Jio: 40.5 కోట్లకు చేరిన జియో యూజర్ల సంఖ్య.. 15.7 లక్షల మంది చందాదార్లను కోల్పోయిన వొడాఫోన్‌ఐడియా..
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఏప్రిల్ నెలకు సంబంధించి మొబైల్ యూజర్ల సంఖ్యను వెల్లడించింది. టెలికం కంపెనీ రిలయన్స్ జియో ఏప్రిల్‌లో కొత్తగా 16.8 లక్షల మంది మొబైల్ చందాదార్లను దక్కించుకుంది...
టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఏప్రిల్ నెలకు సంబంధించి మొబైల్ యూజర్ల సంఖ్యను వెల్లడించింది. టెలికం కంపెనీ రిలయన్స్ జియో ఏప్రిల్‌లో కొత్తగా 16.8 లక్షల మంది మొబైల్ చందాదార్లను దక్కించుకుంది. దీంతో సంస్థ మొత్తం మొబైల్ యూజర్ల సంఖ్య 40.5 కోట్లకు పెరిగింది. ఎయిర్‌టెల్ ఖాతాలో నూతనంగా 8.1 లక్షల మంది చేరికతో మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 36.11 కోట్లను చేరింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం.. వొడాఫోన్ ఐడియా 15.7 లక్షల మంది చందాదార్లను కోల్పోయింది. ఈ సంస్థ మొత్తం సబ్‌స్కైబ్రర్లు 25.9 కోట్లకు వచ్చి చేరారు. ఇక అన్ని కంపెనీలవి కలిపి మొత్తం వైర్‌లెస్ చందాదార్ల సంఖ్య స్వల్పంగా పెరిగి 114.3 కోట్లుగా ఉంది. కస్టమర్లు పట్టణాల్లో 0.07 శాతం తగ్గి, గ్రామాల్లో 0.20 శాతం పెరిగారు. బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో కొద్దిగా పెరిగి 78.87 కోట్లకు చేరారు.
ప్రభుత్వ టెలికం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) కూడా యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. బీఎస్‌ఎన్‌ఎల్ యాక్టివ్ యూజర్లు 59.82 మిలియన్ల నుంచి 59.31 మిలియన్లకు తగ్గింది. వినియోగదారులను కోల్పోవడానికి పెరిగిన రిచార్జ్ ఛార్జీలు కారణంగా తెలుస్తున్నాయి. చాలా మంది తమ వద్ద ఉన్న రెండో సిమ్‌లో రిఛార్జీ చేయట్లేదని తెలుస్తోంది. రిలయన్స్ జియో వైర్‌లైన్ విభాగంలో 0.33 మిలియన్ల కొత్త వినియోగదారులను చేర్చుకుంది. Airtel, Vi కూడా 0.07 మిలియన్, 0.02 మిలియన్ కొత్త వైర్‌లైన్ వినియోగదారులను జోడించారు. BSNL వైర్‌లైన్ వినియోగదారులను ఆసక్తికరంగా కోల్పోయింది. JioFiber కారణంగా వైర్‌లైన్ విభాగంలో జియో దూకుడుగా వృద్ధి చెందుతోంది.