Hyundai: హ్యూందాయ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. కార్ సర్వీసింగ్‌పై డిస్కౌంట్లు.. బహుమతులు..
Hyundai Car Offers: హ్యూందాయ్ కార్ల వినియోగదారులకు గుడ్ న్యూస్. హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తన వాహనాల కోసం మన దేశంలో కొత్త సర్వీస్ శిబిరాన్ని ప్రారంభించింది. దీనికి స్మార్ట్ కేర్ క్లినిక్ అని పేరు పెట్టింది. ఈనెల 20న ప్రారంభమైన ఈ ప్రత్యేక క్యాంప్ 29వ తేదీ వరకూ కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 1,500 హ్యూందాయ్ సర్వీస్ సెంటర్లలో ఇప్పటికే కొనుగోలు చేసిన హ్యూందాయ్ కార్లకు సర్వీస్ చేయించేందుకు కొన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. అంతేకాక వినియోగదారులు ప్రతి రోజు బహుమతులు అందించే అవకాశం ఉంది.
హ్యూందాయ్ కార్ల వినియోగదారులకు గుడ్ న్యూస్. హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తన వాహనాల కోసం మన దేశంలో కొత్త సర్వీస్ శిబిరాన్ని ప్రారంభించింది. దీనికి స్మార్ట్ కేర్ క్లినిక్ అని పేరు పెట్టింది. ఈనెల 20న ప్రారంభమైన ఈ ప్రత్యేక క్యాంప్ 29వ తేదీ వరకూ కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 1,500 హ్యూందాయ్ సర్వీస్ సెంటర్లలో ఇప్పటికే కొనుగోలు చేసిన హ్యూందాయ్ కార్లకు సర్వీస్ చేయించేందుకు కొన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. అంతేకాక వినియోగదారులు ప్రతి రోజు బహుమతులు అందించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కస్టమర్ కనెక్ట్ ప్రోగ్రామ్..
హ్యుందాయ్ స్మార్ట్ కేర్ క్లినిక్ పేరిట ప్రత్యేక దేశవ్యాప్తంగా కస్టమర్ కనెక్ట్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. 10-రోజుల పాటు ప్రత్యేక సంవత్సరాంతపు ఆఫర్‌లు, పలు ప్రయోజనాలను అందిస్తోంది. అంతేకాక కార్లకు రెగ్యులర్ మెయింటెనెన్స్ ప్రాముఖ్యత గురించి కస్టమర్‌లకు అవగాహన కల్పిస్తోంది. ఈ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ తమ కంపెనీకి 2023 సంవత్సరం ఒక మైలురాయిగా పేర్కొన్నారు. తమ సరికొత్త ఎస్‌యూవీ – ఎక్స్ టర్ పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టించిందని చెప్పారు. ఇప్పటికే దాదాపు 100,000 బుకింగ్‌లతో అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. అలాగే ఐయనిక్5 కూడా ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి రాగా ఇప్పటికే 1000 కార్లను సేల్ చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ వేడుకకు మరిన్ని జోడించి వినియోగదారులకు విస్తృత శ్రేణి ప్రయోజనాలను అందించే విధంగా దేశవ్యాప్తంగా ‘హ్యుందాయ్ స్మార్ట్ కేర్ క్లినిక్’ ప్రచారాన్ని ప్రారంభించామన్నారు. హ్యుందాయ్ ఎల్లప్పుడూ కస్టమర్-సెంట్రిక్ బ్రాండ్‌గా ఉంటూ, స్థిరత్వాన్ని అందిస్తుందని చెప్పకొచ్చారు.
హ్యుందాయ్ స్మార్ట్ కేర్ క్లినిక్ లో అందే ప్రయోజనాలు..
ఉచిత 70-పాయింట్ చెకప్, మెకానికల్ భాగాలపై 10% తగ్గింపు, కానికల్ లేబర్‌పై 20% వరకు తగ్గింపు, వీల్ అలైన్‌మెంట్, బ్యాలెన్సింగ్‌పై 15% తగ్గింపు, ఇంటీరియర్ & ఎక్స్‌టీరియర్ బ్యూటిఫికేషన్‌పై 20% తగ్గింపు, డ్రై వాష్‌పై 20% తగ్గింపు, 1000+ లక్కీ కస్టమర్లకు అద్భుతమైన రివార్డ్‌లు. అయితే వీటిని పొందేందుకు కొన్ని షరతులను కంపెనీ విధించింది. అవి సర్వీస్ సెంటర్లో మీకు తెలియజేస్తారు.
హ్యుందాయ్ మోటార్ ఇండియా పర్యావరణాన్ని పరిరక్షించడానికి, వినియోగదారుల శ్రేయస్సును నిర్ధారించడానికి కట్టుబడి ఉంది. మెకానికల్ భాగాలు, లేబర్ వంటి సేవలపై తగ్గింపు ఆఫర్‌లు, వారి కార్ల మెరుగైన ఆరోగ్యానికి దారితీసే దీర్ఘకాల కాలానుగుణ నిర్వహణను పొందేలా వినియోగదారులను ప్రోత్సహిస్తాయి. హ్యుందాయ్ స్మార్ట్ కేర్ క్లినిక్ డ్రై వాష్‌పై స్మార్ట్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది, ఇది నీటి వృథాను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..