Unclaimed Deposits: వారసులకు గుడ్ న్యూస్! రూ. 78వేల కోట్లు ఈజీగా విత్ డ్రా..!
మన దేశంలో లెక్కలేనన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఆయా బ్యాంకుల్లో లక్షల్లో సేవింగ్స్ అకౌంట్లు ఉన్నాయి. ఈ అకౌంట్లలో చాలా మంది తమ డబ్బును విత్ డ్రా చేసుకోకుండా అలాగే వదిలేశారు. అంటే క్లయిమ్ చేయలేదు. అలా క్లయిమ్ చేయని డబ్బు ఏకంగా రూ. 78,213కోట్లు ఉంది. ఆయా అకౌంట్లకు వాస్తవ హక్కు దారులు మనుగడలో లేకపోవడంతో అకౌంట్లను పట్టించుకున్నవారు లేరు. ఫలితంగా ఆ అకౌంట్లలో ఉన్న డబ్బంతా అలాగే ఉండిపోయింది. అయితే ప్రభుత్వం ఈ డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలుగా సులభతరమైన ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తోంది. కేవలం కొన్ని పత్రాలు సమర్పించడం ద్వారా నామినీలో ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే వెసులబాటు కల్పిస్తోంది.

దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో కొన్ని లక్షల సంఖ్యలో అకౌంట్లు ఉన్నాయి. వాటిల్లో చాలా ఖాతాలు ఏళ్లుగా వినియోగంలో లేవు. అలాంటి ఖాతాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. వాటిని విత్ డ్రా చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వీటినే అన్ క్లయిమ్డ్ డిపాజిట్లు అని పిలుస్తారు. దేశంలోని అన్ని బ్యాంకుల్లోనూ ఈ తరహా అకౌంట్లు ఉన్నాయి. ఇలాంటి అకౌంట్లలోని నగదును విత్ డ్రా చేయాలంటే ఆ ఖాతాదారుడు ఉండాలి.. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే నామినీకి హక్కు ఉంటుంది. అయితే నామినీకి అకౌంట్ విషయం తెలియకపోతే వారు దానిని పట్టించుకోరు. ఫలితంగా అందులో ఉన్న డబ్బులు అలాగే మురిగిపోతున్నాయి. అలా అన్ని బ్యాంకుల్లో కలిపి ఏకంగా రూ. 78,213కోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంకు చెబుతోంది. అలాంటి వాటిని విత్ డ్రా చేసుకునేలా భారత ప్రభుత్వం ఓ సులభమైన విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ విధానంలో కొన్ని పత్రాలు అవసరం రావచ్చు. వాటిల్లో ఒక దరఖాస్తు, డిక్లరేషన్ ఫారాలతో పాటు కొన్ని ముఖ్యమైన గుర్తింపు పత్రాలు ఉంటాయి. ఆ విధానం ఏంటి? అన్ క్లయిమ్డ్ డిపాజిట్లను ఎలా విత్ డ్రా చేసుకోవాలి? తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
కొత్త విధానం..
అనేక కారణాల వల్ల, చాలా మంది ప్రజల డబ్బు వారి బ్యాంకు ఖాతాల్లోనే ఉండిపోతుంది. ఈ డబ్బు కొన్ని రోజుల తర్వాత రిజర్వ్ బ్యాంకుకు వెళ్తుంది. అంటే క్లెయిమ్ చేయని డబ్బు చివరికి రిజర్వ్ బ్యాంకుకు చేరుతుంది. అలా దేశంలోని అన్ని బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంకుకు చేరిన మొత్తం దాదాపు రూ. ప్రస్తుతం 78,213 కోట్ల బ్యాలెన్స్ ఉందని చెబుతున్నారు. ఈ డబ్బు ఎవరికి చెందుతుందో వారికి తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం వారు కొన్ని కొత్త పద్ధతులను పరిచయం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు ఒక దరఖాస్తు ఫారమ్, కొన్ని ముఖ్యమైన పత్రాల జాబితాను సిద్ధం చేశాయి. కొన్ని నిబంధనలను పరిచయం చేయబోతున్నారు. ఈ నియమాలు అమల్లోకి వచ్చిన తర్వాత, ఖాతాలో డబ్బు ఉన్నవారు లేదా వారి నామినీలు దరఖాస్తు ఫారమ్ నింపి ఇతర పత్రాలను సమర్పిస్తే.. మీరు సులభంగా డబ్బును ఉపసంహరించుకోవచ్చు. మీరు దరఖాస్తు ఫారమ్‌లో మీ పేరు, ఫోన్ నంబర్, చిరునామాను రాసి, ఏవైనా ఇతర అవసరమైన పత్రాలను జత చేస్తే.. ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, వారు మీ డబ్బును మీ ఖాతాకు బదిలీ చేస్తారు.
2026 నుంచి ఆన్ లైన్ లోనూ..
బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డబ్బు చాలా కాలంగా ఉన్న సమస్య. దీన్ని సరిచేయడానికి, బ్యాంకులోని ఉన్నతాధికారులు కలిసి ఒక బృందంగా పనిచేశారు. ఆ బృందం చేసిన అభ్యర్థన ఆధారంగా ఈ కొత్త నియమాలను ప్రవేశపెట్టారు. దీన్ని ఎలా సులభతరం చేయాలనే దానిపై వారు ఇప్పుడు ఒక నివేదికను సిద్ధం చేస్తున్నారు. 2026 నుంచి క్లెయిమ్ చేయని డబ్బును సులభంగా ఉపసంహరించుకోవడానికి ఆన్‌లైన్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ఆ విధంగా క్లెయిమ్ చేయని డబ్బును ఉపసంహరించుకోవడం చాలా సులభం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..