AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmos Missile: మన బ్రహ్మోస్ క్షిపణికి భారీ డిమాండ్..కొనుగోలు చేయడానికి ఇండోనేషియా ఆసక్తి

ప్రతి దేశం తన భూభాగాన్ని రక్షించుకోవడానికి, శత్రువులు లోపలకు రాకుండా నిరోధించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ప్రజల సంక్షేమాన్ని చూసుకోవడంతో పాటు రక్షణకు కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఆయుధాలను సమకూర్చుకోవడానికి ఎక్కువ నిధులు కేటాయిస్తుంది. దేశ రక్షణ కోసం ఇది అత్యంత అవసరం.

Brahmos Missile: మన బ్రహ్మోస్ క్షిపణికి భారీ డిమాండ్..కొనుగోలు చేయడానికి ఇండోనేషియా ఆసక్తి
Brahmos Missile
Nikhil
|

Updated on: Jan 28, 2025 | 4:00 PM

Share

భారతదేశం కూడా అన్ని రకాలుగా ప్రగతి పథంలో పయనిస్తోంది. ఆయుధాలను కూడా సమకూర్చుకుంటోంది. వాటిని సొంతంగా తయారు చేసుకోవడంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ నేపథ్యంలో మన బ్రహ్మాస్త్రం అయిన బ్రహ్మోస్ క్షిపణిపై ఇండోనేషియా ఆసక్తి చూపుతోంది. అలాగే విమాన వాహన నౌకల సామర్థ్యాన్ని మెచ్చుకుంటోంది. దేశీయంలో విమాన వాహన నౌకలను తయారు చేసే దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయి. వాటిలో మన ఇండియా ఒకటి. మన తయారీ సామర్థ్యం పై ఇండోనేషియా సైన్యం ఆసక్తి కనబరుస్తోంది. అలాగే బ్రహ్మోస్ క్షిపణులను కూడా కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు మన రక్షణ మంత్రిత్వ శాఖకు తెలియజేశారు. మన అధికారులు కూడా నౌక నిర్మాణ రంగంలో జకర్తాతో సహకారం పెంపొందించే పనిలో ఉన్నారు.

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ఒప్పందపై చర్చల కోసం త్వరలో ఇండోనేషియా నుంచి అధికారులు మన దేశానికి రానున్నారు. సైనిక సహకారాన్ని అన్వేషించడానికి, క్షిపణి సామర్థ్యాలను అంచనా వేయడానికి మేజర్ జనరల్ యునియాంటోతో పాటు ఆ దేశ అధికారులు ఇక్కడ పర్యటిస్తారు. సరిహద్దుల రక్షణతో పాటు శత్రువుల దాడులను ఎదుర్కోవడానికి మన దేశం తయారు చేసుకున్న అత్యంత శక్తివంతమైన ఆయుధమే బ్రహ్మోస్ క్షిపణి. అధిక వేగం, దూరం, కచ్చితత్వం దీని ప్రత్యేకతలు. భూమి, ఆకాశం, నీటిపై నుంచే కాకుండా సముద్రం లోపల నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేశాయి. రెండు దేశాలు కలిసి ఉమ్మడి సంస్థగా బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఏపీఎల్)ను ఏర్పాటు చేసుకున్నాయి.

బ్రహ్మోస్ క్షిపణికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణి. రాడార్ కు దొరక్కుండా ప్రయాణించడంతో పాటు ప్రయోగించిన దగ్గరి నుంచి చివరి వరకూ అధిక సూపర్ సోనిక్ వేగంతో వెళుతుంది. మన దేశంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నదుల పేర్లను కలిపి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు. విమాన వాహక నౌక అంటే సముద్రంలో తేలియాడే విమానాశ్రయం అని చెప్పవచ్చు. యుద్ద సమయంలో వీటికి ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకూ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. సముద్ర భద్రత విషయంలో ఇవి చాలా కీలకంగా ఉంటాయి. వీటిని చూస్తే శత్రు దేశాలు దాడులు చేయడానికి భయపడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి