AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. ఎందుకో తెలుసా..?

Bank Holidays: బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో మొబైల్, ఇంటర్‌నెట్‌ బ్యాంక్‌, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. దాంతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేందుకు వీలుంటుంది. నగదు విత్‌డ్రా కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్‌ డిపాజిట్‌ కోసం..

Bank Holidays: వరుసగా 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. ఎందుకో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Apr 09, 2025 | 1:24 PM

Share

చాలా మంది ప్రతి రోజు వివిధ రకాల లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినెల బ్యాంకులకు సెలవులను ప్రకటిస్తుంటుంది. ఆ సెలవు దినాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. బ్యాంకు వినియోగదారులు ముందుస్తుగా బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో గమనించి ప్లాన్‌ చేసుకోవడం చాలా ముఖ్యం.

అయితే ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుందని గుర్తించుకోండి. అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండకపోవచ్చు.

ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బ్యాంకులకు వరుస సెలవులు ఉండే అవకాశం ఉంది. 10వ తేదీన మహవీర్‌ జయంతి, 11న మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి, 12న శనివారం, 13న ఆదివారం, 14న అంబేద్కర్ జయంతి. ఈ రోజులలో బ్యాంకులు మూసి ఉండే అవకాశం ఉంది. 11న ఏపీ, తెలంగాణలో బ్యాంకులకు సెలవు లేదు. తెరిచే ఉంటాయి. మిగతా రాష్ట్రాల్లో సెలవు ఉంది.

అయితే బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో మొబైల్, ఇంటర్‌నెట్‌ బ్యాంక్‌, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. దాంతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేందుకు వీలుంటుంది. నగదు విత్‌డ్రా కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్‌ డిపాజిట్‌ కోసం మెషిన్స్‌ సైతం అందుబాటులో ఉండగా.. వీటితో అకౌంట్‌లో డబ్బులు చేసుకునే అవకాశం ఉంది.

ఏప్రిల్ 15 – బెంగాలీ న్యూ ఇయర్‌ సందర్భంగా అసోం, వెస్ట్‌ బెంగాల్‌ సహా పలు బ్యాంకులకు హాలీడే. ఏప్రిల్ 18 – గుడ్‌ఫ్రై డే సందర్భంగా పలు ప్రాంతాల్లో బ్యాంకుల మూసివేత. ఏప్రిల్‌ 20 – ఆదివారం సందర్భంగా బ్యాంకులు బంద్‌. ఏప్రిల్ 21 – గరియా పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్‌ 26 – శనివారం సందర్భంగా సెలవు. ఏప్రిల్‌ 27 -ఆదివారం సందర్భంగా సెలవు. ఏప్రిల్ 29 – భగవాన్ పరశురామ్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకుల మూసివేత. ఏప్రిల్ 30 – బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు బంద్‌.

Follow Us
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
వారానికి ఒక్కసారైనా తినండి.. చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
వారానికి ఒక్కసారైనా తినండి.. చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా