AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Payments: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. స్మార్ట్ ఫోన్ కూడా అక్కర్లేదు.. ఎలా అంటే..?

మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదా..? మీ ఫోన్లో ఇంటర్నెట్ లేదా.. అయితే మీరు యూపీఐ చెల్లింపులు సులువుగా చేయవచ్చు. ఇందుకోసం ఎన్‌పీసీఐ అనేక ఆప్షన్లు తీసుకొచ్చింది. వీటి ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం లేనప్పుడు కూడా సెకన్లలోనే పేమెంట్స్ చేసే వెసులుబాటు ఉంది.

UPI Payments: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. స్మార్ట్ ఫోన్ కూడా అక్కర్లేదు.. ఎలా అంటే..?
Upi Payments
Venkatrao Lella
|

Updated on: Apr 20, 2026 | 9:07 PM

Share

దేశంలో యూపీఐ అందుబాటులోకి వచ్చాక బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లలో వేగం పెరిగింది. సెకన్లలోనే లావాదేవీలు చేసుకునే సౌకర్యం రావడంతో దీని వినియోగం అనేది పెరిగింది. ప్రతీ ఏడాది రికార్డ్ స్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నట్లు ప్రభత్వం గణాంకాలు చెబుతున్నాయి. యూపీఐ వచ్చాక బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని తప్పింది. ఇంటి నుంచే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, డబ్బులు ఇతరులకు పంపించడం, ఇతరుల నుంచి డబ్బులు పొందటం లాంటి పనులు సెకన్లలోనే జరిగిపోతున్నాయి. ఇక యూపీఐ యాప్స్ కూడా బోల్డెన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పటికే బ్యాంకింగ్ యాప్స్‌తో పాటు ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలు కొత్తగా యూపీఐ యాప్స్ తెస్తున్నాయి.

ఇంటర్నెట్ లేకపోయినా పేమెంట్స్

అయితే యూపీఐ పేమెంట్స్ చేయాలంటే స్మార్ట్ ఫోన్‌తో పాటు అందులో ఇంటర్నెట్ ఉండాలని చాలామంది అనుకుంటుంటారు. అయతే ఇంటర్నెట్ లేకపోయినా, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఇందుకోసం 4 మార్గాలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. దీంతో ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌పీసీఐ ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ లేకపోయినా పేమెంట్స్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది. మిస్డ్ కాల్, ఐవీఆర్ విధానం, ఫీచర్ ఫోన్ కోసం ప్రత్యేక యాప్ లాంటివి ఉన్నాయి.

మిస్డ్ కాల్ ద్వారా..

080 4516 3666, 080 4516 3581, 6366 200 200 నెంబర్ల ద్వారా మీరు యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. ఐవీఆర్ నెంబర్‌కు కాల్ చేసి లావాదేవీ విధానాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత యూపీఐని నమోదు చేస్తే సరిపోతుంది. ఇక వ్యాపార సంస్థ అందించిన నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా డబ్బులు చెల్లించవచ్చు. మీరు నెంబర్‌కు కాల్ చేశాక ఐవీఆర్ కాల్ వస్తుంది. అందులో మీరు డబ్బు బదిలీ చేయాలనుకుంటున్నారనేది నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎంత చెల్లించాలనేది ఎంటర్ చేయాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు బదిలీ అవుతాయి.

ప్రత్యేక యాప్

ఇక ఫీచర్ ఫోన్ల కోసం డిజిటల్ సొల్యూషన్ అనే యాప్ తీసుకొచ్చారు. దీనిని గుప్ షప్, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్‌, జీయోపే, జియో పేమెంట్స్ బ్యాంకుతో కలిసి అభివృద్ది చేశారు. కెమెరా ఉన్న ఫోన్ల నుంచి స్కాన్ అండ్ పే ఉపయోగించి దీని ద్వారా చెల్లింపులు చేయాలి. యాప్‌ను ఓపెన్ చేశాక నంబర్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఎంచుకోవాలి. ఓటీపీని ఎంటర్ చేసి యూపీఐ ఐడీని క్రియేట్ చేయాలి. పిన్‌ను సెట్ చేసుకుని చెల్లింపులు చేయాలి. ఇక నాలుగో విధానం మర్చంట్ టెర్మినల్, కస్టమర్ ఫోన్ మధ్య ఆడియో సిగ్నల్స్ ఉపయోగించి లావాదేవీలు చేయవచ్చు.

Follow Us