Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto Expo 2023: మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..దీని ఫీచర్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ప్రముఖ కంపెనీ వార్డ్  విజార్డ్ అధునాతన సాంకేతికతతో కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వినియోగదారులకు అందుబాటులో తెచ్చింది. ఆటో ఎక్స్ పో 2023 లో కొత్త స్కూటర్ మిహాస్ ను లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్స్ అధునాతన టెక్నాలజీని ఏ కంపెనీ స్కూటర్లు బీట్ చేయలేవని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.

Auto Expo 2023: మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..దీని ఫీచర్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Mihos
Follow us
Srinu

| Edited By: Ravi Kiran

Updated on: Jan 18, 2023 | 7:30 AM

ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. పెరిగిన ఇందన ధరలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారుల అవసరాలను తీరుస్తున్నాయి. అలాగే వినియోగదారులను ఆకర్షిస్తూ వివిధ కంపెనీలు తమ కొత్త మోడళ్లను మార్కెట్ లోకి దించుతున్నాయి ఈ కోవకు చెందేలా ప్రముఖ కంపెనీ వార్డ్  విజార్డ్ అధునాతన సాంకేతికతతో కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వినియోగదారులకు అందుబాటులో తెచ్చింది. ఆటో ఎక్స్ పో 2023 లో కొత్త స్కూటర్ మిహాస్ ను లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్స్ అధునాతన టెక్నాలజీని ఏ కంపెనీ స్కూటర్లు బీట్ చేయలేవని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఇది రెటిరో స్టైల్ స్కూటర్ అని అలాగే దీని సౌండ్ సిమ్యులేటర్ యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటాయని కంపెనీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిహాస్ ఇతర ఫీచర్లు, ధర గురించి ఓ లుక్కేద్దాం.

మిహాస్ లో ఉండే ప్రత్యేెకతలు

ప్రస్తుతం మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా అధునాత ఫీచర్లతో వచ్చిన ఈ స్కూటర్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అలాగే భారత రహదారులకు అనుగుణంగా అత్యాధునిక భద్రత ఫీచర్లు ఉంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ స్కూటర్ వయస్సుతో సంబధం లేకుండా అందరికీ నచ్చుతుంది. అలాగే 750 ఎంఎం ఎత్తు, 1365 ఎంఎం ఎక్స్ పాండబుల్ వీల్ బేస్ ఈ స్కూటర్ ప్రత్యేకత. అలాగే టెలీస్కోపిక్ సస్పెన్షన్, వెనుకవైపు మోనో రివర్స్ బుల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఎలాంటి రోడ్డల్లో అయినా కంఫర్టబుల్ గా ప్రయాణించవచ్చు. అలాగే 175 ఎంఎం భారీ గ్రౌండ్ క్లియరెన్స్ దీని సొంతం. హైడ్రాలిక్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అత్యంత భద్రతతో ఈ వాహనాన్ని నడపవచ్చు. కేవలం ఏడు సెకండ్లలోనే 40 కిలో మీటర్ల స్పీడ్ ను అందుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. 2.5 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ తో సూపర్ స్పీడ్ ఈ బైక్ సొంతమని చెబుతున్నారు. బ్లూటూత్ కనెక్టివిటీ జాయ్- ఈ -కనెక్ట్ ఫీచర్ తో స్కూటర్ ను నియంత్రించవచ్చు. అలాగే జీపీఎస్, రివర్స్ మోడ్ వంటి అధునాతన ఫీచర్లు ఈ స్కూటర్ లో అందుబాటులో ఉన్నాయి.

ధర, రంగులు, మైలేజ్

ఈ స్కూటర్ ఎక్స్ షో రూమ్ ధర రూ.1,49,000 గా ఉంటుంది. మెటాలిక్ బ్లూ, డార్క్ బ్లాక్, డార్క్ ఎల్లో, పెర్ల్ వైట్ రంగుల్లో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది. దీన్ని ఓ సారి చార్జి చేస్తే 100 కి.మి వరకూ వెళ్తుంది. అలాగే దీన్ని ఫుల్ గా చార్జ్ చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం