ఇప్పుడే వద్దు.. UPI పేమెంట్స్‌పై MDR ఛార్జీలు అప్పటివరకు వాయిదా..!
యూపీఐ చెల్లింపులపై కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని P2M లావాదేవీలపై 0.4 శాతం MDR అమలు చేయాల్సి ఉండగా.. దీనిని 2027 జనవరి 1 వరకు వాయిదా వేయాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఈ ప్రతిపాదనపై NPCI, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం.

దేశవ్యాప్తంగా అక్టోబర్ 15, 2026 నుంచి మర్చంట్ ట్రాన్సాక్షన్స్ చెల్లింపులపై యూపీఐ ఛార్జీలను వసూలు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం, NPCI నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఎండీఆర్ (MDR – Merchant Discount Rate) చార్జీలు.. అంటే డిజిటల్ చెల్లింపులను (డెబిట్/క్రెడిట్ కార్డ్స్, క్యూఆర్ కోడ్ స్కాన్, యూపీఐ మొదలైనవి) అంగీకరించినందుకు వ్యాపారులు, బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. యూపీఐ స్టీరింగ్ కమిటీ ప్రకారం.. రూ.2వేల కంటే ఎక్కువ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వసూలు చేయనున్నారు. దీని ప్రకారం రూ.2వేల ఖర్చుపై రూ.8, అలాగే రూ.10వేల చెల్లింపులపై రూ.40 ఎండీఆర్ పడుతుంది. ఈ నిర్ణయంపై ఇప్పటికే వ్యాపార సంఘాలతో పాటు చిరు వ్యాపారుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో యుపిఐ (UPI) లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పునరుద్ధరణను లేదా నూతన నిబంధనల అమలును ఈ ఏడాది చివర వరకు పొడిగించి, 2027 జనవరి 1 నుండి అమలు చేయాలని పరిశ్రమ వర్గాలు, ఫిన్‌టెక్ (Fintech) సంస్థలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ని కోరాయి.
అకస్మాత్తుగా లేదా తక్కువ వ్యవధిలో ఎంబోసింగ్/ఎండ్‌పాయింట్ ఛార్జీలు వర్తింపజేస్తే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై, ముఖ్యంగా చిన్న వ్యాపారులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫిన్‌టెక్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. సాంకేతిక మార్పులు, వ్యాపారులకు అవగాహన కల్పించడానికి మరింత సమయం కావాలని కోరాయి.
డిజిటల్ చెల్లింపుల వృద్ధికి ముప్పు:
ప్రస్తుతం జీరో-ఎమ్‌డిఆర్ (Zero-MDR) విధానం వల్ల దేశవ్యాప్తంగా సామాన్య వ్యాపారులు, వినియోగదారులు డిజిటల్ చెల్లింపులను విరివిగా వాడుతున్నారు. ఒకవేళ ఛార్జీల విధానం ఆమోదించినా, దానికి తగిన సమయం ఇచ్చి 2027 ప్రారంభం నుండి అమలు చేయడమే శ్రేయస్కరమని అభిప్రాయపడ్డాయి.
ఆదాయం – నిర్వహణ వ్యయం: టెర్మినల్స్, పిఓఎస్ (POS) యంత్రాల నిర్వహణ, మరియు నెట్‌వర్క్ రక్షణ కోసం కొంత మేర ఆదాయం అవసరమైనప్పటికీ, రాత్రికి రాత్రే కొత్త నిబంధనలు తెస్తే యుపిఐ వాడకం తగ్గే ప్రమాదం ఉందని స్పష్టం చేశాయి.
భారత్‌లో యుపిఐ లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న తరుణంలో, ఎమ్‌డిఆర్ అమలు పై పరిశ్రమ వర్గాలు చేసిన ఈ విజ్ఞప్తిపై ఎన్‌పిసిఐ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.. దీనిపై కేంద్ర ప్రభుత్వం.. ఎన్‌పిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాలి..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
