AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBM: ఇతనికి 30 కోట్ల ఇంక్రిమెంట్..రోజువారీ సంపాదన 45 లక్షలు..వార్షిక ప్యాకేజీ రూ.154 కోట్లు

ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఇంక్రిమెంట్ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. చాలా కంపెనీలు ఇంక్రిమెంట్ ప్రక్రియను ప్రారంభించాయి. అయితే ఒక ఉద్యోగి ఇంక్రిమెంట్ గురించి చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఒక భారతీయ సీఈవోకి జీతాలు లక్షల్లో కాదు కోట్లలో పెంచింది ఆ కంపెనీ. ఈ జీతం పెంపు ఒకటి, రెండు కోట్లు కాదు దాదాపు రూ.30 కోట్లు..

IBM: ఇతనికి 30 కోట్ల ఇంక్రిమెంట్..రోజువారీ సంపాదన 45 లక్షలు..వార్షిక ప్యాకేజీ రూ.154 కోట్లు
Ibm
Subhash Goud
|

Updated on: Apr 01, 2024 | 3:55 PM

Share

ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఇంక్రిమెంట్ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. చాలా కంపెనీలు ఇంక్రిమెంట్ ప్రక్రియను ప్రారంభించాయి. అయితే ఒక ఉద్యోగి ఇంక్రిమెంట్ గురించి చెప్పినప్పుడు మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఒక భారతీయ సీఈవోకి జీతాలు లక్షల్లో కాదు కోట్లలో పెంచింది ఆ కంపెనీ. ఈ జీతం పెంపు ఒకటి, రెండు కోట్లు కాదు దాదాపు రూ.30 కోట్లు. ఇప్పుడు అతని రోజువారీ సంపాదన 45 లక్షల రూపాయలకు పెరిగింది. ఈ భారతీయ CEO అరవింద్ కృష్ణ, IBM కంపెనీ CEO. ఇప్పుడు అతని ప్యాకేజీ 154 కోట్లు అయింది.

గతేడాది 135 కోట్ల ప్యాకేజీ

అరవింద్ కృష్ణ అనే భారతీయుడు IBM యొక్క CEO. కంపెనీ అతనికి రూ.30 కోట్ల జీతం పెంచింది. కృష్ణకు కంపెనీ ఇప్పటికే ఉదారంగా ప్యాకేజీ ఇచ్చింది. కంపెనీ ఇప్పుడు వారికి రోజుకు రూ.45 లక్షలు చెల్లిస్తోంది. అరవింద్ కృష్ణ కేవలం IBMలో చేరలేదు. అతను గత 34 సంవత్సరాలుగా IBMలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు కంపెనీకి నాయకత్వం వహిస్తున్నాడు. 2020లో సీఈవోగా నియమితులయ్యారు. గతేడాది ఆయన వార్షిక ప్యాకేజీ రూ.135 కోట్లు. ఇప్పుడు అది 30 కోట్లకు పెరిగింది.

ఇవి కూడా చదవండి

IBM ప్రపంచ దిగ్గజం

ఐబీఎం ప్రపంచంలోనే అతి పురాతనమైన,అతిపెద్ద సంస్థ. భారతీయ వ్యాపారవేత్త రతన్ టాటా కూడా ఒకప్పుడు ఈ కంపెనీలో పనిచేశారు. ప్రస్తుతం ఐబీఎం మార్కెట్ క్యాప్ రూ.14.57 లక్షల కోట్లుగా ఉంది. అరవింద్ 1990లో కంపెనీలో చేరారు. కంపెనీ సీఈవో కాకముందు కంపెనీలో పలు పదవులు నిర్వహించారు.

కార్పొరేట్ డీల్స్‌లో ముఖ్యమైన పాత్ర

IBM కోసం కార్పొరేట్ డీల్స్‌లో అరవింద్ కృష్ణ ముఖ్యమైన పాత్ర పోషించారు. అతని నాయకత్వంలో రెడ్ హ్యాట్ కంపెనీని కొనుగోలు చేశారు. ఇది 34 బిలియన్ డాలర్ల వ్యాపారం. అరవింద్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ లో జన్మించాడు. అతని తండ్రి ఇండియన్ ఆర్మీలో అధికారి. తమిళనాడులో పాఠశాల విద్యను అభ్యసించాడు. ఐఐటీ కాన్పూర్ నుంచి ఇంజినీరింగ్ పట్టభద్రుడయ్యాడు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఆ తర్వాత అతని జీవితం మారిపోయింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి