FD Investment: ఎఫ్‌డీల్లో పెట్టుబడితో రాబడితో పాటు నష్టాలెన్నో..! సీనియర్ సిటిజన్లకు ఈ జాగ్రత్తలు మస్ట్

ముఖ్యంగా ద్రవ్యోల్బణం వల్ల ఎఫ్‌డీలు పెద్ద ముప్పును ఎదుర్కొంటాయని స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం వల్ల 20 సంవత్సరాల వ్యవధిలో మన ఎఫ్‌డీలపై 60 శాతం రాబడిని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ఎఫ్‌డీలు స్థిరత్వం, హామీతో కూడిన రాబడిని అందిస్తున్నప్పటికీ అవి ద్రవ్యోల్బణానికి సంబంధించిన ప్రభావాలకు అతీతం కావని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

FD Investment: ఎఫ్‌డీల్లో పెట్టుబడితో రాబడితో పాటు నష్టాలెన్నో..! సీనియర్ సిటిజన్లకు ఈ జాగ్రత్తలు మస్ట్
Cash
Follow us

|

Updated on: Mar 27, 2024 | 9:30 AM

భారతదేశంలో చాలా మంది కష్టపడి సంపాదించిన సొమ్మను నమ్మకమైన రాబడి కోసం ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఎఫ్‌డీలను మన సొమ్ముకు ఎంత భద్రతనిస్తాయో? అంతేస్థాయిలో నష్టాలు తీసుకొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం వల్ల ఎఫ్‌డీలు పెద్ద ముప్పును ఎదుర్కొంటాయని స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం వల్ల 20 సంవత్సరాల వ్యవధిలో మన ఎఫ్‌డీలపై 60 శాతం రాబడిని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ఎఫ్‌డీలు స్థిరత్వం, హామీతో కూడిన రాబడిని అందిస్తున్నప్పటికీ అవి ద్రవ్యోల్బణానికి సంబంధించిన ప్రభావాలకు అతీతం కావని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం తరచుగా ఎఫ్‌డీలపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకు ఇది ఒక ప్రత్యేక సవాలుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీల పెట్టుబడితో వచ్చే రిస్క్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఎఫ్‌డీల మన సొమ్ముకు మంచి భద్రతను అందిస్తున్నా వాటి రాబడులు ద్రవ్యోల్బణం ద్వారా గణనీయంగా తగ్గుతాయి. ఉదాహరణకు ఎవరైనా ఆరు శాతం వార్షిక వడ్డీ రేటుతో ఎఫ్‌డీలో రూ.1 కోటి పెట్టుబడి పెడితే వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఐదు శాతంగా నిర్ణయించిన తర్వాత పెట్టుబడికి సంబంధించిన వాస్తవ విలువ కాలక్రమేణా గణనీయంగా తగ్గిపోతుంది. 20వ సంవత్సరం నాటికి ద్రవ్యోల్బణం ఎఫ్‌డీ రిటర్న్ నుంచి దాదాపు రూ. 2 కోట్లను నష్టం చేకూరుస్తుంది. దీర్ఘకాలిక పొదుపుల పై ద్రవ్యోల్బణానికి సంబంధించిన ప్రతికూల ప్రభావాన్ని అంచనా వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సీనియర్ సిటిజన్లు, ప్రత్యేకించి స్థిర ఆదాయ వనరులపై ఆధారపడే వారు పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా ద్రవ్యోల్బణానికి సంబంధించిన ప్రభావాలకు గురవుతారు. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి నిపుణులు తమ పెట్టుబడి పోర్ట్ఫోలియోను ఎఫ్‌లకు మించి వైవిధ్యపరచాలని సీనియర్లకు సలహా ఇస్తున్నారు. 

మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు, బంగారం, బాండ్లు వంటి ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని వివరిస్తున్నారు. ఇవి దీర్ఘకాలికంగా ఎఫ్‌డీలతో పోల్చితే చారిత్రాత్మకంగా మెరుగైన రాబడిని అందిస్తాయని పేర్కొంటున్నారు.  సీనియర్లు మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఉపసంహరణ ప్రణాళికలు ఎంచుకోమని సలహా ఇస్తున్నారు. ఇవి ఎఫ్‌డీల కంటే మెరుగైన పోస్ట్-టాక్స్ రిటర్న్స్‌ను అందించేటప్పుడు స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని అందిస్తాయని చెబుతున్నారు.  ఇండెక్స్డ్ బాండ్ల వంటి ద్రవ్యోల్బణం రక్షిత సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడం వల్ల కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చని చెబుతున్నారు.  వృద్ధులకు ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేయడంతో అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణుల సహాయంతో వారి పెట్టుబడి పోర్ట్ ఫోలియోను క్రమం తప్పకుండా సమీక్షించడం చాలా అవసరం. వైవిధ్యభరితమైన విధానాన్ని అవలంబించడంతో వారి పొదుపుపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా సీనియర్లు పదవీ విరమణలో వారి ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి