AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 21,000 వరకూ తగ్గింపు.. సింగిల్ చార్జ్ పై 200 కి.మీ. రేంజ్.. మిస్ చేసుకోవద్దు..

ఈ క్రమంలో కోమకీ కూడా భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. కోమకీ ఎల్‌వై డ్యూయల్ బ్యాటరీ స్కూటర్ పై ఏకంగా రూ. 21,000 డిస్కౌంట్ ను అందిస్తోంది. వినియోగదారులు ఇప్పుడు దీనిని రూ. 1,13,999కే కొనుగోలు చేయొచ్చు. దీని అసలు ధర రూ. 1,34,999గా ఉంది. దీపావళి వరకూ ఈ ఆఫర్ దేశ వ్యాప్తంగా అమలు అవుతోంది. ఫెస్టివ్ సీజన్లో అత్యధిక అమ్మకాలు సాగించేలా కంపెనీ ఎలక్ట్రిక్ మోడల్ పై ఈ తగ్గింపును అందిస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 21,000 వరకూ తగ్గింపు.. సింగిల్ చార్జ్ పై 200 కి.మీ. రేంజ్.. మిస్ చేసుకోవద్దు..
Komaki Ly Electric Scooter
Madhu
|

Updated on: Sep 25, 2023 | 8:00 AM

Share

ప్రస్తుతం అన్ని రంగాల్లో ఫెస్టివ్ సీజన్ నడుస్తోంది. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు వరుసగా వస్తుండటంతో అన్ని కంపెనీలు తమతమ ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా దసరా సమయంలో అత్యధిక శాతం మంది కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారు. దీంతో దానిని గ్రాబ్ చేసుకునేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్ వస్తువు ఏమైనా ఉంది అంటే ఎలక్ట్రిక్ వాహనాలే. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు బాగా జరుగుతున్నాయి. దీనిని ఈ ఫెస్టివ్ సీజన్లో మరింత పెంచుకునేందుకు వీలుగా అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయదారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో కోమకీ కూడా భారీ తగ్గింపు ధరలను ప్రకటించింది. కోమకీ ఎల్‌వై డ్యూయల్ బ్యాటరీ స్కూటర్ పై ఏకంగా రూ. 21,000 డిస్కౌంట్ ను అందిస్తోంది. వినియోగదారులు ఇప్పుడు దీనిని రూ. 1,13,999కే కొనుగోలు చేయొచ్చు. దీని అసలు ధర రూ. 1,34,999గా ఉంది. దీపావళి వరకూ ఈ ఆఫర్ దేశ వ్యాప్తంగా అమలు అవుతోంది. ఫెస్టివ్ సీజన్లో అత్యధిక అమ్మకాలు సాగించేలా కోమకీ తన ఎలక్ట్రిక్ మోడల్ పై ఈ తగ్గింపును అందిస్తోంది.

కోమకీ ఎల్‌వై స్కూటర్ స్పెసిఫికేషన్లు..

కోమకీ ఎల్‌వై ఎలక్ట్రిక్ స్కూటర్లు డ్యూయల్ బ్యాటరీలతో వస్తాయి. 62వోల్ట్స్ 32ఏహెచ్ సామర్థ్యంతో ఉంటాయి. వీటిని బయటకు తీసి ఎంచక్కా చార్జ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీ ఐదు గంటలలోపే ఫుల్ చార్జ్ అవుతుంది. సింగిల్ చార్జ్ పై ఈ రెండు బ్యాటరీ సాయంతో 200కిలోమీటర్ల వరకూ రేంజ్ ఇస్తుంది. అదే సింగిల్ బ్యాటరీతో ఆపరేట్ చేస్తే సింగిల్ చార్జ్ పై 85కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. టీఎఫ్టీ స్క్రీన్ ఈ స్కూటర్లో ఉంటుంది. దీని ద్వారా ఆన్ బోర్డ్ నావిగేషన్, సౌండ్ సిస్టమ్ బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్లతో పాటు రెడీ టూ రైడ్ ఫీచర్లు ఉంటాయి.

మూడు మోడ్లు..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మూడు గేర్ల మోడ్లు ఉంటాయి. ఎకో, స్పోర్ట్స్, టర్బో మోడ్లలో ఇది పనిచేస్తుంది. ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. 3000వాట్ల సామర్థ్యంతో హబ్ మోటార్ ఉంటుంది. పార్కింగ్ అసిస్ట్/క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, హోస్ట్ డిఫరెన్షియల్ పాయింట్స్ ఉంటాయి. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.

ఇవి కూడా చదవండి

అప్ గ్రేడెడ్ వెర్షన్..

మరోవైపు కోమకీ కంపెనీ నుంచే వచ్చిన వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఏడాది ఆగస్టులోనే అప్ గ్రేడ్ అయ్యింది. మరిన్ని సేఫ్టీ ఫీచర్లను యాడ్ చేసిన కంపెనీ రిమూవబుల్ లైఫ్పీఓ04యాప్ ఆధారంగా పనిచేసే స్మార్ట్ బ్యాటరీస్ తో సరికొత్త లాంచ్ చేసింది. ఇవి ఫైర్ రెసిస్టెంట్ గా ఉంటాయి. ఇది నాలుగు గంటల్లో సున్నా నుంచి 90శాతం చార్జింగ్ ఎక్కేస్తుంది. టీఎఫ్టీ స్క్రీన్ సాయంతో ఆన్ బోర్డు నావిగేషన్, సౌండ్ సిస్టమ్, రైడ్ కాలింగ్ సదుపాయాలతో ఉంటుంది. దీని ధర రూ. 1,67,500గా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?
ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?
వాళ్లు చేసిన పనికి కారులో గంటసేపు ఏడ్చేశా..
వాళ్లు చేసిన పనికి కారులో గంటసేపు ఏడ్చేశా..