AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలులో మీకు లోయర్‌ బోర్త్ కావాలా..? ఇలా చేయండి

Indian Railways: సికింద్రాబాద్, కాచిగూడ వంటి ముఖ్య స్టేషన్లలో బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో వృద్ధులు, గర్భిణులు తాము ఎక్కే బోగీ వరకూ చేరుకోవచ్చు. ఇక్కడ సుమారు రూ.50 వరకు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. అలాగే..

Indian Railways: రైలులో మీకు లోయర్‌ బోర్త్ కావాలా..? ఇలా చేయండి
Subhash Goud
|

Updated on: Oct 11, 2025 | 9:23 PM

Share

Indian Railways Lower Berth: ఇండియన్‌ రైల్వే.. ఇది భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. అయితే రైలు ప్రయాణం చేసేవారు తప్పకుండా ముందుగా ఐఆర్‌సీటీసీ లేదా ఇతర మార్గాల ద్వారా టికెట్లను బుక్‌ చేసుకుంటారు. రైళ్లలో రకరకాల సీట్లు ఉంటాయి. సీట్ల బుకింగ్‌ చేసుకోవడంలో వృద్ధులు కూడా ఉన్నారా? వారికి పైబెర్తు కేటాయిస్తే ఎలా అనేది అనుమానం చాలా మందిలో ఉంటుంది. రైల్వే శాఖ అలాంటి వారికోసం రైల్వేస్టేషన్లు, రైళ్లలో పలు సదుపాయాలు కల్పిస్తోంది. 45 ఏళ్ల పైబడిన మహిళలు, గర్భిణులకూ ప్రత్యేక సీట్లను కేటాయిస్తుంది.

ఇది కూడా చదవండి: Astrology: ఈ నెలలో పుట్టిన అమ్మాలు అందంలో అప్సరసలే.. కుర్రాళ్ళు పెళ్లంటూ చేసుకుంటే వీరినే చేసుకోవాలి..!

ప్రత్యేక కోటా ఉంది:

రిజర్వేషన్‌ బోగీల్లో వయసుపైబడిన వారికి బెర్తుల కేటాయింపులో ప్రత్యేక కోటా అందిస్తోంది రైల్వే. గర్భిణులు, 60 ఏళ్లు పైబడిన పురుషులు, 45 ఏళ్లు దాటిన మహిళలకు లోయర్‌బెర్తు కేటాయించాలనే నిబంధన ఉంది. టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలో సంబంధిత వివరాలు నమోదుచేసి, లోయర్‌బెర్తు కోటా ఆప్షన్‌ టిక్‌ చేస్తే సరిపోతుంది. వారికి ఈ బెర్త్‌ను కేటాయిస్తుంది రైల్వే.

ఇది కూడా చదవండి: Ration Card: ఈ రూల్స్‌ పాటించాల్సిందే.. లేకుంటే రేషన్‌ కార్డు రద్దు..!

స్లీపర్‌ క్లాస్‌ ప్రతి కోచ్‌లో ఆరు నుంచి ఏడు లోయర్‌ బెర్త్‌లు ఉంటాయి. అలాగే ఏసీ త్రీటైర్‌లో నాలుగు నుంచి ఐదు లోయర్‌ బెర్తులు ఉంటాయి. ఇక ఏసీ టూ-టైర్‌లో మూడు నుంచి నాలుగు లోయర్‌ బెర్తులు అందుబాటులో ఉంటాయి.

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోని రైల్వేస్టేషన్లతోపాటు దేశంలోని అన్నిచోట్లా వృద్ధుల కోసం వీల్‌చైర్‌లు అందుబాటులో ఉంటాయి. స్టేషన్‌లోకి వెళ్లగానే వృద్ధుల కోసం అక్కడ విధుల్లో ఉన్న టికెట్‌ కలెక్టర్‌ లేదా స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందించాల్సి ఉంటుంది. స్టేషన్లలో లైసెన్స్‌డ్‌ కూలీలు కూడా సహాయం చేస్తారు. వారు వీల్‌చైర్‌లో ప్లాట్‌ఫామ్‌ మీదకు తీసుకెళ్తారు. అయితే వారికి కొంత ఛార్జ్‌ అందించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులు సెలవులు!

బ్యాటరీ కార్లు:

సికింద్రాబాద్, కాచిగూడ వంటి ముఖ్య స్టేషన్లలో బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో వృద్ధులు, గర్భిణులు తాము ఎక్కే బోగీ వరకూ చేరుకోవచ్చు. ఇక్కడ సుమారు రూ.50 వరకు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. వృద్ధులు, వైకల్య బాధితులు ఒక ప్లాట్‌ఫాం నుంచి మరోదానికి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 119 స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: BSNL: కేవలం 319 రూపాయలకే 65 రోజుల చెల్లుబాటు.. అద్భుతమైన ప్లాన్‌.. బెనిఫిట్స్‌ ఇవే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి