PAN Card: పాన్‌కార్డుదారులను మరోసారి హెచ్చరించిన ఆదాయపు పన్ను శాఖ.. ఇలా చేస్తే ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లే..

|

Jan 18, 2023 | 12:00 PM

ఆదాయపు పన్ను శాఖ తరచుగా పాన్ కార్డ్‌కి సంబంధించిన కొత్త సమాచారాన్ని అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. అయితే మరో అప్‌డేట్ ఉంది. ఇప్పటికే చాలా సార్లు వినియోగదారులను అలర్ట్‌ చేస్తూనే

PAN Card: పాన్‌కార్డుదారులను మరోసారి హెచ్చరించిన ఆదాయపు పన్ను శాఖ.. ఇలా చేస్తే ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లే..
Pan Card Link Aadhar Card
Follow us on

ఆదాయపు పన్ను శాఖ తరచుగా పాన్ కార్డ్‌కి సంబంధించిన కొత్త సమాచారాన్ని అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. అయితే మరో అప్‌డేట్ ఉంది. ఇప్పటికే చాలా సార్లు వినియోగదారులను అలర్ట్‌ చేస్తూనే ఉంది ఆదాయపు పన్ను శాఖ. గతంలో పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోని వారు ఆలస్యం చేయవద్దని ఆదాయపు పన్ను శాఖ మరోసారి ట్వీట్ చేసింది. పాన్‌-ఆధార్‌ను లింక్‌ చేసుకోవాలని పదేపదే చెబుతున్నా.. చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇలా ఆలస్యం చేసినట్లయితే ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఖాయమంటోంది.

పాన్ కార్డ్ హోల్డర్లు తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారు మార్చి 31, 2023లోగా చేసుకోవాల్సి ఉంది. లేకపోతే వారి పాన్‌కార్డు చెల్లదని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ ద్వారా తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ తన ట్వీట్‌లో ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, మినహాయింపు వర్గంలోకి రాని పాన్ కార్డ్ హోల్డర్లందరూ మార్చి 31లోగా తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. ఏప్రిల్ 1, 2023 ఆధార్‌తో లింక్ చేయని పాన్‌లు ఇన్‌యాక్టివ్‌గా మారతాయి. ప్రస్తుతం, మీరు పెనాల్టీ చెల్లించడం ద్వారా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. అయితే ఆదాయపు పన్ను శాఖ ప్రజలను మార్చి 31, 2022లోగా పాన్, ఆధార్‌ని లింక్ చేయమని కోరింది.

ఇవి కూడా చదవండి

 

దీని కోసం మీరు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. జూలై 1, 2022, మార్చి 2023 మధ్య పాన్, ఆధార్‌లను లింక్ చేసినందుకు మీరు రూ. 1000 జరిమానా చెల్లించాలి. అప్పటి వరకు మీరు రెండింటినీ లింక్ చేయకపోతే ఈ పాన్ కార్డ్ చెల్లదు. ఇది పూర్తిగా రద్దు చేయబడుతుందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది.