Prepaid Plans: రూ.150 కంటే తక్కువ ధరకే 6 అద్భుతమైన ప్లాన్స్.. ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్!
Prepaid Plans: ఈ రోజుల్లో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే అందులో డేటా తప్పకుండా ఉంటుంది. అది లేనిది ఏ రీఛార్జ్ చేసుకోడం లేదు. అందులో ఓటీటీ యాప్స్‌కు సబ్‌స్క్రిప్షన్స్ తప్పకుండా ఉంటుంది. మరి అతి తక్కువ ధరల్లో ఓటీటీలు, డేటా అందించే ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం..

Prepaid Plans: మీరు అతి తక్కువ ధరకు డేటా, కాలింగ్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటే మూడు టెలికాం కంపెనీలు – జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా (Vi) – తమ వినియోగదారులకు రూ.150 కంటే తక్కువ ధరకే అద్భుతమైన, సరసమైన ప్లాన్‌లను అందిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Astrology: ఈ నెలలో పుట్టిన అమ్మాలు అందంలో అప్సరసలే.. కుర్రాళ్ళు పెళ్లంటూ చేసుకుంటే వీరినే చేసుకోవాలి..!
ఎయిర్‌టెల్ రూ.100 రీఛార్జ్ ప్లాన్
ఇది ఎయిర్‌టెల్ నుండి రూ.100తో అందిస్తున్న డేటా ప్యాక్. వినియోగదారులు 30 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ వినియోగదారులకు 6GB డేటాను, 22+ OTT యాప్‌లకు ఉచితంగా యాక్సెస్ అందిస్తుంది.
ఎయిర్‌టెల్:
రూ.121 ప్లాన్ తన కస్టమర్లకు 30 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్ ఇంటర్నెట్ వినియోగం కోసం వినియోగదారులకు మొత్తం 6GB డేటాను అందిస్తుంది.
జియో రూ. 125 రీఛార్జ్ ప్లాన్:
ఈ ప్లాన్‌తో రోజుకు 0.5GB డేటాను అందిస్తుంది. రూ. 125 ప్లాన్ 23 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్యాక్ అపరిమిత కాలింగ్, 300 ఉచిత SMSలను అందిస్తుంది. వినియోగదారులు జియో టీవీకి ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు.
జియో రూ. 139 ప్లాన్:
7 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఇది డేటా ప్యాక్. వినియోగదారులు ఇంటర్నెట్ వినియోగం కోసం 12GB డేటాను పొందుతారు.
వోడాఫోన్-ఐడియా రూ.101:
101 ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ 5GB డేటాను అందిస్తుంది. Jio Hotstarకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
Vi రూ.139 ప్లాన్:
వోడాఫోన్-ఐడియా రూ. 139 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. 12GB డేటాను అందిస్తుంది.
ఇది కూడా చదవండి: Diwali Cleaning Tips: ఎగ్జాస్ట్ ఫ్యాన్‌పై దుమ్ము, ధూళి పేరుకుపోయిందా? ఇలా నిమిషాల్లో శుభ్రం చేయండి!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




