IPL 2025: ఐపీఎల్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 90 రోజుల ఉచితం జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ గడువు పొడిగింపు!
IPL 2025: ఐపీఎల్ 2025 క్రేజ్ పెరుగుతున్న కొద్దీ, టెలికాం కంపెనీలు క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక డేటా ప్యాక్‌లను ప్రారంభించాయి. తమ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన డేటా ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. దీనిలో అదనపు డేటా సౌకర్యం, JioHotstar సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నాయి. అయితే తాజాగా జియో JioHotstar సబ్‌స్క్రిప్షన్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది..

IPL 2025: దేశంలో ఐపీఎల్ 2025 ఉత్సాహం జోరుగా సాగుతోంది. క్రికెట్ అభిమానుల కోసం జియో ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. గతంలో రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌పై ప్రత్యేక ప్రయోజనాల కోసం చివరి తేదీ మార్చి 31 ఉండేది. కానీ ఇప్పుడు జియో దానిని ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు 90 రోజుల ఉచిత జియోహాట్‌స్టార్ (4K క్వాలిటీలో), 50 రోజుల ఉచిత జియోఫైబర్/ఎయిర్‌ఫైబర్ ట్రయల్‌ను పొందుతారు.
జియో కొత్త ఆఫర్ లో మీకు ఏం లభిస్తుంది?
90 రోజుల ఉచిత JioHotstar (4K క్వాలిటీలో)
కస్టమర్లు తమ మొబైల్ లేదా టీవీలో 4K నాణ్యతలో క్రికెట్ మ్యాచ్‌లను పూర్తిగా ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఈ ఆఫర్ మార్చి 22, 2025 నుండి IPL మొదటి మ్యాచ్ జరిగిన రోజు నుండి 90 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది.
50 రోజుల ఉచిత JioFiber/AirFiber ట్రయల్:
మీరు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్, 4K స్ట్రీమింగ్ ఉత్తమ అనుభవాన్ని పొందుతారు.
ఇందులో 800+ టీవీ ఛానెల్‌లు, 11+ OTT యాప్‌లు, అపరిమిత వైఫై ఉన్నాయి.
ఈ ఆఫర్ ఎలా పొందాలి?
ప్రస్తుత జియో కస్టమర్లు – రూ. 299 కు రీఛార్జ్ చేసుకోవాలి. ఇది రోజుకు 1.5GB డేటాను ఇస్తుంది.
మరిన్ని వివరాల కోసం కస్టమర్లు 60008-60008 కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
జియో ప్లాన్ నిబంధనలు, షరతులు
ఏప్రిల్ 17కి ముందు రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు రూ. 100 యాడ్-ఆన్ ప్యాక్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. గతంలో ఈ ప్రయోజనం మార్చి 31, 2025 వరకు ఉండేది. దీనిని జియో పొడిగించింది. ఈ ఆఫర్‌ను jio.comని సందర్శించడం ద్వారా లేదా సమీపంలోని జియో స్టోర్‌ను సందర్శించడం ద్వారా కూడా పొందవచ్చు. మీరు IPL 2025ను ఎటువంటి అంతరాయం లేకుండా ఆస్వాదించాలనుకుంటే ఈ జియో ప్లాన్ మీకు గొప్ప అవకాశం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి