One Nation One Rate: త్వరలో వన్‌ నేషన్‌.. వన్ రేట్ పాలసీ.. దేశంలో బంగారు నగల రేట్లు తగ్గనున్నాయా..?

Gold Prices: దేశంలో బంగారు నగల రేట్లు తగ్గనున్నాయా?. దేశమంతా ఒకే రేటు విధానం అమల్లోకి రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గోల్డ్ వ్యాపారులు ఈ ప్రపోజల్‌కు సూత్రప్రాయంగా ప్రస్తుతానికి అంగీకరించినా, సెప్టెంబర్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

One Nation One Rate: త్వరలో వన్‌ నేషన్‌.. వన్ రేట్ పాలసీ.. దేశంలో బంగారు నగల రేట్లు తగ్గనున్నాయా..?
Gold Price
Follow us

|

Updated on: Jul 16, 2024 | 7:08 AM

Gold Prices: దేశంలో బంగారు నగల రేట్లు తగ్గనున్నాయా?. దేశమంతా ఒకే రేటు విధానం అమల్లోకి రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గోల్డ్ వ్యాపారులు ఈ ప్రపోజల్‌కు సూత్రప్రాయంగా ప్రస్తుతానికి అంగీకరించినా, సెప్టెంబర్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వన్‌ నేషన్-వన్ ఎలక్షన్, వన్ నేషన్‌-వన్ రేషన్‌లా దేశంలో ఇప్పుడు మరో కొత్త స్లోగన్ వినిపిస్తోంది. అదే వన్ నేషన్‌ వన్ రేట్. దేశంలోని గోల్డ్ వ్యాపారులందరూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ONOR విధానానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. బంగారం ధరలు స్థిరీకరించేందుకు, వన్ నేషన్‌ వన్ రేట్ విధానంపై జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ వ్యాపారుల అభిప్రాయం కోరింది. దేశంలో మెజారిటీ బంగారు వ్యాపారులందరూ ONOR పాలసీకి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జరిగే GJC మీటింగ్‌లో వన్‌ నేషన్, వన్ రేట్ విధానంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రస్తుతం బంగారం రేట్లు రాష్ట్రానికో విధంగా ఉంటాయి. ఢిల్లీలో ఒక రేటు ఉంటే, చెన్నై, హైదరాబాద్‌లలో మరో రేటు ఉంటుంది. వన్ నేషన్‌ వన్ రేట్‌తో కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా వినియోగదారులు అందరికీ బంగారం ఒకే రేటుకు లభించనుంది. ONOR అమలైతే.. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ అనే భేదం లేకుండా అన్నిచోట్ల ఆభరణాలు ఒకే రేటుకు లభిస్తాయి. ఒక రేటు విధానంతో గోల్డ్ మార్కెట్ కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సమర్థవంతంగా పనిచేస్తుందని వ్యాపారులు అంటున్నారు. ONORతో కస్టమర్లకు దళారుల బెడద లేకుండా.. పారదర్శకమైన విధానం తెచ్చినట్లు అవుతుందని, ఎక్కడా అక్రమాలకు చోటు లేకుండా ఉంటుందని చెబుతున్నారు.

వన్‌ నేషన్‌, వన్ రేట్‌ విధానంతో బంగారం ధరలు కూడా కొంత తగ్గుతాయని, వినియోగదారులకు కాస్త ఊరట లభిస్తుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…