AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు పన్ను విధానం మార్చవచ్చా..? నిపుణుల తెలిపే సూచనలివే..!

భారతదేశంలోని పౌరులు నిర్ణీత ఆదాయానికి మించి సంపాదిస్తే ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ఆదాయపు పన్ను చట్టంలో కేంద్రం కీలక మార్పులను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా సెక్షన్ 115 బీఏసీ కింద కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రవేశపెట్టింది. దీంతో భారతదేశంలోని పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానంలో ఏదో ఒక దాన్ని మధ్య ఎంచుకునే అవకాశం ఉంది. అయితే చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు పన్ను విధానాన్ని మార్చవచ్చా? అనే అనుమానం అందరికీ ఉంటుంది.

Income Tax: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు పన్ను విధానం మార్చవచ్చా..? నిపుణుల తెలిపే సూచనలివే..!
Nikhil
|

Updated on: Apr 19, 2025 | 4:48 PM

Share

ఆదాయపు పన్ను విధానం మార్పు అనేది మీ ఆదాయ వనరుపై ఆధారపడి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులలో రెండు వర్గాలు ఉంటాచిజ జీతం పొందే వ్యక్తులు (లేదా పెన్షనర్లు), వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం ఉన్న వ్యక్తులు. అయితే జీతం పొందే వ్యక్తులు, పెన్షనర్లు ప్రతి సంవత్సరం తమ ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు పన్ను విధానాలను మార్చుకోవచ్చు. టీడీఎస్ ప్రయోజనాల కోసం ఒక నిర్దిష్ట విధానాన్ని ఎంచుకోవడం గురించి మీరు మీ యజమానికి తెలియజేసినప్పటికీ వారు మార్చకపోతే మీరు మీ రిటర్న్ దాఖలు చేసే సమయంలో దానిని మార్చవచ్చు. మీరు మీ యజమానితో కొత్త విధానాన్ని ఎంచుకుంటే కానీ తరువాత అన్ని తగ్గింపులను లెక్కించిన తర్వాత పాత విధానం మరింత ప్రయోజనకరంగా అనిపిస్తే మీరు ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో పాత విధానానికి మారవచ్చు.

వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు తమ పన్ను విధానాలను ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న తర్వాత వారు జీవిత కాలంలో ఒకసారి మాత్రమే పాత విధానానికి తిరిగి వెళ్లవచ్చు. పాత విధానానికి తిరిగి మారిన తర్వాత వారు భవిష్యత్ అంచనా సంవత్సరాల్లో కొత్త విధానాన్ని మళ్లీ ఎంచుకోలేరు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు మిమ్మల్ని సెక్షన్ 115 బీఏసీ కింద కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారా? అని డిస్‌ప్లే అవుతుంది. మీరు కొత్త విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే “అవును” లేదా పాత విధానాన్ని కొనసాగించడానికి “లేదు” ఎంచుకోవాలి. ఈ ఎంపిక మీ పన్ను గణన, చెల్లించాల్సిన మొత్తాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటూ వ్యాపార ఆదాయం కలిగి ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి మీ ఐటీఆర్‌ను దాఖలు చేయడానికి ముందు మీరు ఫారమ్ 10-ఐఈఏను దాఖలు చేయాలి.

ఐటీఆర్ ఫైలింగ్ ఎప్పుడు?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ అప్‌డేటెడ్ ఫారమ్స్‌ను విడుదల చేసిన తర్వాత ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ సాధారణంగా ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఫారమ్‌లు ఈ నెలలో తెలియజేసే అవకాశం ఉంది. గత సంవత్సరం ఐటీఆర్ ఫామ్స్ ఫిబ్రవరిలో తెలియజేశారు. అలాగే ఏప్రిల్‌లో ఈ-ఫైలింగ్ ప్రారంభమైంది. ఈ-ఫైలింగ్ పోర్టల్ ఏప్రిల్‌ నెలాఖరుకు తెరిచే అవకాశం ఉంది. కానీ జీతం ద్వారా ఆదాయపు చెల్లించే ఉద్యోగుల్లో ఎక్కువ మంది సాధారణంగా జూన్ మధ్యలో దాఖలు చేయడం ప్రారంభిస్తారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి