Traffic Signals: ఆంబులెన్స్ కుయ్ కుయ్ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్‌కు తెలిసిపోతుంది

సాధారణంగా ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎందుకంటే వాహనాలతో భారీగా రద్దీ ఉండే ప్రాంతాల్లో అంబులెన్స్‌లు వెళ్లాలంటే సమయం వృధా అవుతుంటుంది. దీని వల్ల రోగి ఆస్పత్రికి చేరుకునేలోపు..

Traffic Signals: ఆంబులెన్స్ కుయ్ కుయ్ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్‌కు తెలిసిపోతుంది
Ambulance
Follow us
Subhash Goud

|

Updated on: Jan 18, 2023 | 11:38 AM

సాధారణంగా ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఎందుకంటే వాహనాలతో భారీగా రద్దీ ఉండే ప్రాంతాల్లో అంబులెన్స్‌లు వెళ్లాలంటే సమయం వృధా అవుతుంటుంది. దీని వల్ల రోగి ఆస్పత్రికి చేరుకునేలోపు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్రాఫిక్‌ను దాటుకు ఎంత వెళ్లాలన్నా కుదరని పరిస్థితి ఉంటుంది. చాలా సమయాల్లో అంబులెన్స్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుంటాయి. దీని వల్ల రోగి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అయితే బెంగళూరు పోలీసులు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. అంబులెన్స్‌లు రద్దీగా ఉండే జంక్షన్‌ల గుండా వెళ్లేందుకు వీలుగా అడాప్టివ్ సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరికరాలను కొనుగోలు చేసేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అనుమతి పొందారు.

సెన్సార్ల సహాయంతో అంబులెన్స్‌లకు 200 మీటర్ల దూరం నుండి వాహనాన్ని గుర్తించి అంబులెన్స్‌ వెళ్లేందుకు గ్రిన్‌సిగ్నల్‌ ఇస్తుందని ట్రాఫిక్‌ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతి పొందారని, సిగ్నల్ లైట్లను అప్‌గ్రేడ్ చేయడానికి అవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని ఇప్పటికే కర్ణాటక రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెఆర్‌డిసిఎల్)ని కోరినట్లు ట్రాఫిక్‌ పోలీసు స్పెషల్ కమిషనర్ ఎంఎ సలీమ్ తెలిపారు. నగర వ్యాప్తంగా ఉన్న మొత్తం 163 ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను నాలుగైదు నెలల్లో ఎమర్జెన్సీ వెహికల్ సెన్సార్‌లతో త్వరలో అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు.

గోల్డెన్ అవర్ సమయంలో ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు చిక్కుకోకుండా ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోతే ఒక పోలీసు ఆటోమేటెడ్ సిగ్నల్‌లను అధిగమించి వాహనం వెళ్లడానికి అనుమతించాలి. ఈ ప్రాజెక్టులో భాగంగా సిగ్నల్ లైట్లను అప్‌గ్రేడ్ చేయడానికి పరికరాలను కొనుగోలు చేస్తోంది. నాలుగైదు నెలల్లో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎమర్జెన్సీ వెహికల్ ప్రింప్షన్ (ఈవీపీ) వ్యవస్థ అంబులెన్స్‌లు, కెమెరాలపై అమర్చిన సెన్సార్లను ఉపయోగిస్తుందని చెప్పారు. అంబులెన్స్ సెన్సార్‌ను కెమెరాలు గుర్తించిన తర్వాత అది సాధారణ ట్రాఫిక్ సిగ్నల్ సమయ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది. అంబులెన్స్‌ వాహనానికి గ్రీన్ సిగ్నల్ అందిస్తుంది. వాహనం దాటిన వెంటనే సిగ్నల్ సాధారణ సిగ్నల్‌కు వచ్చేస్తుందని అన్నారు. బెంగళూరు నగరానికి ఈ ప్రాజెక్ట్ కొత్త కాదు. దేశంలోనే తొలిసారిగా ప్రజల వినియోగానికి సాంకేతికతను ప్రతిపాదించిన వారిలో బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ ఒకటి. ఈ ప్రాజెక్ట్‌ను 2015లో బెంగళూరు పోలీసులు ప్రతిపాదించారు. గతంలో కనీసం రెండు సార్లు టెండర్లు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అనుమతులు రావడంతో ఈ కొత్త ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటు కానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి