AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: హోమ్ లోన్ టెన్షన్ అక్కర్లేదు.. ఈ ట్రిక్స్ తెలిస్తే లక్షల రూపాయలు ఆదా..

సొంత ఇల్లు కట్టుకోవడమే లక్ష్యంగా 20-25 ఏళ్ల కాలపరిమితితో హోమ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే తీసుకున్న అసలు కంటే బ్యాంకుకు కట్టే వడ్డీయే ఎక్కువవుతోందని దిగులు చెందుతున్నారా? ఇక ఆ భయం అక్కర్లేదు.. సరైన ప్లానింగ్ ఉంటే చాలు.. 20 ఏళ్ల రుణాన్ని కేవలం 10 నుంచి 12 ఏళ్లలోనే పూర్తిగా తీర్చివేయడమే కాకుండా ఏకంగా రూ. 10 నుంచి 15 లక్షల వరకు వడ్డీని సులభంగా ఆదా చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..

Home Loan: హోమ్ లోన్ టెన్షన్ అక్కర్లేదు.. ఈ ట్రిక్స్ తెలిస్తే లక్షల రూపాయలు ఆదా..
Home Loan Repayment Tips
Krishna S
|

Updated on: Oct 08, 2026 | 4:36 PM

Share

సొంత ఇంటి కల సాకారం చేసుకోవడానికి మెజారిటీ మధ్యతరగతి ప్రజలు హోమ్ లోన్‌పైనే ఆధారపడుతుంటారు. అయితే 20 నుంచి 25 ఏళ్ల పాటు నెలనెలా ఈఎంఐలు కట్టడమంటే జీవితంలో అధిక భాగం అప్పుల ఊబిలోనే గడపాల్సి వస్తుందనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. కానీ సరైన ఆర్థిక క్రమశిక్షణ, ముందస్తు ప్రణాళిక పాటిస్తే 20 ఏళ్ల గృహ రుణాన్ని కేవలం 10 నుంచి 12 ఏళ్లలోనే పూర్తిగా తీర్చివేయడమే కాకుండా, లక్షల రూపాయల వడ్డీని ఆదా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 8.5శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ.30 లక్షల హోమ్ లోన్‌ను 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకున్నారనుకుందాం.. అప్పుడు ఈఎంఐ ఇలా

  • నెలవారీ ఈఎంఐ: సుమారు రూ. 26,035
  • 20 ఏళ్లలో చెల్లించే మొత్తం వడ్డీ: సుమారు రూ. 32.48 లక్షలు
  • మొత్తం తిరిగి చెల్లించే మొత్తం: సుమారు రూ. 62.48 లక్షలు

అంటే తీసుకున్న అసలు కంటే బ్యాంకుకు చెల్లించే వడ్డీయే ఎక్కువ. అయితే చిన్నపాటి వ్యూహాలతో ఈ భారీ వడ్డీ భారాన్ని ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.

లోన్ వేగంగా తీర్చే 4 సూత్రాలు

సంవత్సరానికి ఒక అదనపు ఈఎంఐ

ప్రతి క్యాలెండర్ సంవత్సరంలో రెగ్యులర్ 12 ఈఎంఐలతో పాటు అదనంగా మరో ఈఎంఐ నేరుగా అసలు కింద జమ చేయండి. కేవలం ఈ ఒక్క పని చేయడం వల్ల మీ 20 ఏళ్ల లోన్ దాదాపు 16-17 ఏళ్లకే ముగుస్తుంది; లక్షల రూపాయల వడ్డీ ఆదా అవుతుంది.

ఈఎంఐ స్టెప్ అప్ పద్ధతి

కెరీర్‌లో వార్షిక ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సాధారణం. ప్రతి సంవత్సరం మీ వార్షిక ఆదాయం పెరిగినప్పుడు, మీ ఈఎంఐ మొత్తాన్ని కూడా 5శాతం నుండి 10శాతం వరకు పెంచండి లేదా అదనపు ఈఎంఐల సంఖ్యను పెంచుతూ వెళ్లండి. దీనివల్ల లోన్ కాలపరిమితి ఏకంగా సగానికి తగ్గిపోతుంది.

