AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: డిజిటల్ పేమెంట్స్‌లో యూపీఐ హవా.. 2024లో రెండింతలైన చెల్లింపులు

భారతదేశంలో యూపీఐ చెల్లింపులు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ సిస్టమ్ నుంచి వచ్చిన డేటా ప్రకారం డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)కు సంబంధించిన సహకారం ఐదేళ్లలో రెండింతలు పెరిగింది. ఇది 2019లో 34 శాతం నుంచి 2024లో 83 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో యూపీఐ చెల్లింపుల్లో వృద్ధి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

UPI Payments: డిజిటల్ పేమెంట్స్‌లో యూపీఐ హవా.. 2024లో రెండింతలైన చెల్లింపులు
Upi Payments
Nikhil
|

Updated on: Jan 28, 2025 | 2:21 PM

Share

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (ఎన్ఈఎఫ్‌టీ), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్), ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్), క్రెడిట్, డెబిట్ కార్డుల వంటి ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతుల వాటా 2019లో 66 శాతం ఉంటే 2024లో 17 శాతానికి తగ్గింది. 2024లోనే భారత్ 208.5 బిలియన్ల డిజిటల్ చెల్లింపు లావాదేవీలను నమోదు చేసింది. భారతదేశం మొత్తం మీద ఎక్కువ మంది వ్యాపారస్తులతో పాటు పౌరులు కూడా ఎక్కువ సంఖ్య యూపీఐ చెల్లింపుల స్వీకరణకు మద్దతు పలకడంతో రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ యూపీఐ వాటా ఈ స్థాయిలో పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 2019 నుంచి 2024 మధ్య యూపీఐ పర్సన్ టు పర్సన్ లావాదేవీల కంటే యూపీఐ పర్సన్ టూ మర్చంట్ చెల్లింపుల పరిమాణం వేగంగా పెరిగింది. యూపీఐ పీటూఎం ఐదేళ్ల కాలంలో రూ. 500 కంటే తక్కువ లావాదేవీ విలువలకు 99 శాతం సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) వద్ద పెరిగింది. దీనికి విరుద్ధంగా యూపీఐ పీటూపీ అదే కాలంలో 56 శాతం సీఏజీఆర్ వద్ద వృద్ధి చెందింది.

ఎక్కువ పరిమాణ లావాదేవీలు అంటే రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తం అంటే పీటూఎం ఐదేళ్ల కాలంలో 109 శాతం సీఏజీఆర్ వద్ద వృద్ధి చెందింది. యూపీఐ పీ2పీ 57 శాతం సీఏజీఆర్‌ను నమోదు చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన తక్కువ విలువ లావాదేవీ చెల్లింపు పద్ధతి యూపీఐ లైట్ డిసెంబరు 2024లో రూ. 20.02 కోట్ల విలువైన రోజువారీ 2.04 మిలియన్ లావాదేవీలను నమోదు చేసింది. యూపీఐ లైట్ లావాదేవీకు సంబంధించిన సగటు పరిమాణంలో సంవత్సరానికి 13 శాతం పెరుగుదల ఉంది. 

పేటీఎం, ఫోన్‌పే వరుసగా ఫిబ్రవరి 15, 2023, మే 2, 2023న యూపీఐ లైట్‌ను ప్రవేశపెట్టినప్పుడు యూపీఐ లైట్ చెల్లింపు వాల్యూమ్‌లు, విలువలలో నిరంతర పెరుగుదలను గమనించామని ఆర్‌బీఐ నివేదికలో పేర్కొంది. డిజిటల్ వ్యాలెట్‌లను కలిగి ఉన్న ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు (పీపీఐ) వాల్యూమ్‌లో 12.3 శాతం క్షీణించాయి. 2023 క్యాలెండర్ సంవత్సరంలో 3.93 బిలియన్ల నుంచి క్యాలెండర్ సంవత్సరం 2024 రెండో సగంలో 3.45 బిలియన్ లావాదేవీలకు పడిపోయాయి. అదే సమయంలో పీపీఐలను ఉపయోగించి ప్రాసెస్ చేసిన లావాదేవీల విలువ 25 శాతం తగ్గింది. హెచ్2 సీవై 23లో రూ. 1.43 ట్రిలియన్ల నుంచి హెచ్2 సీవై24లో రూ. 1.08 ట్రిలియన్లకు పడిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి