AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO: పేపర్, నెట్‌వర్కింగ్ రంగాల్లో ఐపీవోల సందడి.. రూ. 300 కోట్ల టార్గెట్‌తో దిగిన కంపెనీలివే.. 

ముంబయి: పర్యావరణహిత పేపర్ల తయారీలో ప్రసిద్ధి చెందిన సిల్వర్‌టన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెట్‌వర్కింగ్ కేబుల్స్, పరికరాల తయారీదారు ఓరియంట్ కేబుల్స్ (ఇండియా) లిమిటెడ్, తమ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీకి ముసాయిదా డీఆర్‌హెచ్‌పీలను సమర్పించాయి. సిల్వర్‌టన్ ఇండస్ట్రీస్ రూ. 300 కోట్ల ఐపీవోను లక్ష్యంగా చేసుకోగా, ఓరియంట్ కేబుల్స్ రూ. 700 కోట్ల సమీకరణకు ప్రణాళికలు రచిస్తోంది.

IPO: పేపర్, నెట్‌వర్కింగ్ రంగాల్లో ఐపీవోల సందడి.. రూ. 300 కోట్ల టార్గెట్‌తో దిగిన కంపెనీలివే.. 
Ipo Buzz In Paper And Networking Sector
Bhavani
|

Updated on: Jul 17, 2025 | 3:53 PM

Share

పర్యావరణహిత పేపర్ల తయారీలో ప్రసిద్ధి చెందిన సిల్వర్‌టన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, నెట్‌వర్కింగ్ కేబుల్స్, పరికరాల తయారీదారు ఓరియంట్ కేబుల్స్ (ఇండియా) లిమిటెడ్ , తమ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీకి ముసాయిదా డీఆర్‌హెచ్‌పీలను సమర్పించాయి. సిల్వర్‌టన్ ఇండస్ట్రీస్ రూ. 300 కోట్ల ఐపీవోను లక్ష్యంగా చేసుకోగా, ఓరియంట్ కేబుల్స్ రూ. 700 కోట్ల సమీకరణకు ప్రణాళికలు రచిస్తోంది.

సిల్వర్‌టన్ ఇండస్ట్రీస్ ఐపీవో వివరాలు:

సిల్వర్‌టన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తమ ఐపీవో ద్వారా రూ. 300 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. అలాగే, ప్రస్తుత షేర్‌హోల్డర్లు 3,22,00,000 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో విక్రయించనున్నారు. ఒక్కో షేరు ముఖ విలువ రూ. 5 గా నిర్ణయించారు. ఈ ఐపీవో ద్వారా సమకూరిన నిధులను కంపెనీ వ్యర్థాల నుంచి 14 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్, కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 177.507 కోట్లు ఉపయోగించనుంది. అదనంగా, రూ. 34.639 కోట్లను ప్రస్తుత తయారీ ప్లాంట్‌లో రీవైండర్, షీటర్ సామర్థ్యాల మెరుగుదల, ఇన్-హౌస్ వేర్‌హౌస్‌ల నిర్మాణానికి కేటాయించనున్నారు. సుమారు రూ. 72 కోట్లను నిర్దిష్ట రుణాల చెల్లింపునకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనున్నారు. సిల్వర్‌టన్ ఇండస్ట్రీస్.. రైటింగ్, ప్రింటింగ్ పేపర్, క్రాఫ్ట్ పేపర్, కప్‌స్టాక్ పేపర్ వంటి పర్యావరణహిత స్పెషాలిటీ పేపర్ ఉత్పత్తులను రిటైల్, కార్పొరేట్, విద్య, ప్రభుత్వ రంగ సంస్థలకు అందిస్తోంది.

ఓరియంట్ కేబుల్స్ లిమిటెడ్ ఐపీవో వివరాలు:

ఓరియంట్ కేబుల్స్ (ఇండియా) లిమిటెడ్ ఐపీవో కింద షేర్ల విక్రయం ద్వారా రూ.700 కోట్ల వరకు నిధులు సమీకరించాలని చూస్తోంది. ఇందులో రూ. 320 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, సెల్లింగ్ షేర్‌హోల్డర్లు రూ. 380 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో షేరు ముఖ విలువ రూ. 1 గా ఉంటుంది. ఇష్యూ ద్వారా సమకూరిన నిధుల్లో సుమారు రూ. 91.50 కోట్లను తయారీ ప్లాంట్‌లో యంత్ర పరికరాల కొనుగోలు, సివిల్ పనుల కోసం కేటాయించనున్నారు. సుమారు రూ. 155.50 కోట్లను రుణాల చెల్లింపునకు ఉపయోగించనుండగా, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకుంటారు. ఈ కంపెనీ దాదాపు రెండు దశాబ్దాలుగా బ్రాడ్‌బ్యాండ్, టెలికాం, డేటా సెంటర్లు, రెన్యువబుల్ ఎనర్జీ వంటి రంగాలకు నెట్‌వర్కింగ్ కేబుల్స్, సొల్యూషన్స్, స్పెషాలిటీ పవర్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇతర సంబంధిత ఉత్పత్తులను అందిస్తోంది.