AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లయ్యాక భారీగా ఖర్చులు.. అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడే బడ్జెట్ పద్మనాభం ఫార్ములా ఫాలో అవ్వండి..

ఒంటరిగా ఉన్నప్పుడు మన ఖర్చులను ఎలా పడితే అలా నిర్వహిస్తాం.. ఎంత ఖర్చునైనా భరిస్తాం.. కానీ పెళ్లి తర్వాత బడ్జెట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. విపరీతమైన బడ్జెట్ వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో, భార్యాభర్తల మధ్య సంబంధంలో చీలికలు కూడా ఏర్పడవచ్చు. పెళ్లయ్యాక భార్యాభర్తలిద్దరికీ బాధ్యతలు పెరుగుతాయి. ఇద్దరికీ ఇంటి నిర్వహణ బాధ్యత పెరుగుతుంది. ఇంకా పిల్లల ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి.

పెళ్లయ్యాక భారీగా ఖర్చులు.. అమ్మాయిలు, అబ్బాయిలు ఇప్పుడే బడ్జెట్ పద్మనాభం ఫార్ములా ఫాలో అవ్వండి..
Wedding
Shaik Madar Saheb
|

Updated on: Feb 03, 2024 | 12:40 PM

Share

ఒంటరిగా ఉన్నప్పుడు మన ఖర్చులను ఎలా పడితే అలా నిర్వహిస్తాం.. ఎంత ఖర్చునైనా భరిస్తాం.. కానీ పెళ్లి తర్వాత బడ్జెట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. విపరీతమైన బడ్జెట్ వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో, భార్యాభర్తల మధ్య సంబంధంలో చీలికలు కూడా ఏర్పడవచ్చు. పెళ్లయ్యాక భార్యాభర్తలిద్దరికీ బాధ్యతలు పెరుగుతాయి. ఇద్దరికీ ఇంటి నిర్వహణ బాధ్యత పెరుగుతుంది. ఇంకా పిల్లల ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి.

అయితే, ఇంటిని నడిపించే విషయానికి వస్తే, భాగస్వాములు కలిసి తమ ఇంటి బడ్జెట్‌ను నిర్ణయించుకోవాలి. బడ్జెట్ ఎక్కువ కాకుండా ఉండాలంటే ప్రణాళిక ప్రకారం.. ఖర్చు చేయాలి. అయితే, పెళ్లి తర్వాత మీ బడ్జెట్ పరిధి దాటి ఎక్కువ అవుతుంటే.. దానిని నిర్వహించడానికి కొన్ని చిట్కాలు అవలభించాలి.. వీటి ద్వారా భారీగా పెరుగుతున్న బడ్జెట్ ను నియంత్రించుకోవచ్చు..

అత్యవసర నిధి

బడ్జెట్ నిర్వహణతో పాటు, అత్యవసర నిధులను సృష్టించడం కూడా ముఖ్యం. ఉదాహరణకు.. కష్ట సమయాల్లో మీ వద్ద డబ్బు లేదని అనుకుందాం.. అప్పుడు మీరు దీని కోసం అత్యవసర డబ్బును ఉపయోగించవచ్చు. మీరు అత్యవసర నిధిని మీ బ్యాంక్ ఖాతాలో లేదా మ్యూచువల్ ఫండ్, లిక్విడ్ స్కీమ్‌లో ఉంచుకోవచ్చు.. తద్వారా అత్యవసర సమయాల్లో దీనిని ఉపయోగించుకోవచ్చు..

కొన్ని విషయాల్లో అవసరాలను తగ్గించుకోండి..

భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తే, ఖర్చుల నిర్వహణకు కొన్ని వస్తువులను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు, ఎటువంటి కారణం లేకుండా చేసే ప్రతి నెలా షాపింగ్ ను వాయిదా వేయవచ్చు. అలాగే.. డిన్నర్, పార్టీలు, వీకెండ్ ఎంజాయ్మెంట్ ఇలాంటి కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా, మీరు మీ బడ్జెట్‌ను సులభంగా నిర్వహించుకోవచ్చు..

జాబితా సిద్ధం చేసుకోవడం..

ఇంటి నుంచి పదే పదే కిరాణా సామాను ఆర్డర్ చేసే బదులు, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఒక్కసారే ఆర్డర్ చేసుకోవడం మంచిది. దీనితో మీరు కొన్ని వస్తువులను చౌకగా కొనుగోలు చేయవచ్చు. నెల ప్రారంభం కావడానికి ముందే మీరు జాబితాను సిద్ధం చేసుకుని ఓ ప్రణాళికతో ఖర్చు చేస్తే.. పెరిగిపోతున్న వ్యయాలను నియంత్రించుకోవచ్చు..

80-20 సూత్రం

బడ్జెట్‌ను నిర్వహించడానికి సులభమైన మార్గం ఏమిటంటే, ఖర్చు ఆదాయంలో 80 శాతం ఉండాలి. కనీసం 20 శాతం పొదుపు చేయాలి లేదా పెట్టుబడి పెట్టాలి. అలాగే, అనవసర ఖర్చులను, అససరం లేని వస్తువుల కొనుగోలును నివారించండి. తరచూ మాల్ లేదా షాప్‌లను సందర్శిస్తూ.. ఇష్టపడిన వాటిని వెంటనే కొనుగోలు చేయాలని అనుకోకండి.. ఇలా చేయడం ద్వారా అనవసర ఖర్చులు పెరుగుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..