- Telugu News Photo Gallery Business photos JIO Free Offer: Jio Again Brings Free Offer, Free To Use Superfast Net
Jio Free Offer: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్.. మళ్లీ ఉచిత ఆఫర్..సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్
టెలికమ్యూనికేషన్ రంగంలోకి అడుగుపెట్టిన వెంటనే కోట్లాది మంది కస్టమర్లను కూడగట్టుకున్న జియో ఇప్పుడు తన వినియోగదారులకు మరో శుభవార్త అందించింది. సంస్థ ఎప్పటికప్పుడు అనేక నియమాలను మారుస్తుంది. ఇప్పుడు జియో తన కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ ప్లాన్ IPL 2024 చూడాలనుకునే వ్యక్తుల కోసం మీకు Jio IPL ఆఫర్ 2024 గురించి తెలుసుకోండి..
Updated on: Mar 31, 2024 | 6:04 PM

టెలికమ్యూనికేషన్ రంగంలోకి అడుగుపెట్టిన వెంటనే కోట్లాది మంది కస్టమర్లను కూడగట్టుకున్న జియో ఇప్పుడు తన వినియోగదారులకు మరో శుభవార్త అందించింది. సంస్థ ఎప్పటికప్పుడు అనేక నియమాలను మారుస్తుంది. ఇప్పుడు జియో తన కస్టమర్ల కోసం కొత్త ప్లాన్‌లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

ఈ ప్లాన్ IPL 2024 చూడాలనుకునే వ్యక్తుల కోసం మీకు Jio IPL ఆఫర్ 2024 గురించి తెలుసుకోండి. ఆకాష్ అంబానీకి చెందిన జియో ఈ ఐపీఎల్ సీజన్‌లో 50 రోజుల పాటు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్లాన్‌ను అందిస్తోంది.

జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కస్టమర్లకు ఇది కొత్త ప్లాన్. ఈ ఆఫర్ Jio True 5G మొబైల్ కనెక్షన్‌పై అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్ బిల్లింగ్ ప్లాన్‌ను కూడా మార్చుకోవచ్చు. మీరు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ లేదా 12 నెలల ముందుగా చెల్లించినా ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది.

మీరు దీన్ని సులభంగా కనెక్ట్ చేయవచ్చు. 50 రోజుల ఉచిత వోచర్‌తో ఇంటి సేవను పొందవచ్చు. బ్రాడ్‌బ్యాండ్ ఇన్‌స్టాల్ చేసిన 7 రోజులలోపు ఈ వోచర్ క్రెడిట్ చేయబడుతుంది.

కస్టమర్‌లు 50 రోజుల తగ్గింపు వోచర్‌ను సులభంగా పొందవచ్చు. రాబోయే బిల్లింగ్ సైకిల్‌లో కూడా దీనిని సర్దుబాటు చేయవచ్చు. తగ్గింపు వోచర్ 2 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ 30 ఏప్రిల్ 2024 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 50 రోజులు ఉచితం అంటే జియో మరోసారి డిస్కౌంట్ ఆఫర్‌లోకి ప్రవేశించింది.




