AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Tips: వేలల్లో పెట్టుబడితో లక్షల్లో ఆదాయం..ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రీ బిజినెస్ చిట్కాలు ఇవే..!

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటారు. ముఖ్యంగా ఒకరి కింద ఎస్ బాస్ అనే ఉద్యోగం కంటే కష్టపడి వ్యాపారం చేయాలని కోరుకునే వారి సంఖ్య ఇటీవల కాలంలో చాలా పెరుగుతుంది. అయితే వ్యాపారం చేయాలనుకునే వారికి పెట్టుబడే ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారాల గురించి తెలుసుకుందాం.

Business Tips: వేలల్లో పెట్టుబడితో లక్షల్లో ఆదాయం..ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రీ బిజినెస్ చిట్కాలు ఇవే..!
Business Plans
Nikhil
|

Updated on: Feb 08, 2025 | 1:55 PM

Share

రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా కొత్త వ్యాపారం చేయవచ్చని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా చాలా తక్కువ ప్రారంభ పెట్టుబడితో లక్షల్లో లాభాలు వచ్చే వ్యాపారాలూ ఉన్నాయి. అయితే వ్యాపారం విషయానికి వస్తే లాభనష్టాలకు సిద్ధంగా ఉండి ఈ రంగంలోకి రావాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే పెట్టుబడే లేని సమయంలో నష్టం ప్రసక్తి ఉండదు కాబట్టి తమ కష్టం నష్టపోయినా ఎలాంటి ఇబ్బంది లేని వ్యాపారం చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వ్యాపారం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? చూద్దాం.

విజేతలతో మాట్లాడండి

మీరు ఎక్కడికి వెళ్లినా వారి కెరీర్లలో విజయవంతమైన వ్యక్తులను మీరు చూస్తే వారితో బహిరంగంగా సంభాషించడం మేలు. ముఖ్యంగా ఆయా రంగంలో వారు ఎలా విజయవంతం అయ్యారో? తెలుసుకుంటే మన వ్యాపారానికి సంబంధించిన విషయాలు తెలిసే అవకాశం. అలాగే మనం ఏ రంగంలోని వ్యాపారం చేయాలనుకుంటున్నామో? ఆ రంగం నిపుణులను కలిసి అన్ని విషయాలను తెలుసుకోవడం ఉత్తమం. 

కస్టమర్లను ఆకట్టుకోవడం

మీరు వ్యాపారాన్ని ప్రారంభించే మీ వ్యాపార ప్రదేశంలో ఎలాంటి ఉత్పత్తులు అమ్ముడవుతాయి? అలాగే ఎలాంటి కస్టమర్లు ఉన్నారు? ఎవరికి ఏమి అవసరమో? సహా కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోండి.

సమస్యను గుర్తించడం 

కస్టమర్లకు ఏదైనా సమస్య ఉంటే జాగ్రత్తగా వినాలి. వారి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. అలాగే మీకు మీ ఉత్పత్తి విషయంలో ఫీడ్ బ్యాక్‌ను తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఇవే

క్లౌడ్ కిచెన్

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ.2 వేల నుండి రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. మీరు ఇంట్లోనే ఆహారం తయారు చేసుకుని అమ్మవచ్చు.

హోమ్ మేడ్స్ 

ప్రపంచంలోని ఏ ఇతర దేశం లాగే భారతదేశ కళలు, చేతిపనుల సంప్రదాయానికి అద్భుతమైన చరిత్ర ఉంది. కాబట్టి, మనం అలాంటి హస్తకళల ఉత్పత్తిపై దృష్టి పెట్టవచ్చు.

ఫ్రీలాన్స్ రైటర్ 

మీకు రచనా నైపుణ్యాలు ఉంటే మీరు ఫ్రీలాన్స్ రైటింగ్ అసైన్‌మెంట్‌లు చేయడం ప్రారంభించవచ్చు. దీని వల్ల గణనీయమైన ఆదాయం వస్తుంది. ఇప్పుడు మనం దీనికి అవసరమైన ఇంటర్నెట్‌ను కేవలం రూ. 300కే పొందవచ్చు. ఫ్రీలాన్స్ రైటింగ్ ద్వారా మీరు రూ.10 వేలకు పైగా సంపాదించవచ్చు.

మొబైల్ మరమ్మతులు

పెద్ద పెట్టుబడి లేకుండానే మొబైల్ మరమ్మతు దుకాణాలను ప్రారంభించవచ్చు. రూ.5 వేల పెట్టుబడితో కూడా ఈ దుకాణాలను ప్రారంభించవచ్చు.

కొవ్వొత్తుల ఉత్పత్తి

రూ.3,000 పెట్టుబడితో కూడా మీరు కొవ్వొత్తుల తయారీ వ్యాపారంలో పాల్గొనవచ్చు. ఈ వ్యాపారంలో మీరు నెలకు రూ. 10,000 వరకు సంపాదించవచ్చు.

ఆన్‌లైన్ తరగతులు

ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడానికి మీకు పెద్దగా డబ్బు అవసరం లేదు. మీకు ఎడిటింగ్ ఎలా చేయాలో తెలిస్తే మీరు వీడియోలను అందమైన రీతిలో తయారు చేసి పోస్ట్ చేయవచ్చు. అదనంగా మీరు భాష, వృత్తి శిక్షణపై ఆన్‌లైన్ తరగతులను తీసుకోవచ్చు. ఇది మంచి ఆదాయం ఇచ్చే వ్యాపారంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..