AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bio-Economy: బయో-ఎకానమీలో భారీ వృద్ధి సాధించాం.. బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్‌పోలో ప్రధాని మోడీ..

భారతదేశ బయో-ఎకానమీ గత 8 సంవత్సరాలలో 8 రేట్లు వృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 2014లో $10 బిలియన్ల నుంచి 2022 నాటికి $80 బిలియన్లకు పెరిగిందని గుర్తు చేశారు...

Bio-Economy: బయో-ఎకానమీలో భారీ వృద్ధి సాధించాం.. బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్‌పోలో ప్రధాని మోడీ..
Modi
Srinivas Chekkilla
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 09, 2022 | 7:22 PM

Share

భారతదేశ బయో-ఎకానమీ గత 8 సంవత్సరాలలో 8 రేట్లు వృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 2014లో $10 బిలియన్ల నుంచి 2022 నాటికి $80 బిలియన్లకు పెరిగిందని గుర్తు చేశారు. గురువారం నాడు మొట్టమొదటి బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్‌పోను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC) ఈ ఎక్స్‌పోను నిర్వహిస్తోంది. దేశం జీవ-ఆర్థిక వ్యవస్థలో పెరుగుదల యాదృచ్ఛికమైనది కాదని మోడీ చెప్పారు. భారతదేశం విభిన్న జనాభా, లోతైన మానవ, మూలధన సమూహము, వ్యాపారం చేయడం సౌలభ్యం, బయో ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది జరిగిందిని పేర్కొన్నారు. దేశ సమాచార సాంకేతిక నిపుణుల నైపుణ్యంపై నమ్మకం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఉందని ఆయన అన్నారు.

వ్యవసాయం వంటి విభిన్న రంగాలలో అభివృద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడుతుందన్నారు. భారతదేశంలో బయోటెక్ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు అపూర్వమని మోడీ కొనియాడారు. గత 8 సంవత్సరాలలో స్టార్టప్‌ల సంఖ్య వంద నుంచి 70,000 స్టార్టప్‌లకు పెరిగిందన్నారు. వీటిలో 1,100 బయోటెక్ స్టార్టప్‌లు గత ఏడాది వచ్చయన్నారు. 8 సంవత్సరాల క్రితం, బయోటెక్ ఉత్పత్తుల సంఖ్య 10గా ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 700 కంటే ఎక్కువ పెరిగిందని వివరించారు. బయోటెక్ స్టార్టప్‌లలో పెట్టుబడిదారుల సంఖ్య 9 రెట్లు పెరిగిందన్నారు. రాబోయే సంవత్సరాల్లో బయోటెక్ రంగంలోని అనేక పరిశ్రమల కోసం పెద్ద వినియోగదారుల స్థావరాన్ని సృష్టించడం జరుగుతుందని మోదీ చెప్పారు.

ఇందులో బయో-ఎరువులు, బయో-ఫోర్టిఫైడ్ విత్తనాలు, జీవ ఇంధనాలు, వ్యాక్సిన్లు, సేంద్రీయ ఉత్పత్తులు ఉంటాయన్నారు. భారతదేశం ఇప్పటికే పెట్రోల్ కోసం 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించింది. 30 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడానికి గడువు కూడా 2030 వరకు ఉంది. అది ఇప్పుడు 2025కి తగ్గించామని ప్రధాని వివరించారు. డిమాండ్‌లో వృద్ధికి తోడ్పడేందుకు, ఆవిష్కరణలు మరియు పరిశోధన, అభివృద్ధికి సంపూర్ణ వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు మోదీ చెప్పారు. తక్కువ వ్యవధిలో మిలియన్ల కొద్దీ డయాగ్నస్టిక్ కిట్‌లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్, క్రిటికల్ కేర్ పరికరాలు, వెంటిలేటర్లు, రికపరేటివ్ డివైజ్‌లతో బయటకు వచ్చినందుకు భారతదేశ బయోటెక్ రంగం దేశీయంగా, ప్రపంచవ్యాప్త ప్రశంసలను అందుకుందని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి