AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పుంజుకున్న రియల్ భూమ్.. ఇయర్ రిపోర్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

హైదరాబాద్ మహానగరం స్థిరాస్తి రంగం మందగమనం నుంచి కోలుకుంటుంది. రెండేళ్లుగా స్తబ్దతగా ఉన్న రియల్ ఎస్టేట్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. వెట్ అండ్ సీ ధోరణి నుంచి కొనుగోలు దారులు ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. భాగ్యనగరంలో ప్రీమియట్ హైసింగ్ కు క్రేజీ పెరిగింది. కోటిన్నర రూపాయలు ఆ పైన ఉన్న ఇళ్ల అమ్మకాలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Hyderabad: పుంజుకున్న రియల్ భూమ్.. ఇయర్ రిపోర్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Hyderabad Real Estate
Vidyasagar Gunti
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 13, 2025 | 5:16 PM

Share

హైదరాబాద్ మహానగరం స్థిరాస్తి రంగం మందగమనం నుంచి కోలుకుంటుంది. రెండేళ్లుగా స్తబ్దతగా ఉన్న రియల్ ఎస్టేట్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. వెట్ అండ్ సీ ధోరణి నుంచి కొనుగోలు దారులు ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. భాగ్యనగరంలో ప్రీమియట్ హైసింగ్ కు క్రేజీ పెరిగింది. కోటిన్నర రూపాయలు ఆ పైన ఉన్న ఇళ్ల అమ్మకాలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 75 లక్షల లోపు ఉన్న ఇళ్లకు అంతగా డిమాండ్ లేదని సర్వే రిపోర్టులు సూచిస్తున్నాయి.

ANAROCK Group రిపోర్ట్ ప్రకారం 2025 సెప్టెంబర్ నాటికి హైదరాబాద్‌లో సుమారు 98,000 యూనిట్లు అమ్మకం కాకుండా ఉన్నాయి. 2025లో సుమారు 8,630 యూనిట్లు కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. 2024లో 13,890 యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ యేడాది అందుబాటులోకి వచ్చిన యూనిట్లను 2024తో సరిపోల్చితే 38 శాతం తగ్గుదల ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. 2025 లో సుమారు 11,035 యూనిట్లు అమ్ముడు పోయాయి. 2024లో ఉన్న 12,735 యూనిట్లతో పోల్చితే 11 శాతం తగ్గుదల కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ప్రీమియమ్ హౌసింగ్ అంటే కోటిన్నర రూపాయల కంటే అధిక ధర వెచ్చించే ఇళ్లు 2025లో 8,205 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత యేడాదితో పోల్చితే భారీగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

నైట్ ఫ్రాంక్ సర్వే రిపోర్ట్ ప్రకారం 2025లో కోటి రూపాయలు ఆపైన ఇళ్లకు సంబంధించి 37 శాతం రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అదేవిధంగా ఈ యేడాది కాలంలో 10 వేల 661 యూనిట్లు అందుబాటులోకి రాగా.. 2024తో పోల్చితే 4 శాతం తగ్గుదల ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ సర్వే రిపోర్ట్ చెబుతోంది. ధరల పెరుగుదల 9 శాతంగా ఉంది. నగర శివారులో సగటున చదరపు అడుగుకు 6 వేల164 రూపాయలు ఉన్నట్లు పేర్కొంది. హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో సప్లై-డిమాండ్ అసమతుల్యత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అఫోర్డబుల్ హౌసింగ్‌లో డిమాండ్ పడిపోయిందని చెబుతున్నారు. సప్లై ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్‌లో ఒత్తిడి పెరిగిందని అంటున్నారు. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ సర్వే రిపోర్ట్ లు చెబుతున్నాయి.

2025 తొలి త్రైమాసికంలో 4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి, ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 31% పెరుగుదల ఉంది. ఇక ఆఫీస్ అద్దె ధరలు సగటున 9 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ప్రీమియమ్ హోమ్స్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. కోటి రూపాయలపైన విలువ చేసే ప్రీమియమ్ హోమ్స్‌ అమ్మకాల్లో 28 శాతం వాటా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ప్రీమియమ్ హౌసింగ్ పై హైదరాబాదీలు మక్కువ పెంచుకుంటున్నారని చెప్పుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..