Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel: కోట్లాది మంది ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. కానీ వారికి మాత్రమేనండోయ్..!

Airtel: ప్రస్తుతం టెలికాం కంపెనీలు టారీఫ్‌లు పెంచడంతో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు వెళ్తున్నారు. దీంతో మళ్లీ కంపెనీ కొత్త ప్లాన్‌లను తీసుకువస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇక ఎయిర్‌టెల్‌ కస్టమలర్‌లకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. కానీ ఆ ఆఫర్‌ ఎవరెవరికో తెలుసా..? మరీ ఆ ప్లాన్‌ వివరాలు అదేంటో తెలుసుకుందాం..

Airtel: కోట్లాది మంది ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. కానీ వారికి మాత్రమేనండోయ్..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 28, 2025 | 1:33 PM

వినియోగదారులను ఆకర్షించడానికి టెలికాం కంపెనీలు గొప్ప ఆఫర్‌లను అందిస్తాయి. ఇటీవల ఎయిర్‌టెల్ కూడా అలాంటి ఆఫర్‌ను అందించింది. కంపెనీ కోట్లాది మంది వినియోగదారులకు ఉచిత డేటాను ఇస్తోంది. అయితే మీరు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని ఎలా పొందుతారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఎయిర్‌టెల్ ఆఫర్ ప్రయోజనం ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు మారే వ్యక్తులకు మాత్రమే అందించనుంది ఎయిర్‌టెల్‌. ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు అప్‌గ్రేడ్ చేయడానికి కంపెనీ వినియోగదారులను ఆకర్షిస్తోంది.

రూ.449 ప్లాన్:

ఎయిర్‌టెల్ ఆఫర్ ప్రయోజనం కంపెనీ చౌకైన రూ. 499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో లభిస్తుంది. ఈ ప్లాన్‌తో మీరు ప్రతి నెలా 50 GB హై స్పీడ్ డేటా, అపరిమిత ఉచిత కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలను పొందుతారు. టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. మీరు ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు మారితే మీకు కంపెనీ అదనంగా 25 GB హై స్పీడ్ డేటాను ఉచితంగా అందిస్తుంది. 50 GB డేటాతో పాటు 25 GB అదనపు ఉచిత డేటా ప్రయోజనం పొందుతారు. ఈ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో 200 GB వరకు డేటా రోల్‌ఓవర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. పూర్తి డేటా వినియోగం తర్వాత MBకి 2 పైసలు ఛార్జ్ అవుతుంది.

అదనపు ప్రయోజనాలు:

డేటా, కాలింగ్, SMS కాకుండా మీరు అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, 3 నెలల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం, ఉచిత హలో ట్యూన్, బ్లూ రిబ్బన్ బ్యాగ్ సర్వీస్ ప్రయోజనాలను పొందుతారు. మూడు నెలల తర్వాత ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు రూ. 99 ఛార్జ్ చేయబడుతుంది. మీరు కోరుకుంటే, మీరు సేవను కూడా నిలిపివేయవచ్చు.

ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు మారడం వల్ల ప్రయోజనాలేంటి?

ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు మారడం అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, వినియోగదారులు 200 GB డేటా రోల్‌ఓవర్ సౌకర్యాన్ని పొందుతారు. OTT ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే రూ.449 ప్లాన్‌పై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..