Health Insurance: మీకు తెలుసా? డెంగ్యూ వ్యాధికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది..ఎలా అంటే..
మలేరియా, డెంగ్యూ, ఫిలేరియాసిస్, చికున్‌గున్యా, జపనీస్ ఎన్‌సెఫాలిటిస్, జికా వైరస్ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఈ సీజన్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
Health Insurance: మలేరియా, డెంగ్యూ, ఫిలేరియాసిస్, చికున్‌గున్యా, జపనీస్ ఎన్‌సెఫాలిటిస్, జికా వైరస్ వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఈ సీజన్‌లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా డెంగ్యూ రోగుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. డెంగ్యూ కారణంగా, రోగులు వారానికి పైగా ఆసుపత్రులలో చేరాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు డెంగ్యూకి చికిత్స కోసం బీమా కలిగి ఉంటే, అప్పుడు హాస్పిటలైజేషన్ ఖర్చును బీమా సంస్థ భరిస్తుంది. దోమల వల్ల కలిగే వ్యాధుల చికిత్సకు బీమా కంపెనీలు సాధారణ ఆరోగ్య బీమా పాలసీని అందించాలని కొంతకాలం క్రితం బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (IRDAI) ఆదేశాన్ని జారీ చేసింది.
డెంగ్యూ వంటి వ్యాధుల కోసం బీమా కంపెనీలు ‘మషక్ రక్షక్ హెల్త్ పాలసీని’ అందిస్తున్నాయి. ఐఆర్డీఏఐ (IRDAI) అన్ని సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలను మషక్ రక్షక్ పాలసీని ఏప్రిల్ 1, 2021 నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. మాషక్ రక్షక్ హెల్త్ పాలసీ కింద, ఈ వ్యాధి బారిన పడిన వారికీ అయ్యే ఖర్చులో మొత్తంలో 100 శాతం పాలసీదారునికి ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయి. అయితే, ఈ పాలసీని సద్వినియోగం చేసుకోవడానికి పాలసీదారుడు కనీసం 72 గంటలు ఆసుపత్రిలో ఉండాలి. పాలసీని కొనుగోలు చేసిన తర్వాత, పాలసీదారుడు 15 రోజుల ఫ్రీ-లుక్ వ్యవధిని పొందుతాడని.. ఈ కాలంలో పాలసీదారు పాలసీని తిరిగి ఇవ్వగలుగుతాడు.
మీడియా నివేదికల ప్రకారం, ప్రస్తుతం, అనేక కంపెనీలు డెంగ్యూ చికిత్స కోసం రూ .1 లక్ష నుండి 5 లక్షల వరకు మాత్రమే రూ .1500 నుండి రూ .5,000 వరకు ప్రీమియంతో బీమాను అందిస్తున్నాయి. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కంపెనీ ఈ పాలసీని జారీ చేయదు. బీమా కంపెనీలు పాలసీదారునికి గరిష్టంగా రూ .10,000 నుండి రూ. 5 లక్షల వరకు బీమా మొత్తాన్ని అందిస్తాయి. ఒక సింగిల్ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పాలసీకి అదనంగా అదనపు కవర్‌గా మష్క్ రక్షక్ పాలసీని కూడా కొనుగోలు చేయవచ్చు.
Also Read: Brain Eating Amoeba: అగ్రరాజ్యంలో మళ్ళీ మెదడు తినే అమీబా వెలుగులోకి.. చికిత్స పొందుతూ మృతి..
American Hospital: ఆస్పత్రిలో ఏడ్చిన యువతి.. సర్జరీ బిల్లుతో పాటు ‘ఎమోషనల్ బిల్లు’ వేసిన సిబ్బంది