International Trip: విదేశీ ప్రయాణానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి.. డబ్బును ఆదా చేసుకోవడం ఎలా?

2022 సంవత్సరం ముగియబోతోంది. కోవిడ్‌కు సంబంధించిన ప్రయాణ ఆంక్షలు పూర్తిగా తొలగిపోయాయి. అయితే ఉద్యోగులు ఎక్కువ కాలం ఇంటి నుండి పని చేయడం వల్ల..

International Trip: విదేశీ ప్రయాణానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి.. డబ్బును ఆదా చేసుకోవడం ఎలా?
International Trip
Follow us

|

Updated on: Dec 25, 2022 | 11:05 AM

2022 సంవత్సరం ముగియబోతోంది. కోవిడ్‌కు సంబంధించిన ప్రయాణ ఆంక్షలు పూర్తిగా తొలగిపోయాయి. అయితే ఉద్యోగులు ఎక్కువ కాలం ఇంటి నుండి పని చేయడం వల్ల జీవితంలో స్తబ్దతను అధిగమించే సమయం వచ్చింది. చాలా మంది ఇప్పుడు విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. కోవిడ్ తర్వాత విమాన టిక్కెట్ల ధరలు కూడా చాలా పెరిగిపోయాయి. దీంతో అధిక భారం మోయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రిప్ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు కాకుండా ట్రిప్‌ని ఫుల్‌గా ఎంజాయ్‌ చేసేలా విదేశాల పర్యటనను ఎలా ప్లాన్ చేసుకోవాలో అనే ఆలోచనలో పడిపోయారు. తక్కువ ఖర్చులోనే ఎంజాయ్‌ చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అయితే వారిలాగే మీరు కూడా విదేశాల పర్యటన కోసం ప్లాన్‌ చేసుకుంటున్నట్లయితే ఈ వివరాలు మీ కోసమే. విదేశాలకు వెళ్లడం అనేది ప్రతి ఒక్కరి కల. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆ కలను సులువుగా నెరవేర్చుకోవచ్చు.. అందుకే ఈ ప్లానింగ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

విదేశీ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనది. బహుశా అత్యంత ఖరీదైనది విమాన టిక్కెట్లు. ముందుగా విదేశీ పర్యటనల కోసం విమాన టిక్కెట్లను బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం చాలా నెలల ముందుగానే టిక్కెట్‌లను బుక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని సమయాల్లో విమాన టికెట్లు ఛార్జీల్లోనే లభిస్తాయి. అలాంటి సమయాలను చూసుకుని బుక్‌ చేసుకోడం ఉత్తమం. ఇది కాకుండా స్కై స్కానర్, మోమోండో, ట్రివాగో, ట్రివాగో, ట్రైయాడ్వైజర్ మొదలైన వివిధ బుకింగ్ సైట్‌లలో సరిపోల్చడం ద్వారా మీకు చౌకైన విమాన టిక్కెట్‌లను చూపించే అనేక యాప్‌లు, సైట్‌లు ఉన్నాయి. వాటిలో ఎందులో టికెట్ల చౌకగా లభిస్తాయో వాటిలో బుక్‌ చేసుకోవడం మంచిది.

ఇది కాకుండా, మీరు క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లు, ఎయిర్ మైల్స్ ఉపయోగించి విమాన టిక్కెట్లపై తగ్గింపును కూడా పొందవచ్చు. ఇక పర్యటనలో భాగంగా అతిపెద్ద మరో ఖర్చు అంటే వసతి, ఆహారానికి సంబంధించినది. క్రెడిట్‌ కార్డు, రివార్డు పాయింట్లను ఉపయోగించుకుని బుక్ చేసుకోవచ్చు. ఇవలా చేయడం మీ ఖర్చును తగ్గుతుంది. మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే మీరు బ్యాక్‌ప్యాకర్స్ హాస్టళ్లలో ఉండవచ్చు. చాలా చౌకగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

విదేశీ పర్యటనలో మరొక ముఖ్యమైన భాగం రవాణా ఖర్చు. దీని కోసం వ్యక్తిగత కారు లేదా క్యాబ్‌లను తీసుకోకుండా ప్రజా రవాణాను ఉపయోగించడం మంచిది.. విదేశాలలో ముఖ్యంగా అమెరికా, యూరప్‌లలో ప్రజా రవాణా చాలా మెరుగ్గా, సౌకర్యవంతంగా ఉంటుంది. అనేక దేశాలు కూడా అన్ని ప్రజా రవాణాలో ప్రయాణించగలిగే సాధారణ ప్రయాణ కార్డ్‌లను కలిగి ఉంటాయి. మీరు ప్రయాణ కార్డులను కొనుగోలు చేసి తక్కువ ఛార్జీల్లోనే ప్రయాణం చేయవచ్చు.

అదేవిధంగా, BlaBlaCar, Lyft, Mobicoop వంటి అనేక రైడ్ షేరింగ్ యాప్‌లు ఉన్నాయి. వాటి సహాయంతో మీరు రైడ్‌ను భాగస్వామ్యం చేయడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు. విదేశీ పర్యటనలో మరొక ముఖ్యమైన భాగం విదేశీ కరెన్సీపై ఖర్చు. దీని కోసం కరెన్సీని మార్చుకోవడానికి విదేశాలకు వెళ్లడం ఖరీదైనది. మీరు దేశం నుండి కరెన్సీని మార్చడం ద్వారా విదేశాలకు వెళ్లవచ్చు. కానీ మీ వద్ద ఎక్కువ నగదు ఉంచడం సరికాదు. ఈ సందర్భంలో ఫారెక్స్ కార్డులు బాగా పని చేస్తాయి. ఫారెక్స్ కార్డ్ అనేది ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డ్. దీనిలో మీరు మీకు నచ్చిన విదేశీ కరెన్సీని లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగంలో ఉన్నాయి. అలాగే విదేశీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇలా విదేశి పర్యటనకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నట్లయితే ఇలాంటి విషయాలు ముందస్తుగా తెలుసుకోవడం ముఖ్యం.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