AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రాజ్యాంగ సంస్థలు ఎవరి సొత్తు కాదు’.. 42 మంది మాజీ న్యాయమూర్తుల ఘాటు వ్యాఖ్యలు!

మాజీ న్యాయమూర్తులు, అధికారులు రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న విమర్శలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని హెచ్చరించారు. ఆధారాలు లేని ఆరోపణలు, ఈవీఎంల వివాదం, ఓటర్ల జాబితా సవరణపై అనవసర గందరగోళం సృష్టించడం సరికాదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, మీడియా, పౌరులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ సంస్థలు ఏ ఒక్కరి సొత్తు కాదని, వాటి విశ్వాసాన్ని కాపాడటం దేశ ప్రజల బాధ్యత అని పిలుపునిచ్చారు.

‘రాజ్యాంగ సంస్థలు ఎవరి సొత్తు కాదు’.. 42 మంది మాజీ న్యాయమూర్తుల ఘాటు వ్యాఖ్యలు!
Ex Bureaucrats Notice
Balaraju Goud
|

Updated on: Oct 08, 2026 | 4:32 PM

Share

దేశంలోని రాజ్యాంగ సంస్థలపై, ముఖ్యంగా ఎన్నికల సంఘం, ఉన్నత న్యాయవ్యవస్థపై జరుగుతున్న విమర్శలపై 42 మంది మాజీ న్యాయమూర్తులు, పదవీ విరమణ చేసిన అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు దేశ పౌరులను ఉద్దేశించి వారు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రాజకీయ వేదికలపై ఎన్నికల సంఘం అధికారులు, న్యాయస్థానాలపై అవమానకరమైన భాషను ఉపయోగించడం ఆందోళనకరమని లేఖలో పేర్కొన్నారు. కొందరు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓట్ల దొంగతనం జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్నప్పటికీ, అదే ఆరోపణలకు సంబంధించి కోర్టుల్లో అఫిడవిట్లు, ఆధారాలు సమర్పించే విషయంలో వెనక్కి తగ్గుతున్నాయని వారు విమర్శించారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు అదే EVMలపై ఆధారపడే పార్టీలు ఓటమి ఎదురైనప్పుడు మాత్రం వాటి విశ్వసనీయతను ప్రశ్నించడం సరికాదని పేర్కొన్నారు.

SIRపై కూడా ప్రస్తావన..!

ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (SIR)పై జరుగుతున్న వివాదాన్ని కూడా మాజీ న్యాయమూర్తులు, అధికారులు ప్రస్తావించారు. 1950 చట్టం ప్రకారం ఓటర్ల జాబితాల సవరణకు చట్టపరమైన ఆధారం ఉందని తెలిపారు. మరణించిన వారు, ఒక ప్రాంతం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిన వారు లేదా అర్హత లేని పేర్లను తొలగించడం, కొత్తగా అర్హత పొందిన పౌరుల పేర్లను చేర్చడం వంటి చర్యలు ఎన్నికల జాబితాలను మరింత ఖచ్చితంగా ఉంచేందుకు ఉద్దేశించినవేనని వివరించారు. నిష్పక్షపాత, విశ్వసనీయ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలను నిరంతరం సరిచేయడం అవసరమని వారు పేర్కొన్నారు. అయితే ఈ పరిపాలనా ప్రక్రియను కుట్రగా చిత్రీకరించడం ద్వారా ప్రజల్లో అనవసరమైన అనుమానాలు, గందరగోళం సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల విశ్వాసమే ప్రజాస్వామ్యానికి బలం

ఎన్నికల వ్యవస్థపై ప్రజలు విశ్వాసం కోల్పోతే దాని ప్రభావం ప్రజాస్వామ్యంపై తీవ్రంగా ఉంటుందని లేఖలో హెచ్చరించారు. ప్రజల్లో పెరిగే అవిశ్వాసం సామాజిక ఉద్రిక్తతలకు దారితీయవచ్చని, దానిని దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలు ఏ ఒక్క ప్రభుత్వం, రాజకీయ పార్టీకి చెందినవి కావని.. అవి దేశ ప్రజలందరికీ చెందినవని గుర్తుచేశారు. వాటి విశ్వసనీయతను దెబ్బతీయడం అంటే పౌరుల ప్రజాస్వామ్య హక్కులపై ప్రభావం చూపడమేనని తెలిపారు.

రాజకీయ పార్టీలు, మీడియా, సంస్థలు, ప్రజలకు సూచనలు!

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తీవ్రంగా పోటీ చేయవచ్చని, అయితే రాజ్యాంగ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదని సూచించారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే ఆధారాలతో ఎన్నికల సంఘం లేదా న్యాయస్థానాలను ఆశ్రయించాలని కోరారు. మీడియా సంస్థలు కూడా దర్యాప్తు, ఆధారాలు లేకుండా వచ్చే ఆరోపణలు, పుకార్లను వార్తలుగా ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ సంస్థలు పూర్తి పారదర్శకతతో, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పనిచేయాలని సూచించారు.

అదే సమయంలో పౌరులు కూడా రాజకీయ వాదనలను గుడ్డిగా నమ్మకుండా వాస్తవాలను పరిశీలించాలని, విశ్వసనీయ ఆధారాల ఆధారంగానే నిర్ణయాలకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల ఓటు శక్తిపై, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని 42 మంది మాజీ న్యాయమూర్తులు, అధికారులు తమ బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాజ్యాంగ సంస్థలపై దాడులపై 42 మంది మాజీ జడ్జిల వార్నింగ్!
రాజ్యాంగ సంస్థలపై దాడులపై 42 మంది మాజీ జడ్జిల వార్నింగ్!
వందల ఏళ్లుగా గ్రామంలో పెళ్లిళ్లు జరగవు.. రేణుకా మాత కథే కారణమా?
వందల ఏళ్లుగా గ్రామంలో పెళ్లిళ్లు జరగవు.. రేణుకా మాత కథే కారణమా?
మనం ఇద్దరం గత జన్మ ప్రేమికులమని ఆయకు వేధింపులు..
మనం ఇద్దరం గత జన్మ ప్రేమికులమని ఆయకు వేధింపులు..
మైనర్‌పై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ లైంగిక దాడి!
మైనర్‌పై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ లైంగిక దాడి!
బద్ధకంతో పనులు వాయిదా వేస్తే ఇలాగే జరుగుతుంది.. కాకి - చిలుక కథ
బద్ధకంతో పనులు వాయిదా వేస్తే ఇలాగే జరుగుతుంది.. కాకి - చిలుక కథ
ఆలోచిస్తేనే భయమేస్తోంది.. ప్రత్యర్థులకు ఏబీడీ మాస్ వార్నింగ్..!
ఆలోచిస్తేనే భయమేస్తోంది.. ప్రత్యర్థులకు ఏబీడీ మాస్ వార్నింగ్..!
మనుషుల వల్ల ఈ అందమైన పక్షి గొంతే మారిపోయింది..హిమాలయాల్లో షాకింగ్
మనుషుల వల్ల ఈ అందమైన పక్షి గొంతే మారిపోయింది..హిమాలయాల్లో షాకింగ్
అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది
అర్ధరాత్రి ఆలయంలో జేసీబీలతో తవ్వకాలు..ఏం జరిగింది
మేఘాలయ రాష్ట్రంలో తెలుగు సినిమా.. CM సంగ్మా ఎమోషనల్
మేఘాలయ రాష్ట్రంలో తెలుగు సినిమా.. CM సంగ్మా ఎమోషనల్
మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు.. కేంద్రం అద్బుత స్కీమ్..
మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు.. కేంద్రం అద్బుత స్కీమ్..