AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Billionaire Capital: చరిత్రలో తొలిసారిగా బీజింగ్‌ను వెనక్కి నెట్టిన ముంబై.. బిలియనీర్ల నిలయంగా ముంబై

దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇప్పుడు బిలియనీర్ల నిలయంగా మారింది. బీజింగ్‌కు ఆసియా బిలియనీర్ క్యాపిటల్ హోదాను ముంబై లాగేసుకుంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం, ప్రస్తుతం 92 మంది బిలియనీర్లు ముంబైలో నివసిస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా ముంబై బీజింగ్‌ను వెనక్కి నెట్టింది.

Billionaire Capital: చరిత్రలో తొలిసారిగా బీజింగ్‌ను వెనక్కి నెట్టిన ముంబై.. బిలియనీర్ల నిలయంగా ముంబై
Mumbai Is Billionaire Capital Of Asia
Balaraju Goud
|

Updated on: Mar 27, 2024 | 9:05 AM

Share

దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇప్పుడు బిలియనీర్ల నిలయంగా మారింది. బీజింగ్‌కు ఆసియా బిలియనీర్ క్యాపిటల్ హోదాను ముంబై లాగేసుకుంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం, ప్రస్తుతం 92 మంది బిలియనీర్లు ముంబైలో నివసిస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా ముంబై బీజింగ్‌ను వెనక్కి నెట్టింది. మన ముంబైకి చెందిన ఈ బిలియనీర్లు తమ సంపదను నిరంతరం పెంచుకుంటున్నారు. మరోవైపు పొరుగున ఉన్న చైనా పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ ధనవంతుల సంపద క్రమంగా తగ్గుతూ వస్తోంది.

ముంబై నగరంలో కొత్తగా 27 మంది బిలియనీర్లు

హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం ముంబై నగరంలో కొత్తగా 27 మంది బిలియనీర్లు చేరారు. మరోవైపు, బీజింగ్‌లో ఈ సంఖ్య 6 మాత్రమే. భారతదేశంలో పెరుగుతున్న బిలియనీర్ల సంఖ్య దేశ పటిష్ట ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. భారతదేశం పెరుగుతున్న ఆర్థిక బలాన్ని ప్రపంచం మొత్తం గుర్తించింది. కొత్త బిలియనీర్ల సంఖ్య పరంగా భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పేరు మొదటి స్థానంలో నిలిచింది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ పేరును చేర్చడం ద్వారా భారతదేశ ఆర్థిక ఆధిపత్యం కొనసాగుతోంది.

భారతదేశంలో సంపద పెరిగింది.. చైనాలో తగ్గింది

భారతదేశం, చైనాల మధ్య సంపద వృద్ధి ధోరణులు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తున్నాయి. చైనాలోని 573 బిలియనీర్ల సంపదలో క్షీణత ఉంది. అదే సమయంలో, ఈ ధోరణి భారతదేశంలో 24 మంది బిలియనీర్లతో మాత్రమే కనిపించింది. ప్రపంచ ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశ మొత్తం సంపద గత ఏడాదితో పోలిస్తే 51 శాతం పెరిగింది. ముంబై సంపద కూడా 47 శాతం పెరిగితే బీజింగ్‌లో 28 శాతం తగ్గింది. ఇది ఆసియాలోని నగరాల్లో ముంబై స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. భారతదేశంలోని బిలియనీర్ల సగటు సంపద కేవలం 3.8 బిలియన్ డాలర్లు. చైనాది కేవలం 3.2 బిలియన్ డాలర్లు.

ముంబై పురోగతి గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది

ముంబై పురోగతి గ్రాఫ్ వేగంగా పెరుగుతోందని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు, ప్రధాన పరిశోధకుడు అనస్ రెహ్మాన్ జునైద్ అన్నారు. గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 దీనిని నిర్ధారిస్తో్ంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయాణంలో భారతదేశంలోని బిలియనీర్లు కూడా తమ పూర్తి సహకారం అందిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…