AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhar Update: ఆధార్‌ను పదేళ్లు అప్‌డేట్ చేయకపోతే ఇన్‌వ్యాలీడ్..? యూఐడీఏఐ షాకింగ్ సమాధానాలు

పదేళ్ల క్రితం ఆధార్ కార్డును పొందిన వినియోగదారులు వాటిని ఎప్పుడూ అప్‌డేట్ చేయకపోతే జూన్ 14 తర్వాత ఆధార్ కార్డ్ పనిచేయదని పేర్కొంటూ ఒక నకిలీ వార్త వైరల్ అవుతుంది. నివేదికల ప్రకారం యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ వాదనలను ఖండించింది. అయితే ఇది జరగదని పది సంవత్సరాల తర్వాత ఆధార్ కార్డులు అప్‌డేట్ కాకపోయినా అవి పని చేస్తూనే ఉంటాయని యూఐడీఏఐ తెలిపింది.

Aadhar Update: ఆధార్‌ను పదేళ్లు అప్‌డేట్ చేయకపోతే ఇన్‌వ్యాలీడ్..? యూఐడీఏఐ షాకింగ్ సమాధానాలు
Aadhaar Card
Nikhil
|

Updated on: May 24, 2024 | 4:15 PM

Share

ఇటీవల ఆధార్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పదేళ్ల క్రితం ఆధార్ కార్డును పొందిన వినియోగదారులు వాటిని ఎప్పుడూ అప్‌డేట్ చేయకపోతే జూన్ 14 తర్వాత ఆధార్ కార్డ్ పనిచేయదని పేర్కొంటూ ఒక నకిలీ వార్త వైరల్ అవుతుంది. నివేదికల ప్రకారం యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఈ వాదనలను ఖండించింది. అయితే ఇది జరగదని పది సంవత్సరాల తర్వాత ఆధార్ కార్డులు అప్‌డేట్ కాకపోయినా అవి పని చేస్తూనే ఉంటాయని యూఐడీఏఐ తెలిపింది. కొంతకాలం క్రితం వచ్చిన ఒక వార్త కారణంగా ఆధార్ కార్డుకు సంబంధించి ఈ మోసపూరిత నివేదికలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వైరల్ వార్త గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి కేంద్రం గడువును జూన్ 14, 2024 వరకు పొడిగించామని యూఐడీఏఐ పేర్కొంది. అంతకుముందు ఈ గడువు మార్చి 14 అయితే యూఐడీఏఐ ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయాన్ని జూన్ 14 వరకు పొడిగించింది. ఇది ఆధార్ కార్డ్‌లు రద్దు అవుతుందనే పుకార్లకు దారితీసింది. జూన్ 14 తర్వాత చెల్లదంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రజలు తమ ఆధార్ నంబర్లను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకుంటేనే ఉచిత అప్‌డేషన్ సౌకర్యం లభిస్తుంది. అయితే, వారు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవడానికి చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆధార్ కార్డ్‌లో ఎవరి ఫోన్ నంబర్‌ను జోడించకపోతే, వారు దాని కోసం సేవా కేంద్రానికి వెళ్లాలి. రెండో సందర్భంలో, వారు నవీకరణ కోసం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆధార్ కార్డ్ ఆన్‌లైన్ అప్‌డేట్ ఇలా

  • ముందుగా యూఐడీఏఐకు సంబంధించిన స్వీయ-సేవ అప్‌డేట్ పోర్టల్‌పై క్లిక్ చేయాలి.
  • ‘లాగిన్’పై క్లిక్ చేసి మీ ప్రత్యేకమైన 12-అంకెల ఆధార్ నంబర్, ఇచ్చిన క్యాప్చా కోడ్‌ను కూడా ఎంటర్ చేయాలి.
  • తర్వాత ‘సెండ్ ఓటీపీ’పై క్లిక్ చేయాలి. మీరు మీ ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • ఇప్పుడు సర్వీసెస్ ట్యాబ్ కింద ‘ఆధార్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండి’ని ఎంచుకోవాలి.
  • అనంతరం ‘ప్రొసీడ్ టు అప్‌డేట్ ఆధార్’పై క్లిక్ చేసి, మీరు మార్చాలనుకుంటున్న వివరాలను ఎంచుకోవాలి.
  • మీ ఆధార్ కార్డ్‌లో ఇప్పటికే ఉన్న మీ పేరు మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • మీరు పత్రాలను అప్‌లోడ్ చేయడం ద్వారా మీకు కావాల్సిన మార్పులు చేయవచ్చు.
  • చేసిన మార్పులను నిర్ధారించి, మీ సమాచారం నవీకరణ అవుతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.