Indian Railways: మీ బుకింగ్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే.. మీరు ట్రైన్‌లో ప్రయాణించవచ్చా? ఇక్కడ తెలుసుకోండి!
భారతదేశంలో సుదూర ప్రయాణాలు చేయాలనుకునే ఎక్కవగా ఇష్టపడే ప్రయాణ విధానం రైల్వే ప్రయాణం. మనం ట్రైన్‌లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా బుక్‌చేసుకున్నప్పుడు కొన్ని సార్లు మన బుకింగ్స్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండిపోతాయి. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారు రైలులో ప్రయాణించవచ్చో లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

భారతదేశంలో, ప్రతిరోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తారు. ముఖ్యంగా దూర ప్రయాణాలకు, ప్రజలు ఎక్కువగా రైలు రవాణాను ఎంచుకుంటారు . అలాగే, రైలులో ఛార్జీలు ఇతర రవాణా విధానాల కంటే తక్కువగా ఉన్నందున, సామాన్యులకు రైలు మాత్రమే ఎంపిక. మనం కుటుంబం లేదా స్నేహితులతో ఒక ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు, మనం 4 లేదా 5 మందికి ఒకే సారి టిక్కెట్లు బుక్ చేసుకుంటాము. కానీ కొన్నిసార్లు, అన్ని టిక్కెట్లు బుక్ అవ్వవు. అవి వెయిటింట్ లిస్ట్‌లోకి వెళ్లిపోతాయి. అలాంటి సందర్భాలలో మిగిలిన వ్యక్తులు ఎలా ప్రయాణిస్తారో, రైల్వే నియమాలు ఏమి చెబుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకులు మీరు ప్రయాణించాల్సిన డేట్ రోజున బుక్ చేసుకున్న రైలు ఎక్కవచ్చు. మీరు వెయిట్‌లిస్ట్‌లో ఉన్నారని ట్రైన్‌లోని టీసీకి చెప్పవచ్చు. అప్పుడు ట్రైన్‌లో ఖాళీ సీట్లు ఏవైనా ఉంటే వాటిని టీసీ మీకు కేటాయిస్తాడు. సీట్లు అందుబాటులో లేకపోతే, ఇన్‌స్పెక్టర్ మిమ్మల్ని స్లీపర్, AC కోచ్‌లలో ప్రయాణించడానికి అనుమతించరు.
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారు ఏమి చేయాలి?
భారతీయ రైల్వే నియమాల ప్రకారం వెయిట్‌లిస్ట్ చేసిన ప్రయాణీకులు స్లీపర్ లేదా AC కోచ్‌లలో ప్రయాణించడానికి కుదరదు. చార్ట్ తయారు చేసిన తర్వాత మీకు టికెట్ లభించకపోతే, మీరు స్లీపర్ లేదా AC కోచ్‌లలో ఎక్కలేరు. అలా కాదని మీరు వాటిలో ఎక్కితే రైల్వే నియమాలను ఉల్లంఘిచినట్టు అవుతుంది. మీ టికెట్ కన్ఫార్మ్ కాకపోయినా, మీరు వెయిట్‌లిస్ట్‌లో ఉన్నా, మీరు రైల్వే స్టేషన్ నుండి లేదా UTS యాప్ ద్వారా జనరల్ టికెట్ బుక్ చేసుకోవాలి. కానీ అలాంటి టికెట్ లేకుండా, వెయిట్‌లిస్ట్‌లో మీకు కన్ఫర్మ్ కాని టికెట్ ఉంటే, మీపై చర్య తీసుకోవచ్చు.
వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారి టిక్కెట్లను IRCTC ఏమి చేస్తుంది?
మీరు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకుని, అది కన్ఫార్మ్ కాకపోతే, IRCTC ఆటోమేటిక్‌గా టికెట్‌ను రద్దు చేసి, మీ డబ్బును తిరిగి చెల్లిస్తుంది. కాబట్టి మీరు టికెట్‌ను క్యాన్సల్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ట్రైన్‌లో ఎవరైనా చివరి నిమిషంలో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే టీసీ ఆ సీటును వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి కేటాయిస్తాడు. దీంతో మీకు సీటు దక్కవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




