SBI: మీరు SBI కార్డులు ఉపయోగిస్తున్నారా.? అయితే మీకో బ్యాడ్ న్యూస్..
కొన్ని డెబిట్ కార్డులకు సంబంధించిన వార్షియ మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచుతున్న ఎస్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. పెంచిన ఈ ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఎస్‌బీఐ క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులపై ఛార్జీలను ఏకంగా రూ. 75 పెంచేసింది. ప్రస్తుతం ఈ కార్డులపై వార్షిక ఛార్జీ రూ. 125తో పాటు అదనంగా జీఎస్టీ ఉండగా...
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ తమ ఖాతాదారులకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఎస్‌బీఐ కార్డులపై ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏ బ్యాంక్ అయిన తమ ఖాతాదారులకు అందించే కార్డులపై ఛార్జీలు వసూలు చేస్తుందనే విషయం తెలిసిందే. ఈ ఛార్జీలను బ్యాంకులు ఏడాదికి ఒకసారి అకౌంట్ హోల్డర్స్ నుంచి వసూలు చేస్తాయి. అయితే తాజాగా ఈ ఛార్జీలను పెంచుతూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది.
కొన్ని డెబిట్ కార్డులకు సంబంధించిన వార్షియ మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచుతున్న ఎస్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. పెంచిన ఈ ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో భాగంగా ఎస్‌బీఐ క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులపై ఛార్జీలను ఏకంగా రూ. 75 పెంచేసింది. ప్రస్తుతం ఈ కార్డులపై వార్షిక ఛార్జీ రూ. 125తో పాటు అదనంగా జీఎస్టీ ఉండగా ప్రస్తుతం దీనిని రూ. 200లతో పాటు జీఎస్టీకి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఇక యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ (ఇమేజ్ కార్డ్) వాంటి వాటిపై ఏకంగా 50 శాతం మేర ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కార్డులపై వార్షిక ఛార్జీలు రూ. 175+ జీఎస్టీగా ఉండగా, ప్రస్తుతం రూ. 250+ జీఎస్టీకి పెంచచారు. వీటితో పాటు ప్లాటినమ్ డెబిట్ కార్డు ఛార్జీలను కూడా పెంచేశారు.
వీటిపై యాన్యువల్ ఛార్జీలను 30 శాతం పెంచారు. ప్రస్తుతం వీటిపై ఏడాదికి రూ. 250 ప్లస్ జీఎస్టీగా ఉండగా, రూ. 325కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ ప్రైడ్ ప్రీమియమ్ బిజినెస్ డెబిట్ కార్డు వంటి వాటి ప్రీమియం కార్డుల ఛార్జీల్ని రూ. 350 ప్లస్ జీఎస్టీ నుంచి రూ. 425 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించింది. ఇక్కడ జీఎస్టీ ప్రతి దాంట్లో 18 శాతంగా ఉంటుంది. ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో యూజర్లపై భారం పడనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..