JIO Newest Plan : జియో సరికొత్త ప్లాన్..! అపరిమిత వాయిస్ కాలింగ్, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం..
JIO Newest Plan : టెలికాం రంగంలో సత్తా చాటుతున్న రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకునేందుకు
JIO Newest Plan : టెలికాం రంగంలో సత్తా చాటుతున్న రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రోజురోజుకు కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. చాలా మంది రిలయన్స్ జియో వాడుతున్నవారే ఉన్నారు. కస్టమర్లను మరింతగా చేర్చుకునేందుకు జియో కొత్త కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తోంది. తాజాగా జియో మరో సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడాది పాటు కాలపరిమితి ఉండే ఈ ప్లాన్ రూ.3,499కి లభించనుంది. ఈ ప్లాన్ తీసుకుంటే రోజుకు 3జీబీ డేటా చొప్పున మొత్తం 1095జీబీ 4జీ డేటాను పొందవచ్చు. రోజులో 3జీబీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత నెట్ వేగం 64కేబీపీఎస్‌కు పడిపోతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి.
అంతేకాకుండా కొత్త ప్లాన్ కింద చాలా ఆఫర్లను అందిస్తోంది. జియో యాప్స్‌ను వినియోగించుకోవడంతో పాటు, ఏడాది కాలపరిమితి గల డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించనుంది. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్ ప్రయోజనాలు పొందవచ్చు. ఏడాది కాలపరిమితి కలిగి రోజుకు 3జీబీ డేటా అందించే విధంగా ఇప్పటివరకూ జియో ఎలాంటి ప్లాన్‌లను తీసుకురాలేదు. అయితే రూ.999 పథకం ద్వారా రోజుకు 3జీబీ డేటాను 84 రోజులు, రూ.401 ప్రీపెయిడ్ ప్లాన్‌తో 28 రోజుల పాటు 90జీబీ(రోజుకు 3జీబీ) డేటాను జియో అందిస్తోంది. ఈ పథకాల కాలపరిమితి కలిగిన రోజులకు డిస్నీ+ హాట్ స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
జియో రాకతో ఇంటర్‌నెట్ వినియోగం బాగా పెరిగింది. వేగమైన ఇంటర్‌నెట్‌ను అందించే 4జీ సేవలను అత్యంత తక్కువ ధరకు అందిచండంతో వినియోగదారులు జియోకు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకర్షించిన సంస్థగా జియో రికార్డు సృష్టించింది. ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్‌లను సవరిస్తుంది కాబట్టే జియోకు ఇంత ఆదరణ పెరిగింది. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత డేటా వాడకం ఎక్కువ అయ్యింది. ఇక ముఖ్యంగా జియో అడుగు పెట్టిన తర్వాత డేటా వాడకం మరింత అధికమయ్యింది.