AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

70 Hour Work Week: ఆయన చెప్పింది వింటే అనారోగ్యం మీ వెంటే..! ఓలా సీఈఓ సూచనపై మండిపడ్డ న్యూరాలజిస్ట్

ఇటీవల ఓలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ ఇటీవల ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సూచించిన వారానికి 70 గంటల పనిని సిఫార్సు చేస్తున్నాని పేర్కొన్నారు. అయితే ఈ సూచనను ఓ టాప్ న్యూరాలజిస్ట్ వ్యతిరేకించాడు. ఇలా పొడిగించిన పని గంటల వల్ల వివిధ తీవ్రమైన అనారోగ్యాలు, అకాల మరణాలన పెంచుతాయని  ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి 2023లో భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడాలంటే యువకులు వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పారు.

70 Hour Work Week: ఆయన చెప్పింది వింటే అనారోగ్యం మీ వెంటే..! ఓలా సీఈఓ సూచనపై మండిపడ్డ న్యూరాలజిస్ట్
70 Hour Work Week
Nikhil
|

Updated on: Jul 13, 2024 | 4:15 PM

Share

సమాజంలో ఉన్నత స్థితికి వెళ్లిన వారు యువతకు కొన్ని మంచి మాటలు చెబుతూ ఉంటారు. ఇటీవల ఓలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ ఇటీవల ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సూచించిన వారానికి 70 గంటల పనిని సిఫార్సు చేస్తున్నాని పేర్కొన్నారు. అయితే ఈ సూచనను ఓ టాప్ న్యూరాలజిస్ట్ వ్యతిరేకించాడు. ఇలా పొడిగించిన పని గంటల వల్ల వివిధ తీవ్రమైన అనారోగ్యాలు, అకాల మరణాలన పెంచుతాయని  ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ మూర్తి 2023లో భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడాలంటే యువకులు వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పారు. ఆ వాదనను ఓలా సీఈఓ భవిష్ సమర్థించారు. ఈ నేపథ్యంలో వారానిిక 70 గంటలు పని చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో? ఓసారి తెలుసుకుందాం. 

ఎక్కువ సమయం పని చేయడం వల్ల అకాల మరణాలు సంభవించే అవకాశం ఉందని హైదరాబాద్ కు చెందిన న్యూరాలజిస్ట్ ఒకరు తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన సుధీర్ కుమార్ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. చాలా గంటలు పని చేయడం వల్ల తీవ్రమైన వ్యాధులు, అకాల మరణాలు కూడా పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ మేరకు పలు అధ్యయనాల గురించి వారానికి 55 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పని చేయడం వల్ల హార్ట్స్ట్రోక్ వచ్చే ప్రమాదం 35 శాతం ఎక్కువని వివరించారు. ముఖ్యంగా ఇస్కీమిక్ గుండె జబ్బుతో మరణించే ప్రమాదం 17 శాతం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. వారానికి 55 గంటలకు పైగా పని చేయడం వల్ల ఏటా 8,00,000 మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అదనంగా పొడిగించిన పని గంటల వల్ల ఊబకాయం, ప్రీడయాబెటిస్, టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. 

వారానికి 69 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులు వారానికి 40 గంటలు పనిచేసే వారి కంటే మితమైన, తీవ్రమైన నిస్పృహ లక్షణాలను కలిగి ఉంటారని వివరించారు. ముఖ్యంగా టాప్ సీఈఓలు తమ కంపెనీ లాభదాయకత మరియు వారి వ్యక్తిగత సంపద రెండింటినీ పెంపొందించడానికి తమ ఉద్యోగుల మధ్య పని గంటలను పొడిగించాలని తరచుగా వాదిస్తారు. ఉద్యోగులు అనారోగ్యానికి గురైన సందర్భంలో వారిని సులభంగా భర్తీ చేస్తారని అన్నారు. అయితే ఉద్యోగులపై శ్రద్ధ వహించే సహేతుకమైన పని గంటలను సిఫార్సు చేసే సంస్థను ఎంచుకోవడం ఉద్యోగుల ఇష్టమని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి