AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio IPO Listing: జియో బ్లాక్‌బస్టర్ లిస్టింగ్.. టాప్ బిజినెస్ గ్రూప్‌గా రిలయన్స్ రికార్డ్.. భారీగా పెరిగిన మార్కెట్ క్యాప్

Jio IPO Listing: జియో ప్లాట్‌ఫార్మ్స్ షేర్లు 2026 అక్టోబర్ 28న స్టాక్ మార్కెట్‌లో ఘనంగా లిస్ట్ అయ్యాయి. ఐపీవో ఇష్యూ ధర రూ.1,119తో పోలిస్తే 21.36 శాతం ప్రీమియంతో రూ.1,358 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. లిస్టింగ్ సమయంలో జియో మార్కెట్ విలువ సుమారు రూ.12.5 లక్షల కోట్లకు చేరింది. ఈ పరిణామంతో రిలయన్స్ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ టాటా గ్రూప్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరినట్లు మార్కెట్ నివేదికలు వెల్లడించాయి.

Jio IPO Listing: జియో బ్లాక్‌బస్టర్ లిస్టింగ్.. టాప్ బిజినెస్ గ్రూప్‌గా రిలయన్స్ రికార్డ్.. భారీగా పెరిగిన మార్కెట్ క్యాప్
Jio Platforms Ipo Listing 2026
Shaik Madar Saheb
|

Updated on: Oct 28, 2026 | 12:18 PM

Share

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫార్మ్స్ (Jio Platforms) గ్రాండ్ ఎంట్రీ ఇండియన్ కార్పొరేట్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం (అక్టోబర్ 28, 2026) దలాల్ స్ట్రీట్‌లో జియో షేర్లు ఘనంగా లిస్ట్ కావడంతో.. మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) పరంగా టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టి రిలయన్స్ గ్రూప్ భారత్‌లోనే అత్యంత విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12.5 లక్షల కోట్లను దాటింది.

మార్కెట్ క్యాప్ వర్సెస్ గ్రూప్‌ల ర్యాంకింగ్స్:

జియో మెరుపు లిస్టింగ్ తర్వాత భారతదేశంలోని దిగ్గజ బిజినెస్ గ్రూప్‌ల మార్కెట్ విలువలు ఈ క్రింది విధంగా నమోదయ్యాయి:

మొదటి స్థానం – రిలయన్స్ గ్రూప్: రూ. 28.9 లక్షల కోట్లు

రెండో స్థానం – టాటా గ్రూప్: రూ. 25.6 లక్షల కోట్లు

మూడో స్థానం – అదానీ గ్రూప్: రూ. 16.6 లక్షల కోట్లు

రిలయన్స్ గ్రూప్ ఏకంగా రూ. 3.23 లక్షల కోట్ల ఆధిపత్యంతో టాటా గ్రూప్‌ను అధిగమించి అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది.

Reliance Group Market Cap

Reliance Group Market Cap

ఐపీఓ ధరకు 21.4% ప్రిమియంతో ఐకానిక్ లిస్టింగ్:

లిస్టింగ్ ధర: ఐపీఓ ఇష్యూ ధర రూ. 1,119 తో పోలిస్తే దాదాపు 21.4 శాతం ప్రీమియంతో రూ. 1,358 వద్ద జియో షేర్లు మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి.

జియో మార్కెట్ క్యాప్: మొదటి రోజు లిస్టింగ్ ధర ఆధారంగా జియో ప్లాట్‌ఫార్మ్స్ విడిగా రూ. 12.5 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించింది.

నెంబర్ 1 – నెంబర్ 2 కంపెనీలు: రిలయన్స్ ఇండస్ట్రీస్ – జియో ప్లాట్‌ఫార్మ్స్.. ఈ రెండూ మాత్రమే కలిపి రూ. 28.7 లక్షల కోట్ల మార్కెట్ విలువతో భారత్‌లోనే అత్యంత విలువైన మొదటి, రెండో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలుగా చరిత్ర సృష్టించాయి. ఈ రెండు కంపెనీల ఉమ్మడి విలువే టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ కంటే రూ. 3.1 లక్షల కోట్లు ఎక్కువ కావడం విశేషం.

దేశంలోనే భారీ వాటాదారుల బేస్: 79.8 లక్షల మంది (7.98 మిలియన్లు) వాటాదారులతో భారత్‌లోనే అతిపెద్ద షేర్‌హోల్డర్ బేస్ కలిగిన కంపెనీగా జియో అవతరించింది.

సరికొత్త ప్రయాణానికి ఆరంభం – ఆకాశ్ అంబానీ:

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో జరిగిన సాంప్రదాయ గంట మోగించే (Bell-ringing) వేడుకకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ, అనంత్ అంబానీ హాజరయ్యారు.

లిస్టింగ్‌కు ముందు సభను ఉద్దేశించి మాట్లాడిన జియో ప్లాట్‌ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

“నేటి ఈ మార్కెట్ లిస్టింగ్ మా ప్రయాణానికి ముగింపు రేఖ కానే కాదు.. ఇది ఒక కొత్త మైలురాయికి ప్రారంభ రేఖ. మేము ఇన్వెస్టర్లతో పారదర్శకంగా కమ్యూనికేట్ చేస్తాం, ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటాం, అలాగే మా పనుల ద్వారా మీ నమ్మకాన్ని గెలుచుకుంటాం.’’ అని పేర్కొన్నారు.

(గమనిక: ఈ నివేదికలో గ్రూప్ మార్కెట్ క్యాప్ లెక్కింపులో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విలువను మినహాయించి కేవలం ప్రధాన లిస్టెడ్ కంపెనీలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు).

Follow Us