AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ కుబేరుల్లో హైదరాబాదీలు.. బిలీనియర్ల జాబితాలో భారత్ ఏ ర్యాంకులో ఉందంటే..

ప్రపంచంలోని కుబేరుల వివరాలను హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024ను తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆసియా దేశాల్లో మన భారత్ ప్రధాన భూమిక పోషించింది. ఈ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన టాప్ 10 బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు.

ప్రపంచ కుబేరుల్లో హైదరాబాదీలు.. బిలీనియర్ల జాబితాలో భారత్ ఏ ర్యాంకులో ఉందంటే..
Billionaires In Hyderabad
Srikar T
|

Updated on: Mar 26, 2024 | 4:13 PM

Share

ప్రపంచంలోని కుబేరుల వివరాలను హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024ను తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆసియా దేశాల్లో మన భారత్ ప్రధాన భూమిక పోషించింది. ఈ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన టాప్ 10 బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు. మన దేశం 275 మంది బిలియనీర్లతో ప్రపంచంలోనే 3వ స్థానాన్ని సాధించింది. ఈ జాబితాలో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. మన దేశంతో పాటు హైదరాబాద్ నగరంలో నివసించే ప్రముఖ సంస్థల అధినేతలు బిలినియర్ల జాబితాలో నిలిచారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్‌లోని టాప్ 10 బిలియనీర్లు వీరే..

  • దివీస్ లాబొరేటరీస్‎కి చెందిన అధినేత మురళి దీవి కుటుంబం 7 బిలియన్ డాలర్ల నికర విలువతో గ్లోబల్ ర్యాంకింగ్స్‎లో 381లో నిలిచారు.
  • మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థకు చెందిన పి పిచ్చి రెడ్డి 6 బిలియన్ డాలర్ల నికర విలువతో గ్లోబల్ ర్యాంకింగ్స్‎లో 536లో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే సంస్థకు చెందిన మరొకరు పివి కృష్ణా రెడ్డి ప్రపంచ కుబేరుల్లో 561 స్థానంలో నిలిచారు.
  • హోమ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు, తమ కుటుంబం 4 బిలియన్ డాలర్ల నికర విలువతో గ్లోబల్ ర్యాంకింగ్స్‎లో 942వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
  • ప్రముఖ దిగ్గజ ఫార్మా సంస్థల్లో ఒకటైన అరబిందో ఫార్మా అధినేత పివి రాంప్రసాద్ రెడ్డి వారి కుటుంబం కూడా 3 బిలియన్ డాలర్ల నికర విలువతో గ్లోబల్ ర్యాంకింగ్స్‎లో 1024వ ర్యాంకును సాధించారు. ఇదే స్థానంలో హెటెరో ల్యాబ్స్ అధినేత బి పార్థసారధి రెడ్డి కుటుంబం కూడా నిలవడం మరో విశేషం.
  • డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కె సతీష్ రెడ్డితో పాటు వారి కుటుంబం 2 బిలియన్ డాలర్ల నికర విలువతో గ్లోబల్ ర్యాంకింగ్స్‎లో 1855వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. గార్ సంస్థకు చెందిన జి అమరేందర్ రెడ్డి కూడా ఇదే స్థానంలో కొనసాగుతున్నారు.
  • సువెన్ ఫార్మాస్యూటికల్స్ అధినేత జాస్తి వెంకటేశ్వర్లు, MSN లేబొరేటరీస్ సీఈవో ఎం సత్యనారాయణ 2 బిలియన్ డాలర్ల నికర విలువతో గ్లోబల్ ర్యాంకింగ్స్‎లో 2038 ర్యాంకును సాధించారు.

ప్రపంచంలోని బిలినియర్ జాబితాలో వరుసగా 10 ర్యాంకులు సాధించిన వారిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు, హైదరాబాద్ నగరానికి చెందిన వారికి రావడం గర్వకారణంగా చెప్పవచ్చు. ఆసియాలో హైదరాబాద్ తో పాటు ముంబైకి చెందిన పలు పారిశ్రామిక వేత్తలు కూడా మంచి ర్యాంకులు సాధించారు. వారి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్రపంచంలో అధికశాతం మంది బిలినియర్లు ఉన్న బీజింగ్‎ను ఈసారి ముంబై వెనక్కు నెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 92 మంది బిలియనీర్లు ఉన్న రాజధానిగా ముంబై ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే 91 మంది బిలియనీర్లు కలిగిన బీజింగ్‌ ముంబై దాటికి వెనుకపడిపోయింది. మొన్నటి వరకు తొలి స్థానంలో ఉన్న బిజింగ్ ను ముంబై అధిగమించి ఆసియా బిలియనీర్ రాజధానిగా అవతరించింది.

ఇవి కూడా చదవండి

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3,279 మంది బిలియనీర్లు ఉండగా అందులో 17 మంది హైదరాబాద్ కు చెందిన వారే అవడం విశేషం. ఇంతే కాకుండా ముంబై నుంచి 92 మంది బిలియనీర్లుగా నిలిచారు. అలాగే ప్రపంచ దేశాల్లో అమెరికా 109 మంది బిలియనీర్లకు కొత్తగా అవకాశం ఇవ్వగా ఆ దేశంలో సుసంపన్నుల సంఖ్య 800 మందికి చేరింది. దీంతో అమెరికా రెండో స్థానంలో ఉంది. ఇక 814 మంది బిలియనీర్లతో చైనా అగ్రస్థానంలో ఉంది. అంటే అమెరికా కంటే అధికశాతం మంది సంపన్నులు చైనాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 271 మంది బిలియనీర్లతో మన దేశం మూడో స్థానంలో నిలిచింది. కొత్తగా 84 మంది బిలినియర్ల జాబితాలో చేరడంతో 3వ ర్యాంకు సాధించింది ఇండియా.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..