బోనస్‌లు, అదనపు ఆదాయంతో అసలు తగ్గింపు

కంపెనీ ఇచ్చే వార్షిక బోనస్, పన్ను రీఫండ్‌లు , లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల మెచ్యూరిటీ వంటి అదనపు మొత్తాలు చేతికి వచ్చినప్పుడు వాటిని ఖర్చు చేయకుండా నేరుగా లోన్ ప్రీ-పేమెంట్‌కు కేటాయించండి. హోమ్ లోన్ ప్రారంభ సంవత్సరాల్లో అసలు ఎంత తగ్గితే, మిగిలిన కాలానికి వడ్డీ భారం అంత వేగంగా పడిపోతుంది.

వడ్డీ రేట్ల సమీక్ష – బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్

ప్రస్తుతం మీరు చెల్లిస్తున్న వడ్డీ రేటును మార్కెట్ రేట్లతో ఎప్పటికప్పుడు పోల్చి చూసుకోండి. మార్కెట్‌లో తక్కువ వడ్డీ లభిస్తుంటే, మీ ప్రస్తుత బ్యాంక్‌తో మాట్లాడి రేటు తగ్గించుకోవడం లేదా తక్కువ రేటు ఆఫర్ చేసే ఇతర బ్యాంకులకు లోన్ బదిలీ చేయడం ప్రయోజనకరం.

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య నిబంధన

ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉన్న వ్యక్తిగత గృహ రుణాలపై ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రీ-పేమెంట్ లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఉండవు. కాబట్టి ఎప్పుడు అదనపు మొత్తం ఉన్నా బ్యాంకును సంప్రదించి, ఆ మొత్తాన్ని ‘లోన్ ప్రిన్సిపల్’కు జమ చేయమని స్పష్టంగా పేర్కొనడం ద్వారా రుణ విముక్తిని వేగవంతం చేసుకోవచ్చు.

Follow Us
హోమ్ లోన్ టెన్షన్ అక్కర్లేదు.. ఈ ట్రిక్స్ తెలిస్తే లక్షల రూపాయలు
హోమ్ లోన్ టెన్షన్ అక్కర్లేదు.. ఈ ట్రిక్స్ తెలిస్తే లక్షల రూపాయలు
రాజ్యాంగ సంస్థలపై దాడులపై 42 మంది మాజీ జడ్జిల వార్నింగ్!
రాజ్యాంగ సంస్థలపై దాడులపై 42 మంది మాజీ జడ్జిల వార్నింగ్!
వందల ఏళ్లుగా గ్రామంలో పెళ్లిళ్లు జరగవు.. రేణుకా మాత కథే కారణమా?
వందల ఏళ్లుగా గ్రామంలో పెళ్లిళ్లు జరగవు.. రేణుకా మాత కథే కారణమా?
మనం ఇద్దరం గత జన్మ ప్రేమికులమని ఆయకు వేధింపులు..
మనం ఇద్దరం గత జన్మ ప్రేమికులమని ఆయకు వేధింపులు..
మైనర్‌పై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ లైంగిక దాడి!
మైనర్‌పై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ లైంగిక దాడి!
బద్ధకంతో పనులు వాయిదా వేస్తే ఇలాగే జరుగుతుంది.. కాకి - చిలుక కథ
బద్ధకంతో పనులు వాయిదా వేస్తే ఇలాగే జరుగుతుంది.. కాకి - చిలుక కథ
ఆలోచిస్తేనే భయమేస్తోంది.. ప్రత్యర్థులకు ఏబీడీ మాస్ వార్నింగ్..!
ఆలోచిస్తేనే భయమేస్తోంది.. ప్రత్యర్థులకు ఏబీడీ మాస్ వార్నింగ్..!
మనుషుల వల్ల ఈ అందమైన పక్షి గొంతే మారిపోయింది..హిమాలయాల్లో షాకింగ్
మనుషుల వల్ల ఈ అందమైన పక్షి గొంతే మారిపోయింది..హిమాలయాల్లో షాకింగ్
అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది
అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది
మేఘాలయ రాష్ట్రంలో తెలుగు సినిమా.. CM సంగ్మా ఎమోషనల్
మేఘాలయ రాష్ట్రంలో తెలుగు సినిమా.. CM సంగ్మా ఎమోషనల్