్ని పూర్తి చేసిన తర్వాత జియో హాట్‌స్టార్ యాప్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందనే చర్చ జరిగింది. ఇప్పుడు వేచి ఉండటం ముగిసింది. ఎందుకంటే మీరు జియో సినిమాలు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కంటెంట్‌ను ఒకే యాప్‌లో చూడవచ్చు.

JioHotstar: కేవలం రోజుకు రూ.1.66తో జియో హాట్‌స్టార్‌.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌!
జియో రూ. 195 డేటా ప్యాక్: ఈ ప్లాన్ 90 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు మొత్తం 15GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌తో JioHotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా 90 రోజుల చెల్లుబాటుకు అందుబాటులో ఉంటుంది.
Subhash Goud
|

Updated on: Feb 17, 2025 | 2:19 PM

Share

జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి రెండు ప్రధాన OTT ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు ఒకటిగా మారాయి. జియో హాట్‌స్టార్ ఒక సరసమైన OTT ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఒక డివైజ్‌కు జియో హాట్‌స్టార్ నెలవారీ సభ్యత్వాన్ని చాలా తక్కువ ధరకు అందిస్తున్నారు. ఈ ప్లాన్ గురించిన సమాచారం జియో హాట్‌స్టార్ యాప్‌లో అందించింది. మొబైల్ వినియోగదారులకు కంపెనీ చౌకైన ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ మూడు నెలలకు రూ.149 ఆఫర్ ధరకు లభిస్తుంది. అంటే నెలకు రూ.50 (రోజువారీ వినియోగం రూ.1.66) చెల్లించి 720 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉన్న ప్లాన్ పొందుతారు.

ఈ ప్లాన్ ప్రకారం.. మీరు చూసే ఏ వీడియో మధ్యలో ప్రకటనలు రావచ్చు. మీరు ఒక సంవత్సరం పాటు ప్లాన్ తీసుకుంటే మీరు రూ.499 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే నెలవారీ ఖర్చు రూ.42 మాత్రమే అవుతుంది.

ఇది కూడా చదవండి: Cash Deposit Limit: బ్యాంకు ఖాతాలో ఎంత డిపాజిట్‌ చేస్తే ఆదాయపు పన్ను శాఖ జరిమానా విధిస్తుంది?

ఇవి కూడా చదవండి

మరో JioHotstar ప్లాన్ రూ.299కి మూడు నెలల పాటు అందుబాటులో ఉంది. అంటే మీరు నెలకు రూ.100 ఖర్చు చేయాలి. ఈ ప్లాన్ 1 సంవత్సరానికి రూ. 899 కు అందుబాటులో ఉంటుంది. అంటే నెలవారీ ఖర్చు రూ. ఈ ప్లాన్ తో మీరు 2 డివైజ్‌లలో (టీవీ, మొబైల్ లేదా ల్యాప్‌టాప్) 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ కంటెంట్‌ను చూడవచ్చు. ఈ ప్లాన్ ప్రకటన రహితం కూడా కాదు. అంటే మీరు వీడియోల మధ్య ప్రకటనలు వస్తుంటాయని గుర్తించుకోండి.

JioHotstar ప్రీమియం:

మూడు నెలల ప్లాన్ ధర రూ.499. అంటే ఈ ప్లాన్ నెలకు రూ.166. మీరు ఈ ప్లాన్‌ను ఒక సంవత్సరం పాటు కొనుగోలు చేస్తే, మీరు రూ.1499. నెలకు రూ.125 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ 4 డివైజ్‌లకు (టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్) మద్దతు ఇస్తుంది.

ఇది కూడా చదవండి: Aadhaar Updates: ఆధార్‌లో ఈ వివరాలు ఒక్కసారి మాత్రమే అప్‌డేట్‌ చేసేందుకు అవకాశం.. అదేంటో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి