AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-UK FTA: యూకేతో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌..! మన దేశంలో భారీగా ధరలు తగ్గే వస్తువులు ఇవే..

మూడు సంవత్సరాల చర్చల తర్వాత, భారత్, యునైటెడ్ కింగ్‌డమ్‌లు ఒక కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ద్వారా ఆల్కహాలిక్ పానీయాలు, ఆటోమొబైల్స్, ఇతర వస్తువులపై సుంకాలు తగ్గుతాయి. వస్త్రాలు, పాదరక్షలు, ఆటో భాగాలు తయారీదారులకు లాభం చేకూరుతుంది.

India-UK FTA: యూకేతో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌..! మన దేశంలో భారీగా ధరలు తగ్గే వస్తువులు ఇవే..
Pm Modi And Uk Pm
SN Pasha
|

Updated on: Jul 23, 2025 | 1:45 PM

Share

దాదాపు మూడు సంవత్సరాల చర్చల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటన సందర్భంగా భారత్‌, యూకే కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకం చేయనున్నాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థతో భారత్‌ మొదటి ప్రధాన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అయిన FTA, బ్రిటిష్ పార్లమెంట్, భారత కేంద్ర మంత్రివర్గం నుండి చట్టపరమైన అనుమతులు పొందిన తర్వాత, బహుశా ఒక సంవత్సరంలోపు అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.

ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌తో ఏంటి లాభం?

  • ఆల్కహాలిక్ పానీయాలు.. స్కాచ్ విస్కీ జిన్‌పై దిగుమతి సుంకాలు వెంటనే 150 శాతం నుండి 75 శాతం తగ్గనున్నాయి. రాబోయే 10 సంవత్సరాలలో 40 శాతానికి తగ్గుతాయి.
  • ఆటోమొబైల్స్.. ప్రస్తుతం 100 శాతం మించి ఉన్న UK-తయారీ కార్లపై సుంకాలు కోటా విధానం కింద 10 శాతానికి తగ్గుతాయి.
  • ఇతర వస్తువులు.. సౌందర్య సాధనాలు, సాల్మన్, చాక్లెట్లు, బిస్కెట్లు, వైద్య పరికరాలతో సహా అనేక UK ఉత్పత్తులపై సుంకాల భారీగా తగ్గనున్నాయి.
  • వీటితో పాటు యూకేకు ఇండియా చేస్తున్న ఎగుమతుల్లో 99 శాతం భారతీయ ఉత్పత్తులపై సుంకం తగ్గుతుంది.
  • FTA వల్ల ప్రయోజనం పొందే రంగాలలో వస్త్రాలు, పాదరక్షలు, ఆటో భాగాలు, రత్నాలు, ఆభరణాలు, ఫర్నిచర్, క్రీడా వస్తువులు, రసాయనాలు, యంత్రాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ప్రస్తుతం UKలో 4 శాతం, 16 శాతం మధ్య సుంకాలను ఎదుర్కొంటున్నాయి.

ప్రయోజనం పొందే భారతీయ సంస్థలు..

  • వస్త్రాలు/దుస్తులు: వెల్స్పన్ ఇండియా, అరవింద్ లిమిటెడ్.
  • ఫుట్‌వేర్: బాటా ఇండియా, రిలాక్సో.
  • ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు: టాటా మోటార్స్, మహీంద్రా ఎలక్ట్రిక్.
  • ఇంజనీరింగ్: భారత్ ఫోర్జ్.

బ్రిటిష్ ప్రభుత్వ అంచనాల ప్రకారం FTA వల్ల UK, GDP దీర్ఘకాలంలో ఏటా £4.8 బిలియన్లు (రూ.56,150 కోట్లు) పెరుగుతుందని తెలుస్తోంది. భారతీయ దుస్తులు, పాదరక్షలు, ఆహార ఉత్పత్తులపై తగ్గిన ధరల వల్ల బ్రిటిష్ వినియోగదారులు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. దాదాపు 90 శాతం UK వస్తువులపై సుంకాలను భారత్‌ తగ్గించనుంది. భారతదేశంలో పెరుగుతున్న వినియోగదారుల మార్కెట్‌కు మెరుగైన ప్రాప్యత ద్వారా UKకి చెందిన డియాజియో (స్కాచ్ విస్కీ) వంటి సంస్థలు, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ (టాటా మోటార్స్ యాజమాన్యంలోనివి) వంటి బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీదారులు గణనీయంగా ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి