Hyundai Exter: హ్యూందాయ్ నయా వేరియంట్ విడుదల.. సీఎన్‌జీ లవర్స్‌కు ఇక పండగే..!
భారతదేశ ఆటో మొబైల్ రంగంలో కార్ల సేల్స్ ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న మార్కెట్‌కు అనుగుణంగా చాలా కంపెనీలు కొత్త వేరియంట్ కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవల పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల దెబ్బకు సీఎన్‌జీ, ఈవీ వెర్షన్ కార్ల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ హ్యూందాయ్ ఎక్స్‌టర్ కారును సీఎన్‌జీ వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హ్యూందాయ్ ఎక్స్‌టర్ కొత్త వేరియంట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఎక్స్‌టర్ హెచ్‌వై- సీఎన్‌జీ డ్యూయో లైనప్‌లో ఈఎక్స్ అనే కొత్త ట్రిమ్‌ను విడుల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వేరియంట్ ధర రూ. 7.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభించింది. ముఖ్యంగా వినియోగదారులకు విస్తృత ఎంపికలను అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త కారును విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కారును ప్రత్యేకంగా జెన్ ఎంజెడ్ కస్టమర్ల కోసం రూపొందించారు. అత్యాధునిక సాంకేతికతతో పాటు సమర్థవంతమైన డబుల్-ఇంధన ఎంపిక వంటి ఆఫర్‌లను అందిస్తుంది. ఈ కారు కొనుగోలు ఆసక్తి ఉన్న కస్టమర్‌లు దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ అధీకృత డీలర్ల ద్వారా ఈ కారును ప్రీ-బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఎక్స్‌టర్ హై-సీఎన్‌జీ డుయో ఎక్స్ వేరియంట్‌ను ప్రత్యేకంగా ఆకట్టుకోవడానికి విస్తృత శ్రేణి ట్రెండింగ్ ఫీచర్స్‌తో అందిస్తున్నారు. స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగులు, 10.67 సెం.మీ (4.2) కలర్ టీఎఫ్‌టీ ఎంఐడీతో డిజిటల్ క్లస్టర్, స్గ్నేచర్ హెచ్ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్, కీలెస్ ఎంట్రీ, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్‌లతో ఆటోమేటిక్ ఓఆర్‌వీఎంఎస్, సైడ్‌లో మంచి సైజ్ క్లాడింగ్, రూఫ్ రెయిల్స్ వంటి అధునాతన ఫీచర్లతో అప్‌డేట్ చేశారు. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే 1.2 లీటర్ బై-ఫ్యూయల్ కప్పా పెట్రోల్‌ను హై-సీఎన్‌జీ డ్యూయో యూనిట్ ఆధారంగా పని చేస్తుంది. అలాగే ఈ కారు సీఎన్‌జీ కిలోకు 27.1 కి.మీ మైలేజీ వస్తుంది.
ఈ కారు రిలీజ్‌పై హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ హోల్-టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ తమ కస్టమర్ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చే స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్‌లను అందిస్తామని పేర్కొన్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా హ్యూందాయ్ ఎక్స్‌టర్ హై- సీఎన్‌జీ డుయో లైనప్‌లో ఈఎక్స్ వేరియంట్ పరిచయం చేశామని, ఈ కారు డబుల్ -ఇంధన సాంకేతికత, మెరుగైన భద్రతా లక్షణాలతో వస్తుందని వివరించారు. తమ కంపెనీ గ్రీన్ మొబిలిటీ పోర్ట్‌ఫోలియోను విస్తరించడమే లక్ష్యంగా నూతన ప్రొడెక్ట్స్ లాంచ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








