AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Scooter : మీ దగ్గర ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందా..? ఎక్కువ మైలేజ్ కావాలంటే ఇలా చేయండి చాలు..

ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా, అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో ఉన్న ఏకైక ప్రాబ్లం చార్జింగ్ స్టేషన్లు అని చెప్పాలి.

Electric Scooter : మీ దగ్గర ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందా..? ఎక్కువ మైలేజ్ కావాలంటే ఇలా చేయండి చాలు..
Electric Scotter
Madhavi
| Edited By: |

Updated on: Feb 12, 2023 | 8:33 AM

Share

ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా, అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో ఉన్న ఏకైక ప్రాబ్లం చార్జింగ్ స్టేషన్లు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చార్జింగ్ స్టేషన్ ల కొరత చాలా ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మైలేజీ పెంచేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

టైర్లపై ఒత్తిడి తగ్గించాలి:

ఇ-స్కూటర్ మైలేజీ టైర్ ప్రెజర్ ద్వారా ప్రభావితమవుతుంది. టైరులో గాలి సక్రమంగా ఉండేలా జాగ్రత్తగా ఉండాలి. టైర్ లో ఎయిర్ ప్రెజర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. తక్కువ విద్యుత్ వినియోగానికి, ఎక్కువ దూరాన్ని కవర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆప్టిమైజ్ డ్రైవింగ్:

స్లో పేస్, మీడియం మోడ్‌లో డ్రైవింగ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్‌ తరిగిపోదు. మైలేజీని పెంచడంలో సహాయపడుతుంది. యాక్సిలరేటర్,బ్రేక్‌ వాడకం సున్నితంగా ఉంటే బ్యాటరీ నుండి గరిష్ట దూరాన్ని వెళుతుంది. ఇ-స్కూటర్ రైడర్‌లు బ్రేకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్లు బ్రేకులు వేయకూడదు.

ఈ ఫీచర్లను ఆఫ్ చేయండి:

ఇ-స్కూటర్‌లలో అవసరం లేని కొన్నిఫీచర్లు ఉంటాయి. బ్యాటరీ చార్జీని తగ్గిస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్లూటూత్, స్మార్ట్ నావిగేషన్ రిఫ్లెక్టర్ లైట్లు వంటి సౌకర్యాలు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఉదయం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, పవర్ ఆదా చేయడానికి LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్‌ల్యాంప్‌లను ఆఫ్ చేసుకోవచ్చు.

బ్యాటరీని అప్‌గ్రేడ్ చేయండి:

వాహనం బ్యాటరీని అప్‌గ్రేడ్ చేయడం అనేది మీ ఇ-స్కూటర్‌కి జీవితాన్ని పెంచడానికి ఒక ఖచ్చితమైన మార్గం, ప్రస్తుత బ్యాటరీ సరిగ్గా పని చేయకపోతే. స్కూటర్ అవసరాలపై ఆధారపడి, అధిక వోల్టేజ్ బ్యాటరీని ఎంచుకోవచ్చు. దీని వలన మెరుగైన మైలేజీ లభిస్తుంది. ఆంపియర్ గంటలు (Ah) – బ్యాటరీ ఛార్జ్ – ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని బట్టి మైలేజీ పెరుగుతుంది. కొన్ని EVలు రెండవ బ్యాటరీని జోడించే అవకాశాన్ని కూడా ఇస్తాయి, ఇది రెట్టింపు శక్తిని అందిస్తుంది.

బ్యాటరీ నిర్వహణ:

ఎలక్ట్రిక్ స్కూటర్ కు బ్యాటరీ ఆరోగ్యం చాలా ముఖ్యం. చాలా ఇ-స్కూటర్‌లు దాదాపు 300-500 ఛార్జ్ సైకిల్స్‌తో లిథియం-అయాన్ బ్యాటరీల ద్వారా శక్తిని పొందుతాయి, దాదాపు రెండు నుండి మూడు సంవత్సరాల జీవితకాలం పాటు బ్యాటరీ పని చేస్తుంది. లిథియం-అయాన్ బ్యాటరీలు దాదాపు 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉత్తమంగా పనిచేస్తాయి. అధిక ఉష్ణోగ్రత బ్యాటరీ జీవితాన్ని తగ్గిస్తుంది, అయితే తక్కువ ఉష్ణోగ్రతలు బ్యాటరీ శక్తిని కలిగి ఉండే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

బరువును పర్యవేక్షించండి:

ఎలక్ట్రిక్ స్కూటర్ మోయాల్సిన మొత్తం బరువు ద్వారా కూడా ప్రభావితమవుతుంది. అనవసరమైన వస్తువులను తీసుకుళ్లి బరుపు పెంచకూడదు. స్కూటర్‌పై భారాన్ని తగ్గిస్తే ఎక్కువ మైలేజీని అందిస్తాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..