Elon Musk Job: ఏడు గంటలు నడిస్తే రోజుకు 28 వేల జీతం.. మతిపోయే జాబ్ ఆఫర్ ప్రకటించిన మస్క్ కంపెనీ

ఎలన్ మస్క్ ఈ పేరు అంటే టెక్ రంగంలో ఓ క్రేజ్. టెస్లా కంపెనీ సీఈఓ అయిన మస్క్ కంపెనీలో ఉద్యోగం కోసం వేల మంది పోటీపడుతూ ఉంటారు. ఈవీ కార్ల రంగంలో టెస్లా కార్లకు ప్రత్యేక క్రేజ్ ఉంది. అయితే తాజాగా ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా ఓ వినూత్న జాబ్ ఆఫర్‌ను ప్రకటించింది. రోజూ ఏడు గంటలు నడిస్తే రోజుకు రూ. 28,000 (340 డాలర్లను) జీతం అందిస్తోంది.

Elon Musk Job: ఏడు గంటలు నడిస్తే రోజుకు 28 వేల జీతం.. మతిపోయే జాబ్ ఆఫర్ ప్రకటించిన మస్క్ కంపెనీ
Elon Musk
Follow us

|

Updated on: Aug 30, 2024 | 3:15 PM

ఎలన్ మస్క్ ఈ పేరు అంటే టెక్ రంగంలో ఓ క్రేజ్. టెస్లా కంపెనీ సీఈఓ అయిన మస్క్ కంపెనీలో ఉద్యోగం కోసం వేల మంది పోటీపడుతూ ఉంటారు. ఈవీ కార్ల రంగంలో టెస్లా కార్లకు ప్రత్యేక క్రేజ్ ఉంది. అయితే తాజాగా ఎలన్ మస్క్ కంపెనీ టెస్లా ఓ వినూత్న జాబ్ ఆఫర్‌ను ప్రకటించింది. రోజూ ఏడు గంటలు నడిస్తే రోజుకు రూ. 28,000 (340 డాలర్లను) జీతం అందిస్తోంది. అంటే గంట నడిస్తే రూ.4 వేలు సంపాదించుకోవచ్చన్న మాట. ఈ ఉద్యోగానికి ఎటువంటి కార్యాలయ పని అవసరం లేదు. ప్రతి రోజూ నిర్ణీత వ్యవధిలో నడవడం ప్రాథమిక బాధ్యత, అలాగే మెడికల్ ఇన్సూరెన్స్‌తో పాటు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ జాబ్ ఆఫర్ యునైటెడ్ స్టేట్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే ఈ జాబ్ కోసం కనీస విద్యా స్థాయి ఐదో తరగతికి పేర్కొన్నారు. వినడానికే కొత్తగా ఉన్న ఈ జాబ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి హ్యూమనాయిడ్ రోబోట్‌లకు శిక్షణ ఇచ్చేందుకు టెస్లా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా “డేటా కలెక్షన్ ఆపరేటర్” పేరుతో ఈ ఉద్యోగం వచ్చింది. ఈ జాబ్ వచ్చిన ఉద్యోగులు మోషన్ క్యాప్చర్ సూట్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ధరించి నడవడానికి గడిపిన సమయానికి దాదాపు రూ. 4,000 చొప్పున గంటకు 48 డాలర్లు చెల్లిస్తారు. రోబోట్‌ల కార్యాచరణను మెరుగుపరచడానికి డేటాను సేకరించి విశ్లేషించడానికి ఈ ఉద్యోగం రూపొందించారు. ఈ డేటాను సేకరించడంతో పాటు విశ్లేషించడం ఆపై వారి అన్వేషణల ఆధారంగా వివరణాత్మక నివేదికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం కోసం అభ్యర్థులు తప్పనిసరిగా డేటా సేకరణ, విశ్లేషణలో నైపుణ్యం కలిగి ఉండాలి. అలాగే బలమైన రిపోర్టింగ్ నైపుణ్యాలను కలిగి ఉండాలి.

దరఖాస్తుదారులు అర్హత పొందేందుకు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. వారు 5’7″ నుంచి 5’11” మధ్య ఎత్తు ఉండాలి. అలాగే వర్చువల్ రియాలిటీ టెక్నాలజీలో అనుభవం కలిగి ఉండాలి. ఈ ఉద్యోగం ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే అర్హతలు, నైపుణ్యాలను బట్టి గంటకు సుమారుగా రూ. 2,120 నుంచి రూ. 4,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్ ఓపెనింగ్ అనేది రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏడు గంటలు నడిస్తే రోజుకు 28 వేల జీతం..మస్క్ కంపెనీ మతిపోయే ఆఫర్.!
ఏడు గంటలు నడిస్తే రోజుకు 28 వేల జీతం..మస్క్ కంపెనీ మతిపోయే ఆఫర్.!
బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్
బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్
సేమ్‌.. టు... సేమ్‌.. బట్ డిఫరెంట్బన్నీని ఫాలో అవుతున్న నాని !!
సేమ్‌.. టు... సేమ్‌.. బట్ డిఫరెంట్బన్నీని ఫాలో అవుతున్న నాని !!
దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం
దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం
హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్
హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్
భార్యపై ప్రేమతో ఓ భర్త ఏం చేశాడంటే..?
భార్యపై ప్రేమతో ఓ భర్త ఏం చేశాడంటే..?
సోమవతి అమావాస్య రోజున చేసే ఈఒక్క పరిష్కారం మీ కష్టాలు తీరుస్తుంది
సోమవతి అమావాస్య రోజున చేసే ఈఒక్క పరిష్కారం మీ కష్టాలు తీరుస్తుంది
గృహ రుణం పొందడం ఇబ్బందిగా మారిందా..? ఈ టిప్స్ పాటిస్తే సమస్య ఫసక్
గృహ రుణం పొందడం ఇబ్బందిగా మారిందా..? ఈ టిప్స్ పాటిస్తే సమస్య ఫసక్
రైల్వేలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్ అర్హత
రైల్వేలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఇంటర్ అర్హత
సీరియల్‌లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు బయట మాత్రం..
సీరియల్‌లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు బయట మాత్రం..