AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా..! అయితే వడ్డీ రేట్లను తగ్గించారు.. ఎందుకో తెలుసుకోండి..

India Post Payments Bank : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఛార్జీలతో పాటు వడ్డీ రేట్లను సవరించింది. దీంతో ఇకనుంచి ఖాతాదారుల

ఈ బ్యాంకులో మీకు అకౌంట్ ఉందా..! అయితే వడ్డీ రేట్లను తగ్గించారు.. ఎందుకో తెలుసుకోండి..
Interest Rates
uppula Raju
|

Updated on: Jul 14, 2021 | 11:02 AM

Share

India Post Payments Bank : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఛార్జీలతో పాటు వడ్డీ రేట్లను సవరించింది. దీంతో ఇకనుంచి ఖాతాదారుల పొదుపు ఖాతాలపై తక్కువ వడ్డీ లభిస్తుంది. ఇది కాకుండా (డోర్ స్టెప్ బ్యాంకింగ్ ) ఇంటి సేవలకు కూడా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పెరిగిన బ్యాంకింగ్ ఛార్జీలు 2021 ఆగస్టు 1 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తన వినియోగదారులకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ పై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయదు. కానీ 20 ఆగస్టు 2021 నుంచి ప్రతి అభ్యర్థనకు రూ.20 ఛార్జ్ చేస్తుంది. ఇవే కాకుండా ఇండియా పోస్ట్ పొదుపు ఖాతాలో వడ్డీ రేట్లు కూడా జూలై 1 న తగ్గాయి. ఈ వడ్డీ రేట్లు 20 జూలై 2021 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఇది ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌పై కూడా ఆధారపడి ఉంటుంది.

ఇండియా పోస్ట్ బ్యాంక్ వడ్డీ రేటు ఇప్పటివరకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పొదుపు ఖాతాలో రూ.1 లక్ష వరకు ఉన్న బ్యాలెన్స్‌పై 2.75 శాతం చొప్పున వడ్డీ లభిస్తోంది. కానీ ఇప్పుడు అది 2.5 శాతానికి పడిపోయింది. కొత్త రేట్లు 20 జూలై 2021 నుంచి వర్తిస్తాయి. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య బ్యాలెన్స్‌పై సంవత్సరానికి 2.75 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. దీనికి ఎటువంటి మార్పులు చేయలేదు. ఖాతాదారులకు త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ చెల్లింపు లభిస్తుంది.

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వినియోగదారుని గరిష్ట బ్యాలెన్స్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ .2 లక్షలకు పెంచారు. రూ.2 లక్షలకు మించి బ్యాలెన్స్ ఉంటే అదనపు మొత్తాన్ని పోస్టాఫీసు పొదుపు ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రస్తుతం పోస్టాఫీసు పొదుపు ఖాతాలో 4 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తున్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ముఖ్యమైన లక్షణం ‘బ్యాంకింగ్ విత్ క్యూఆర్ కార్డ్’. QR కార్డ్ ఉంటే మీరు ఖాతా సంఖ్యను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. పాస్‌వర్డ్ కూడా అవసరం లేదు. ఖాతాదారు ప్రామాణీకరణ ప్రక్రియను బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు. ఐపిపిబి ఖాతా ద్వారా కూడా నిధులను ఎన్‌ఎఫ్‌టి, ఐఎమ్‌పిఎస్, ఆర్‌టిజిఎస్ ద్వారా బదిలీ చేయవచ్చు.

తాలిబన్లతో చర్చలు విఫలమైతే మేం భారత సైన్యం సాయాన్ని కోరవచ్చు..ఆఫ్ఘనిస్తాన్ రాయబారి

VIRAL PHOTOS : ఈ 5 ఉత్పత్తులను ఇండియాలో అమ్ముతారు.. కానీ విదేశాలలో బ్యాన్ చేశారు.. ఎందుకో తెలుసా..

India Covid-19: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని నమోదయ్యాయంటే..?