దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. సముద్రం కింద నుంచి ప్రయాణం.. ఇదొక అద్బుతం..
Venkatrao Lella
Images: Pinterest
26 OCT 2026
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న తొలి రైలు పట్టాలెక్కించేందుకు ముమ్మర ప్రయత్నాలు నడుస్తున్నాయి. అయితే ఈ రైలుకు సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
ఈ రైలు పెద్ద పెద్ద సొరంగాలు, వంతెనలు, ట్రాక్‌ల గుండా ప్రయాణించనుంది. తొలి రైలు అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ మార్గంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కారిడార్‌లో ముంబైలో ఒక స్టేషన్ 100 అడుగుల లోతులో నిర్మిస్తున్నారు.
సముద్రం కింద 7 అడుగుల కిలోమీటర్ల మేర సొరంగం నిర్మిస్తున్నారు. ఈ సొరంగం గుండా బుల్లెట్ రైలు వెళ్తుంది. ముంబైలోని బాంద్రా కూర్లా కాంప్లెక్స్‌కు 100 అడుగుల కింద బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మిస్తున్నారు. ఇది ఒక ఇంజినీరింగ్ అద్బుతం.
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్‌లో ఏకైక భూగర్బ బుల్లెట్ రైలు స్టేషన్‌గా ఇది నిలవనుంది. ముంబై వ్యాపార కేంద్రానికి ఈ కాంప్లెక్స్ గుండెకాయలా చెప్పవచ్చు. ఇక్కడ ఈ స్టేషన్ నిర్మాణం జరుగుతోంది.
ఈ బుల్లెట్ రైల్వే స్టేషన్ కోసం 100 అడుగుల లోతులో తవ్వకాలు చేపడుతున్నారు. మూడు అంతస్తుల భవనం నిర్మిస్తుండగా.. ఇందులో ఫ్లాట్ ఫారాలు, కాన్ కోర్సులు, సర్వీస్ ఏరియా ఉంటుంది. ఆరు ఫ్లాట్ ఫామ్‌లు ఇక్కడ ఉంటాయి.
ఈ స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోని నీటి అడుగున రైలు సొరంగం నిర్మిస్తున్నారు. బుల్లెట్ రైలు ఈ సొరంగం గుండా వెళ్లనుంది. ఈ సొరంగం 21 కిలోమీటర్ల మేర ఉంటుంది
21 కిలోమీటర్లలో 7 కిలోమీటర్ల మేర థానే క్రీక్ కింద నుంచి రైలు వెళ్తుంది. దేశంలోనే తొలి భూగర్బ రైలు సొరంగంగా దీనిని చెప్పవచ్చు. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌లో ట్రైన్స్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. రైళ్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ మార్గం 508 కిలోమీటర్లు ఉంటుంది.
మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా నగర్ హావేలి గుండా ఈ బుల్లెట్ రైలు మార్గం వెళుతుంది. మొత్తం 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. ముంబై, థానే, విరార్, సూరత్, అహ్మదాబాద్ లాంటి స్టేషన్లు ఉన్నాయి.