AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: బడ్జెట్ అంటే ఏంటో తెలుసా..? ఎన్ని భాగాలుగా విభజిస్తారు.. ఆసక్తికర విషయాలు మీకోసం..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మాలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్ సభలో వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి ఆసక్తి ఈ బడ్జెట్ పైనే కేంద్రీకృతమైంది. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ఇదే. వేతన జీవులకు ఊరటనిస్తుందా? మార్కెట్ వర్గాలకు ఏం శుభవార్త చెప్పనుంది? ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? అనే ఆసక్తి ఇప్పుడు అందరికీ ఉంటుంది.

Budget 2023: బడ్జెట్ అంటే ఏంటో తెలుసా..? ఎన్ని భాగాలుగా విభజిస్తారు.. ఆసక్తికర విషయాలు మీకోసం..
Union Budget 2023
Nikhil
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 20, 2023 | 1:42 PM

Share

బడ్జెట్..బడ్జెట్..బడ్జెట్..ఇప్పుడు ఎక్కడికెళ్లినా దీనిపైనే చర్చ. ఎందుకంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మాలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్ సభలో వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి ఆసక్తి ఈ బడ్జెట్ పైనే కేంద్రీకృతమైంది. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ఇదే. వేతన జీవులకు ఊరటనిస్తుందా? మార్కెట్ వర్గాలకు ఏం శుభవార్త చెప్పనుంది? ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? అనే ఆసక్తి ఇప్పుడు అందరికీ ఉంటుంది. కేంద్ర బడ్జెట్ ప్రభుత్వ ఆర్థిక ప్రమాణాలను రూపొందించడమే కాకుండా ప్రభుత్వం ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను తెలియజేసే విధంగా ఉంటుంది. 

బడ్జెట్ గురించి ప్రాథమిక విషయాలను ఓ సారి తెలుసుకుందాం.

  1.  కేంద్ర బడ్జెట్ 2023 ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశపెడతారు.
  2.  బడ్జెట్ ను సాంప్రదాయంగా పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్ సభలో సమర్పిస్తారు.
  3.  ‘బడ్జెట్’ అనే పదం ఫ్రెంచ్ పదం ‘బౌగెట్’ నుంచి వచ్చింది, దీని అర్థం ‘చిన్న బ్యాగ్’. ఇది బ్రిటీష్ ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్ బడ్జెట్ పేపర్‌లను తీసుకెళ్లడానికి ఉపయోగించే చిన్న లెదర్ బ్యాగ్‌ని సూచిస్తుంది.
  4.  యూనియన్ బడ్జెట్ రెండు భాగాలుగా విభజిస్తారు. అందులో ఒకటి వార్షిక ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ కాగా మరొకటి వార్షిక గ్రాంట్స్ కోసం డిమాండ్.
  5. వార్షిక ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రాబడి, వ్యయాల గురించి తెలియజేస్తుంది.
  6.  నిధుల కోసం డిమాండ్ అనేది బడ్జెట్‌లో రెండవ భాగం. ఇది ఓట్-ఆన్-అకౌంట్ రూపంలో సమర్పిస్తారు. ఇది అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు ప్రభుత్వం తన ఖర్చులను భరించేందుకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా (CFI) నుంచి డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతించే విధంగా నిబంధనలు ఉంటాయి. 
  7.  కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రసంగ రూపంలో సమర్పిస్తారు. ఆ తర్వాత లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ, ఓటింగ్ జరుగుతుంది.
  8. కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వ ఆర్థిక పనితీరుపై తాజా సమాచారం అందించడానికి ‘అర్ధ-వార్షిక నివేదిక’ రూపంలో సమర్పించిన ‘మధ్య-సంవత్సర సమీక్ష’ కూడా ఉంటుంది.
  9. కేంద్ర బడ్జెట్‌లో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు రూపొందించిన ‘ఆర్థిక సర్వే’ కూడా ఉంటుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది.
  10. కేంద్ర బడ్జెట్‌లో బడ్జెట్ అమలుకు సంబంధించిన శాసన ప్రతిపాదనలను కలిగి ఉన్న ‘ఫైనాన్స్ బిల్లు’ కూడా ఉంటుంది. 

మరిన్ని జాతీయ వార్తల కోసం